ETV Bharat / entertainment

జూనియర్ ఎన్​టీఆర్ ఎనర్జీ సీక్రెట్ - చిన్నప్పుడు అలా చేశారట! - Jr Ntr Energy Secret - JR NTR ENERGY SECRET

Jr Ntr Energy Secret : మాన్ ఆఫ్​ మాసెస్​, జూనియర్ ఎన్​టీఆర్ పలు విషయాల్లో నిష్ణాతుడని ఎన్నో సార్లు నిరూపించుకున్నాడు. ఆయన తన నటనలో ఎలాగైతే కొత్తదనాన్ని చూపిస్తారో అలాగే తనలోని కొత్త కోణాన్ని ఇప్పటికే పలు మార్లు చూపించారు. కన్నడ, జపనీస్ ఇలా పలు భాషల్లోనూ మాట్లాడి బహుభాష కోవిదుడిగా పేరొందాడు. క్లిష్టమైన స్టెప్స్ వేస్తూ ఎనర్జిటిక్ డ్యాన్సర్​గా పాపులరయ్యాడు. ఇలా అన్నింటిలోనూ తన సత్తా చాటాడు. తారక్ అంత ఎనర్జిటిక్​గా అన్ని పనులు చేయడానికి వెనక ఓ సీక్రెట్ ఉందట. ఆ విషయాన్ని తాజాగా లీక్ చేశారు ప్రముఖ సినిమాటోగ్రాఫర్. ఆ విశేషాలు మీ కోసం

Jr Ntr Energy Secret
Jr Ntr Energy Secret
author img

By ETV Bharat Telugu Team

Published : Apr 21, 2024, 3:24 PM IST

Jr Ntr Energy Secret : కఠినమైన స్టెప్స్​ను కూడా సులువుగా చేయగలిగే ఎనర్జీకి, ఎంతటి పెద్ద డైలాగులైనా గుక్క తిప్పుకోకుండా అవలీలగా చెప్పే టాలెంట్​కు, ఎలాంటి ఎమోషన్ అయినా సులువుగా పండించే యాక్టింగ్​కు కేరాఫ్ అడ్రస్​గా చెప్పుకునే నటుడు జూనియర్ ఎన్​టీఆర్. అయితే అంత ఎనర్జిటిక్​గా డాన్స్ చేయడానికి, పెద్ద పెద్ద డైలాగులను సులువుగా చెప్పడానికీ తారక్​కు అంత శక్తి ఎక్కడి నుంచి వస్తుందని చాలా మంది ఆశ్చర్యపోతుంటారు. తాజాగా ఈ గ్లోబర్ స్టార్ ఎనర్జీ వెనక ఉన్న సీక్రెట్ గురించి ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కేకే సెంథిల్ ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టారు. అంతే కాకుండా తారక్ గురించి చాలా ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు.

ఎన్​టీఆర్ తన యుక్త వయసులో ఉన్నప్పుడు బ్యాడ్మింటన్ ఆడేవారట. అప్పట్లో బ్యాడ్మింటన్ ఆటలో తారక్ రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొన్నారట. తన ఫిట్​నెస్​, వేగం వెనక ఉన్న కారణం తాను అథ్లెట్ కావడమే అని తారక్ స్వయంగా చెప్పుకొచ్చారని సెంథిల్ వెల్లడించారు. ఇవే కాకుండా జూనియర్ ఎన్​టీఆర్ భరతనాట్యం, కూచిపూడిలో శిక్షణ పొందిన డాన్సర్ అన్న విషయం మనకు తెలిసిందే. వీటితో పాటు బ్యాడ్మింటన్ ఆటగాడు కావడం వల్లే తారక్ ఎప్పుడూ ఎనర్జిటిక్​గా ఫిట్​గా ఉంటారని అర్థమవుతోంది.

కెమెరాకు కూడా చిక్కని ఎన్టీఆర్​​ పరుగు
ఇదే ఇంటర్వ్యూలో మరో ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు సెంథిల్​. ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు ఎన్​టీఆర్​ను చూసి ఆయన చాలా ఆశ్చర్యపోయారట. షూటింగ్ సమయంలో తారక్​ను పులితో పాటు చాలా జంతువులు వెంబడించాయట. కెమెరా రోల్ అవుతున్నప్పుడు తారక్ కెమెరా కన్నా వేగంగా పరిగెత్తేవారట. ఆ క్షణం ఎన్​టీఆర్ వేగాన్ని చూసి షాక్ అయిన సెంథిల్ తనకు అంత శక్తి ఎక్కడి నుంచి వచ్చిందని ఆశర్చర్యపోయారట.

"ఆ మూవీలో ఎన్టీఆర్ ఇంట్రడక్షన్​లో ఆయన మొదట నక్కను, తోడేలును ఆ తర్వాత పులిని వెంబడించాలి. దానికి తగినట్లుగా ఏ దారిలో పరిగెత్తాలో ఎన్టీఆర్​కు మేము ముందే చెప్పాము. అప్పుడే మా కష్టాలు మొదలయ్యాయి యాక్షన్ అని చెప్పగానే తారక్ చాలా వేగంగా పరిగెత్తేవారు. అతని వేగం వల్ల ఆ సీన్​ను కెమెరాలో క్యాప్చర్ చేయడం చాలా కష్టమైంది. మొదట ఆయన అంత వేగంగా ఎలా పరిగెత్తగలుగుతున్నారు అని మాకు అర్థం కాలేదు. ఆ విషయాన్ని ఎన్టీఆర్​ను అడిగిన తర్వాత మాకు సమాధానం దొరికింది. ఎన్టీఆర్ నేషనల్ లెవెల్ బ్యాడ్మింటన్ ప్లేయర్ అని దాని కారణంగానే అంత వేగంగా పరిగెడుతున్నారని తెలిసింది. అయితే చేసేది ఏమిలేక అతని వేగానికి సరిపోయేలా మా ఏర్పాట్లు మేము చేసుకున్నాం" అంటూ అప్పటి విశేషాలు చెప్పుకొచ్చారు సెంథిల్.

'NTR 31' ప్రాజెక్ట్​పై లేటెస్ట్ బజ్- షూటింగ్ ఎప్పుడంటే? - NTR Prashanth Neel

'దేవర' రిలీజ్ ఆలస్యమైనా మీరందరూ కాలర్ ఎగరేస్తారు'- ఫ్యాన్స్​లో జోష్ నింపిన ఎన్టీఆర్ - Jr NTR Devara

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.