ETV Bharat / entertainment

ప్రభాస్​ ఫ్యాన్స్​కు అదిరే అప్డేట్​ - వరే వరే వరే వచ్చేశాడు రాజా సాబ్ - Rajasaab Movie - RAJASAAB MOVIE

Prabhas The Raja Saab Movie : 'కల్కి'తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధంగా ఉన్న ప్రభాస్​ రాజా సాబ్​ చిత్రంలోనూ నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ మూవీ నుంచి అదిరే అప్డేట్​ వచ్చింది. పూర్తి వివరాలు స్టోరీలో.

source ETV Bharat
Prabhas (source ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Jun 26, 2024, 6:39 AM IST

Prabhas The Raja Saab Movie : ఇప్పుడు ఎక్కడ చూసినా అంతా 'కల్కి' సినిమా ఫీవరే కనిపిస్తోంది. అందరూ దీని గురించే మాట్లాడుకుంటున్నారు. సినీ ప్రియులు అంతా దీని కోసమే ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ప్రభాస్ కూడా ఈ మూవీ ప్రమోషన్స్​తోనే బిజీగా గడుపుతున్నాడు. అయితే రెబల్ స్టార్​ ఈ చిత్రంతో పాటు మరికొన్ని సినిమాలను కూడా లైనప్​లో పెట్టిన సంగతి తెలిసిందే.

అందులో 'ది రాజా సాబ్' కూడా ఒకటి. మారుతి దర్శకత్వంలో హారర్ కామెడీగా తెరకెక్కుతోంది. సీక్రెట్‌గా షూటింగ్​ మొదలు పెట్టిన ఈ చిత్రాన్ని చాలా షెడ్యూళ్లు జరిపిన తర్వాత అఫీషియల్​గా అనౌన్స్​ చేశారు. మిగిలిన చిత్రీకరణను వీలైనంత త్వరగానే కంప్లీట్ చేసేలా చిత్ర యూనిట్ ప్లాన్​ చేసుకుంటూ ముందుకు వెళ్తోంది.

అయితే ఈ చిత్ర రిలీజ్ డేట్​ గురించి చాలా రోజులు నుంచి రకరకాల ప్రచారాలు సాగుతున్నాయి. కొంతమందేమో 2024లోనే విడుదల చేస్తారని, మరికొందరు 2025లో రిలీజ్ చేస్తారని టాక్స్ వినిపిస్తున్నాయి. దీంతో ప్రభాస్ అభిమానులు అయోమయంలో ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రాజాసాబ్​ మూవీటీమ్​ ఓ సర్‌ప్రైజ్ అప్డేట్ ఇచ్చింది.

ఈ మూవీ మ్యూజిక్ సిట్టింగ్స్ ప్రారంభమైనట్లు దర్శకుడు మారుతి సోషల్ మీడియాలో తెలిపారు. తమన్​తో కలిసి దిగిన ఫొటోను పంచుకున్నారు. 'వరే వరే వరే వచ్చేశాడు రాజా సాబ్' అనే థీమ్ సౌండ్ క్లిప్‌ను షేర్ చేశారు. దీంతో ఈ ఊహించని సర్‌ప్రైజ్‌కు ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.

కాగా, హర్రర్ థ్రిల్లర్ కాన్సెప్ట్​తో రాబోతున్న 'ది రాజా సాబ్'లో ప్రభాస్​తో పాటు నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో సంజయ్ దత్ కీలక పాత్రలో నటిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌ నిర్మిస్తోంది. టీజీ విశ్వప్రసాద్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. తమన్ స్వరాలు సమకూరుస్తున్నాడు. ఇక సలార్‌తో భారీ విజయాన్ని అందుకున్న ప్రభాస్‌ ప్రస్తుతం కల్కి 2898 ఏడీతో మరో భారీ సక్సెస్​ను ఖాతాలో వేసుకోని రికార్డులను తిరగరాయాలని ఎదురుచూస్తున్నారు.

దుమ్మురేపుతున్న 'కల్కి' బుకింగ్స్​ - 5 లక్షలకు పైగా టికెట్లు సోల్డ్ ఔట్​! - kalki 2898AD Bookings

ఎన్నేళ్లైనా దాన్ని అస్సలు మర్చిపోలేను : రాశీ ఖన్నా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.