Kalki 2898 AD Hindi Collections : దేశం మొత్తం మూవీ లవర్స్ ఆసక్తిగా ఎదురుచూసిన 'కల్కి 2898 AD' మూవీ నేడు (జూన్ 27)న రిలీజ్ అయ్యి బాక్సఫీస్ వద్ద సూపర్‌హిట్ టాక్‌తో దూసుకెళ్తోంది.ప్రభాస్, దీపికా పదుకొణె, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి స్టార్లు నటించిన ఈ 3D సైన్స్ ఫిక్షన్, మైథాలజీ సినిమా ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. అంచనాలకు మించి కలెక్షన్లు వర్షం కురిపిస్తోంది. ట్రేడ్ ఎక్స్‌పర్ట్స్ ప్రకారం, ఈ సినిమా గురువారం ఒక్క రోజులోనే ప్రపంచవ్యాప్తంగా రూ.200 కోట్ల ఆదాయాన్ని అందుకున్నట్లు సమాచారం.
హిందీలోనూ కలెక్షన్ల వర్షం
ట్రేడ్ అనలిస్ట్‌ల అంచనా ప్రకారం, 'కల్కి 2898 AD' భారత్‌లో మొదటి రోజు రూ.100- 110 కోట్లు వసూలు చేస్తుందని, ప్రపంచవ్యాప్తంగా రూ.200 కోట్లు దాటుతుందని అంటున్నారు. గత ఆరు నెలలుగా పెద్దగా హిట్ లేని హిందీ మూవీ ఇండస్ట్రీకి, ఈ సినిమా చాలా అవసరం అంటూ పేర్కొంటున్నారు. హిందీలో కూడా 'కల్కి 2898 AD'లో అతిపెద్ద ఓపెనింగ్స్ రాబట్టిన మూవీగా నిలిచింది. రూ.20.50 కోట్లు ఆర్జించిన 'ఫైటర్'ని అధిగమించింది.
యూఎస్, కెనడా, ఇతర ప్రాంతాల్లో ప్రీమియర్ డే సుమారు USD 4 మిలియన్ల వసూళ్లు రాబట్టిందని నివేదికలు సూచిస్తున్నాయి. Sacnilk మేరకు, 2022లో నార్త్ అమెరికా ప్రీమియర్‌లో USD 3.3 మిలియన్లను ఆర్జించిన 'RRR' రికార్డును ఇప్పుడు 'కల్కి' అధిగమించినట్లు తెలుస్తోంది.
బుక్‌మైషోలో కొత్త రికార్డులు
భారత్‌లో ఇప్పటికే ఈ వేదికగా సుమారు 1.5 మిలియన్లకు పైగా టిక్కెట్లు బుక్ అయ్యాయట. ముఖ్యంగా బెంగళూరు, విశాఖపట్నం, చెన్నై, తిరుపతి వంటి నగరాల్లో మూవీకి భారీ క్రేజ్ కనిపించినట్లు సమాచారం. అందులోనూ హిందీ, తెలుగు వెర్షన్‌లకు మంచి ఆదరణ దక్కిందని టాక్ నడుస్తోంది.
ధరలు పెరిగినా వెనక్కి తగ్గని ఫ్యాన్స్
ఇక నిర్మాణ సంస్థ కూడా ఆయా ప్రభుత్వాల అనుమతితో టిక్కెట్ల రేట్లు పెంచారు. పీవీఆర్‌లో ప్రీమియం లాంజ్ షోలకు రూ.2,300 పెట్టాలి. హైదరాబాద్‌లో టిక్కెట్ ధరలు రూ.70-80 పెరిగాయి. అయినప్పటికీ, థియేటర్లకి వచ్చే అభిమానుల సంఖ్య ఏమాత్రం తగ్గలేదట.
ఇక దాదాపు 45% మంది వీక్షకులు 3D, IMAX ఫార్మాట్‌లను ఎంచుకుంటున్నట్లు తెలుస్తోంది. మల్టీప్లెక్స్‌లు, సింగిల్ స్క్రీన్ థియటర్స్‌లో మూవీ చూడటానికి ప్రేక్షకులు ఆసక్తి చూపుతున్నారు.
మరోవైపు భారీ సక్సెస్‌తో 'కల్కి 2898 AD' సెకండ్ పార్ట్‌పై అప్పుడే అంచనాలు పెరిగిపోయాయి. హైదరాబాద్, ముంబయి సహా అనేక నగరాల్లో థియేటర్ల వెలుపల భారీ సంఖ్యలో రద్దీ కనిపిస్తోంది. సినిమాకి మొదటి నుంచి వస్తున్న రివ్యూలు పాజిటివ్‌గా ఉన్నాయి.
"డార్లింగ్ చంపేశాడంతే! -పూర్తిగా మరో ప్రపంచంలోకి వెళ్లిపోయా"