ETV Bharat / entertainment

1980 బ్యాక్ ​డ్రాప్​లో OTTలోకి సూపర్​ హిట్​ రివెంజ్ డ్రామా - ఎందులో చూడాలంటే? - ఓటీటీలోకి సూపర్ హిట్ కైవా మూవీ

Kaiva OTT Release : OTTలోకి మరో సూపర్​ హిట్​ లవ్​ అండ్ రివెంజ్ మూవీ​ వచ్చింది. ఈ చిత్రం ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటోంది. ఆ వివరాలు.

1980 బ్యాక్ ​డ్రాప్​లో OTTలోకి సూపర్​ హిట్​ రివెంజ్ డ్రామా - ఎందులో చూడాలంటే?

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 5, 2024, 1:37 PM IST

Kaiva OTT Release : మూవీ లవర్స్​ను ఆకట్టుకునేందుకు ఎప్పుడు ఏదో ఒక సరికొత్త కంటెంట్​తో వస్తుంటాయి ఓటీటీ ప్లాట్​ఫామ్స్​. అలా ఈ వారం కూడా ఓ కన్నడ సూపర్ హిట్​ లవ్ అండ్​ రివెంజ్​ స్టోరీ వచ్చింది. ఆ చిత్రం పేరే 'కైవా'. 1980 బ్యాక్ ​డ్రాప్​లో హిందూ అబ్బాయి - ముస్లిం అమ్మాయి మధ్య ప్రేమ కథాతో వచ్చింది.

గతేడాది డిసెంబర్‌ 8న థియేటర్లలో విడుదలై హిట్​ టాక్​తో మంచి వసూళ్లను కూడా అందుకుంది. ఇప్పుడీ సినిమానే ఓటీటీ స్ట్రీమింగ్​కు వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ ఫామ్ అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో(Kaiva Amazon Prime) స్ట్రీమింగ్​ అవుతోంది. కానీ ప్రస్తుతానికి కన్నడ వెర్షన్​లో మాత్రమే అందుబాటులో ఉంది. అయితే ఇంగ్లిష్ సబ్‌ టైటిల్స్‌ వస్తున్నాయి. త్వరలోనే తెలుగు వెర్షన్‌ కూడా అందుబాటులోకి రానుంది.

సినిమా కథ ఇదే (Kaiva Movie Story): నిజ జీవిత సంఘటనల ఆధారంగా 'కైవా'ను తెరకెక్కించారు. ఉద్యోగం కోసం ఓ గ్రామం నుంచి బెంగళూరు నగరానికి వచ్చిన కైవా (ధనవీర) ముస్లిం అమ్మాయి సల్మాతో(మేఘా శెట్టి) ప్రేమలో పడతాడు. అయితే కొంతమంది రౌడీ మూకలు సల్మాను ఓ గ్యాంగ్‍స్టర్ ప్రియురాలిగా భావించి ఆమెపై యాసిడ్​ దాడి చేస్తారు. దీంతో కైవా అదే గ్యాంగ్​స్టర్​ సాయంతో ఆ ముగ్గురిపై ప్రతీకారం తీర్చుకునేందుకు పెద్ద యుద్ధమే చేస్తాడు. ఈ క్రమంలోనే బాధింపబడ్డ సల్మాను పెళ్లి చేసుకుంటాడు. అయితే యాసిడ్​ దాడి చేసిన వారిలో ఇద్దరిని మాత్రమే చంపేస్తాడు. తర్వాత పోలీసులకు చిక్కి జైలుకు వెళ్లిపోతాడు. మరి కైవా జైలు నుంచి బయటకు వచ్చాడా? కైవా జైలుకు వెళ్లడం వల్ల సల్మా లైఫ్​ ఎలా మారిపోయింది? మూడో వాడిని చంపడం కోసం కైవా ఏం చేశాడు? అసలు చంపాడా? లేదా? అనేది మిగిలిన కథ.

కాగా, 'కైవా' చిత్రానికి జయతీర్థ జయన్న దర్శకత్వం వహించగా కాంతార, విరూపాక్ష, మంగళవారం ఫేమ్​ అజ్నీశ్ లోకనాథ్ మ్యూజిక్ అందించారు. దినకర్ తోగుదీప, రమేశ్ ఇందిర, జయరామ్ కార్తీక్, ఉగ్రం మంజు, నందా ఇతర కీలక పాత్రల్లో నటించారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

నిమిషానికి కోటిన్నర - 'లాల్​ సలామ్'​ రజనీ రెమ్యునరేషన్ అన్ని కోట్లా?

స్టార్ హీరోయిన్​తో ప్రముఖ నిర్మాత రిలేషన్​షిప్​​ - రెడ్ హ్యాండెడ్​గా పట్టుకున్న భార్య!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.