Kalki 2898 AD Bujji Reveal : పాన్ఇండియా స్టార్ ప్రభాస్ లీడ్ రోల్లో రూపొందుతున్న లేటెస్ట్ మూవీ 'కల్కి 2898 AD'. ఇప్పటికే ఈ సినిమా రిలీజ్‌కు కౌంట్‌డౌన్ మొదలైనందను ఫ్యాన్స్ కూడా ఈ సినిమా నుంచి కొత్త అప్డేట్స్ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా విడుదలైన స్క్రాచ్ ఎపిసోడ్ 4 అభిమానులకు బిగ్ సర్ప్రైజ్గా నిలిచింది. ప్రభాస్ పెట్టిన ఇన్‌స్టా స్టోరీ వల్ల ఈ ఎపిసోడ్‌కు మరింత హైప్ పెరిగింది. అందులో భాగంగా భైరవ (ప్రభాస్) బెస్ట్‌ఫ్రెండ్‌ను మేకర్స్ పరిచయం చేశారు. కీర్తి సురేశ్ వాయిస్ ఓవర్ ఇచ్చిన ఆ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా సాగింది.
అందులో ఓ తల మాత్రమే ఉన్న రోబోను చూపించారు. దాని మిగతా బాడీ పార్ట్స్‌ను తయారు చేసే ప్రాసెస్‌నే ఆ గ్లింప్స్‌లో చూపించారు. అయితే ఆఖరిలో ప్రభాస్ బుజ్జిని రివీల్ చేస్తారని అందరూ అనుకుంటున్న సమయంలో సస్పెన్స్ పెట్టారు. బుజ్జీని త్వరలోనే చూపిస్తామని వెల్లడించారు. ఓ స్పెషల్ ఈవెంట్లో రివీల్ చేస్తామని చెప్పారు.
ఇప్పుడు ఆ ఈవెంట్ కోసం భారీ సన్నాహాలు జరుగుతున్నాయి. రామోజీ ఫిల్మ్ సిటీలో నేడు (మే 22) జరగనున్న ఆ ఈవెంట్‌కు మూవీ టీమ్ రానుంది. ఈ విషయాన్ని మేకర్స్ అఫీషియల్ పోస్టర్ ద్వారా వెల్లడించారు. 'మీట్ అవర్ బుజ్జి అండ్ భైరవ' అంటూ క్యాప్షన్ జోడించారు. దీంతో ఫ్యాన్స్ 'బుజ్జిని చూసేందుకు వెయిట్ చేయలేం' , 'త్వరగా రివీల్ చేయండి' అంటూ కామెంట్లు పెడుతున్నారు.
ఇక కల్కి సినిమా విషయానికి వస్తే, ఇది భారతీయ పురాణాల ఆధారంగా తెరకెక్కుతున్న సైన్స్ ఫిక్షన్ చిత్రం. ఇందులో ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా నటిస్తుండగా ఆయన సరసన దిశా పటానీ హీరోయిన్గా కనిపించనున్నారు. బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే కూడా ఈ చిత్రంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. వీరితో పాటు బిగ బీ అమితాబ్ బచ్చన్, లోకనాయకుడు కమల్ హాసన్ వంటి నటులు కూడా ఈ సినిమాలో కనిపించనున్నారు. జూన్ 27న ఈ సినిమా విడుదల కానుంది.
హమ్మయ్య భైరవుడి బుజ్జి ఎవరో తెలిసిపోయిందోచ్ - ఆసక్తి రేకెత్తిస్తోన్న వీడియో - Kalki 2898 AD Movie