ETV Bharat / entertainment

బాక్సాఫీస్​ ముందు పోలీస్​ భామల పోరు - Kajal Agarwal VS Payal Rajput - KAJAL AGARWAL VS PAYAL RAJPUT

Kajal Agarwal Sathyabhama VS Payal Rajput Rakshana : ఈ వారం రిలీజయ్యే సినిమాల్లో అందాల ముద్దుగుమ్మలు కాజల్ అగర్వాల్, పాయల్ రాజ్​పుత్ నటించిన చిత్రాలు కూడా ఉన్నాయి. అయితే ఈ రెండు చిత్రాల్లో హీరోయిన్లు ఇద్దరు క్రైమ్​ థ్రిల్లర్​ బ్యాక్​డ్రాప్​తో పోలీసులుగా బాక్సాఫీస్​ ముందుకు రానున్నారు. పూర్తి వివరాలు స్టోరీలో

Source ETV Bharat
kajal payal (Source ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Jun 4, 2024, 4:18 PM IST

Kajal Agarwal Sathyabhama VS Payal Rajput Rakshana : ఎప్పటిలాగే ఈ వారం కూడా పలు సినిమాలు రిలీజ్ కానున్నాయి. అయితే సారి విడుదల కానున్న చిత్రాల్లో శర్వానంద్ మనమే చిత్రంపై కాస్త అంచనాలు ఉన్నాయి. దీంతో పాటు తమ కంటెంట్​ కూడా ప్రేక్షకులను మెప్పిస్తుందనే ధీమా ప్రస్తుతం ఈ వారం పోటీలో ఉన్న ఇతర చిత్రాల్లోనూ కనిపిస్తోంది. వాటిలో కాజల్ అగర్వాల్ టైటిల్ రోల్ పోషించిన సత్యభామ, పాయల్ రాజ్​పుత్ నటించిన రక్షణ కూడా ఉన్నాయి. అయితే ఈ రెండు సినిమాల్లో కొన్ని కామన్ పాయింట్స్ ఉండటం విశేషం.

రెండు చిత్రాలు ప్రమోషన్లు బాగానే జరుగుతున్నాయి. సత్యభామ ట్రైలర్ అంచనాలను పెంచడంతో పాటు ప్రీ రిలీజ్​ ఈవెంట్​కు బాలయ్య చీఫ్​ గెస్ట్​గా రావడంతో ఆడియెన్స్ దృష్టిలో ఈ చిత్రం బాగానే పడింది. దీనికి శశికిరణ్ తిక్కా స్క్రీన్ ప్లే అందించగా సుమన చిక్కాల దర్శకత్వం వహించారు. పైగా మొదటి సారి కాజల్ అగర్వాల్ ఫుల్ లెన్త్ పోలీస్ ఆఫీసర్ రోల్ పోషించిన చిత్రమిది. మర్డర్ మిస్టరీ బ్యాక్ డ్రాప్​లో రూపొందించారు.

ఇక పాయల్ రాజ్ పుత్ ప్రధాన పాత్ర పోషించిన రక్షణ కూడా సత్యభామ రిలీజ్ రోజే వస్తోంది. క్రైమ్ థ్రిల్లర్ బ్యాక్​డ్రాప్​తోనే తెరకెక్కింది. వాస్తవానికి నాలుగేళ్ల క్రితమే షూటింగ్ పూర్తైనప్పటికీ ఇప్పుడు మోక్షం దక్కింది. ఈ చిత్ర నిర్మాత, హీరోయిన్ పాయల్ పరస్పరం ఆరోపణలు చేసుకోవడంతో ఈ సినిమా కాస్త హాట్ టాపిక్​గా మారింది. ఏదేమైనా ఈ చిత్రం కూడా జూన్ 7న థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానుంది. మంగళవారం వంటి హిట్ తర్వాత పాయల్ నుంచి రాబోతున్న సినిమా ఇది. అంటే ఇంతకాలం గ్లామర్​తో కవ్వించిన అందగత్తెలు ఇప్పుడు ఖాకీ దుస్తులు వేసుకుని రాబోతున్నారు. మరి ఈ చిత్రాలు ఎంత వరకు ఆకట్టుకుంటాయో చూడాలి.

పైగా ఎలక్షన్ రిజల్ట్స్​ కూడా దాదాపుగా వచ్చేయడంతో ఇక శుక్రవారం నాటికి జనాలు కూడా ఎన్నికల మూడ్ నుంచి బయటకు వచ్చేస్తారు. కాబట్టి వారు థియేటర్లకు ఆశించిన స్థాయిలో వస్తారని మేకర్స్ ఆశిస్తున్నారు. ఇక జూన్ నుంచి టాలీవుడ్ బాక్సాఫీస్​కు మునుపటి రోజులు వచ్చేస్తాయని ట్రేడ్ అంచనా వేస్తున్న సమయంలో రానున్న మొదటి బంచ్ సినిమాలివి.

'రిలేషన్​లోనే ఉన్నాను - ఆయనంటే నాకు చాలా ఇష్టం' - Krithi Shetty Manamey Movie

ఈ వారం 20 క్రేజీ సినిమా/సిరీస్​లివే - మీరేం చూస్తారు? - This week OTT Releases

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.