Kalki North America Collections: రెబల్ స్టార్ ప్రభాస్- నాగ్ అశ్విన్ 'కల్కి 2898 AD' బౌండరీలు దాటుతూ రికార్డులు సృష్టిస్తోంది. డే-1 నుంచే సూపర్ హిట్ టాక్ అందుకున్న కల్కి వరల్డ్‌వైడ్‌గా ఇప్పటికే రూ.800కోట్ల కలెక్షన్ వసూల్ చేసి రూ.1000 కోట్ల వైపు దూసుకుపోతోంది. కల్కికి వస్తున్న రెస్పాన్స్‌తో త్వరలోనే ఈ మార్క్ అందుకుంటుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ క్రమంలోనే అటు ఓవర్సీస్లోనూ కల్కి మేనియా నడుస్తోంది.
ఈ సినిమా రిలీజ్ రోజు నుంచే అమెరికా బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తోంది. విడుదల రోజు నుంచి కల్కి నార్త్ అమెరికాలో కాసుల వర్షం కురిపిస్తోంది. 10 రోజుల్లోనే భారీ స్థాయిలో కలెక్షన్లు సాధించింది. ఇప్పటివరకు నార్త్ అమెరికాలో కల్కి 15.5 మిలియన్ డాలర్లు వసూల్ చేసింది. ఈ క్రమంలో అక్కడ తొలి 10 రోజుల్లో అత్యధిక వసూళ్లు సాధించిన సౌత్ ఇండియాన్ సినిమాగా నిలిచింది. ఇక ఓవరాల్‌గా బాహుబలి-2 తర్వాత రెండో స్థానంలో కొనసాగుతోంది. నార్త్ అమెరికాలో 'బాహుబలి- 2' 20.7 మిలియన్ డాలర్లు వసూల్ చేసి టాప్‌లో ఉంది. అయితే కల్కి ఇప్పటిరే 15.5 మిలియన్ డాలర్లు క్రాస్ చేసింది. దీంతో త్వరలోనే 'బాహుబలి- 2' రికార్డును కూడా 'కల్కి' ఈజీగా దాటేసే ఛాన్స్ ఉంది. ఇదిలా ఉంటే మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా రూ. 191 కోట్లతో సంచలనం సృష్టించిన ఈ సినిమా 10రోజుల్లో రూ.800 కోట్లు క్రాస్ చేసినట్లు మూవీటీమ్ అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది.
#Kalki2898AD soars to new heights ❤️🔥
— Prathyangira Cinemas (@PrathyangiraUS) July 7, 2024
North America Gross ~ $15.5 MILLION+ & Counting! 💥
Record Breaking Epic 🔥#Prabhas #EpicBlockbusterKalki @VyjayanthiFilms @Kalki2898AD pic.twitter.com/sXAYQzbMiE
కాగా, జూన్ 27న రిలీజైన ఈ మూవీ సూపర్ సక్సెస్ సాధించింది. దీంతో వచ్చే ఏడాది నాటికి కల్కి సీక్వెల్ తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. క్రియేటివ్ డైరెక్టర్ అని ప్రూవ్ చేసుకున్న నాగ్ అశ్విన్ యానిమేషన్‌తో కురుక్షేత్ర యుద్ధ సన్నివేశాలను కళ్లకు కట్టినట్లుగా చూపించగలిగారు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ స్కోరును అందించిన సంతోష్ నారాయణన్ మంచి మార్కులు పడ్డాయి. నిర్మాత అశ్వనీదత్ ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో రూపొందించారు.
'ఆ ముగ్గురి మధ్య భీకర పోరాటం - అసలు కథ మొదలయ్యేది అప్పుడే' - Kalki 2898 AD