ETV Bharat / entertainment

'కల్కి 2'లో భైరవకు తోడుగా దుల్కర్​, విజయ్ దేవరకొండ : నాగ్ అశ్విన్ సమాధానమిదే - NagAshwin on Kalki Part 2 Rumours - NAGASHWIN ON KALKI PART 2 RUMOURS

Nag Ashwin Kalki 2898 AD Part 2 : కల్కి 2898 ఏడీ పార్ట్‌ 2 గురించి సోషల్​ మీడియాలో ప్రచారం అవుతున్న కొన్ని ఊహాగానాలకు ఆసక్తికర సమాధానాలు ఇచ్చారు దర్శకుడు నాగ్ అశ్విన్. అవేంటంటే?

source IANS And Getty Images
Nag Ashwin Kalki 2898 AD Part 2 (source IANS And Getty Images)
author img

By ETV Bharat Telugu Team

Published : Aug 21, 2024, 10:33 AM IST

Nag Ashwin Kalki 2898 AD Part 2 : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ నటించిన కల్కి 2898 ఏడీ రీసెంట్​గా విడుదలై బాక్సాఫీస్ ముందు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. దాదాపు రూ.1100 కోట్లకుపైగా వసూళ్లను సాధించింది. ఇప్పుడు ఓటీటీలోకి(kalki 2898 AD OTT Release) కూడా వచ్చేయనుంది. ఆగస్ట్​ 22 నుంచి అమెజాన్, నెట్​ఫ్లిక్స్​లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ పార్ట్‌2పై సోషల్​ మీడియాలో ప్రచారం అవుతున్న కొన్ని ఊహాగానాలకు ఇంట్రెస్టింగ్​ ఆన్సర్స్ ఇచ్చారు.

సుమతి(దీపికా పదుకొణె)కు పుట్టిన బిడ్డనే సుప్రీం యాస్కిన్‌ను అంతం చేస్తారని ప్రచారం సాగగా, అలా జరగదని చెప్పారు నాగ్ అశ్విన్. దానికోసం భైరవ(ప్రభాస్) ఉన్నాడని, అతడే ఈ కథకు హీరో అని బదులిచ్చారు.

రెండో భాగంలో బుజ్జి వైట్‌ హార్స్‌లా మారుతుందని టాక్ వినిపించగా, ఇది చాలా గొప్ప ఆలోచన కానీ అలా జరగదని అన్నారు.

విజయ్‌ దేవరకొండ పాత్ర రెండో భాగంలో ఎక్కువ ఉంటుందని, భైరవకు మరింత బలాన్నిస్తాడని నెటిజన్లు మాట్లాడుకోగా, ఈ విషయం చాలా ఆసక్తికరంగా ఉంది. కానీ ఇది రూమర్‌ అని క్లారిటీ ఇచ్చారు.

దుల్కర్‌ సల్మాన్‌ సెకండ్​ పార్ట్‌లో కనిపించి, ప్రభాస్‌ పాత్ర వెనక ఉన్న మరో నిజాన్ని చెబుతారు అని ప్రచారం సాగగా, అది కూడా నిజం కాదని చెప్పారు.

దీపికా పదుకొణెకు పుట్టిన అబ్బాయిగా ప్రభాస్‌ను చూపిస్తారని మరో ప్రచారం సాగగా, ఈ పాయింట్​ అమెరికన్‌ సైన్స్‌ ఫిక్షన్‌ యాక్షన్‌ మూవీ ది టెర్మినేటర్‌ స్టోరీలా ఉంది, ఇది కల్కి కథ కాదు అని స్పష్టత నిచ్చారు.

ఫైనల్​గా "మీ ఊహాగానాలు, ప్రచారాలు ఎంతో ఆసక్తికరంగా అనిపించాయి. ఇలాంటివి మరిన్ని ప్రశ్నలు నన్ను అడగండి. అప్పుడు రెండో భాగానికి సంబంధించి నా పని మరింత సులభం అవుతుంది. ఇక కల్కిని ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి" అని చెప్పుకొచ్చారు.

ఇకపోతే కల్కి సినిమాలో ప్రభాస్​తో పాటు అమితాబ్​ బచ్చన్​ అశ్వత్థామ పాత్ర హైలైట్​గా నిలిచింది. దీపికా పదుకొణె, కమల్ హాసన్, దిశా పటానీ కీలక పాత్రలు పోషించారు.

ఆగని 'స్ట్రీ 2' కలెక్షన్ల జోరు - ఒక్క సాంగ్​ కోసం తమన్నా ఎంత వసూలు చేసిందంటే? - Stree 2 Tamannaah remuneration

సమంత వల్ల ట్రెండింగ్​లోకి వచ్చిన 'పికిల్ బాల్'​ - అసలేంటీ గేమ్, రూల్స్ ఎలా ఉంటాయి? - Samantha Pickleball Game

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.