ETV Bharat / entertainment

'వార్ 2'పై ఎన్టీఆర్ ఫోకస్- షూటింగ్ సెట్స్​లోకి రీ ఎంట్రీ! - NTR War 2 Update - NTR WAR 2 UPDATE

NTR War 2 Update : గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన 'దేవర పార్ట్ 1' భారీ విజయం అందుకుంది. ఇప్పుడు ఆయన 'వార్ 2'పై ఫోకస్ పెట్టారు.

NTR War 2 Update
NTR War 2 Update (Source: PTI)
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 6, 2024, 7:24 AM IST

NTR War 2 Update : పాన్ఇండియా స్టార్ ఎన్టీఆర్ తాజాగా 'దేవర పార్ట్ 1'తో మంచి విజయం దక్కించుకున్నారు. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. ఇప్పటికే వరల్డ్​వైడ్​గా రూ.400+ కోట్ల వసూల్ సాధించింది. ఇక తాజాగా ఆయన బాలీవుడ్ మూవీ వార్ 2పై దృష్టి పెట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ త్వరలోనే వార్ 2 సెట్స్​లో అడుగుపెట్టనున్నారు.

వార్ 2
బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్‌ రోషన్‌ - ఎన్టీఆర్ లీడ్ రోల్స్​లో 'వార్-2' సినిమా తెరకెక్కుతోంది. అయాన్‌ ముఖర్జీ ఈ సినిమాను ఈ పాన్‌ ఇండియా లెవెల్లో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో తారక్‌ ఇప్పటికే ఓ షెడ్యూల్‌లో పాల్గొన్నారు. తాజాగా ఆయన మళ్లీ ఈ సినిమా సెట్స్​లో అడుగుపెట్టనున్నారు. అక్టోబర్ మూడో వారంలో ఎన్టీఆర్​పై కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నట్లు తెలుస్తోంది. దీనికోసం ముంబయిలోనే ఓ సెట్‌ను సిద్ధం చేస్తున్నారని, అందులోనే ఎన్టీఆర్‌ - హృతిక్‌పై ఓ సాంగ్ షూట్ చేస్తారని ప్రచారం సాగుతోంది. ఇక ఈ సినిమాను యశ్‌రాజ్‌ ఫిల్మ్స్‌ సంస్థ నిర్మిస్తోంది.

దేవర 2 ఎప్పుడంటే
దేవర ఫస్ట్ పార్ట్​ హిట్ అవ్వడంతో రెండో పార్ట్​ ఎప్పుడంటూ ఫ్యాన్స్​ ఇంటర్నెట్​లో తెగ ట్రెండ్ చేస్తున్నారు. అయితే దీనిపై హీరో ఎన్టీఆర్ తాజాగా స్పందించారు. తొలి పార్ట్ విజయంతో రెండో భాగంపై మరింత బాధ్యత పెరిగిందని ఆయన ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.

'దేవర పార్ట్‌- 1 సినిమాకు ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్​ రావడం వల్ల రెండో భాగంపై అంచనాలు పెరిగిపోతున్నాయి. తొలి పార్ట్ షూటింగ్ సమయంలోనే సీక్వెల్​కు సంబంధించి కొన్ని సీన్స్ చిత్రీకరించాం. దేవర తొలి పార్ట్ సూపర్ సక్సెస్ అవ్వడం వల్ల మాపై బాధ్యత మరింత పెరిగింది. రెండో భాగం చాలా బాగుంటుంది. దీన్ని ఆడియెన్స్​కు నచ్చేలా తీర్చిదిద్దేందుకు కాస్త సమయం పడుతుంది. కథ సిద్ధంగా ఉంది. తొలి పార్ట్ కోసం దర్శకుడు శివ చాలా కష్టపడ్డారు. అందుకే ఆయనకు రెస్ట్ తీసుకొని హాలీడే ట్రిప్​నకు వెళ్లమని చెప్పాను. తిరిగి వచ్చిన తర్వాత రెండో భాగం పనులు ప్రారంభం అవుతాయి' అని ఎన్టీఆర్ అన్నారు.

అయితే డైరెక్టర్ శివ తొలి పార్ట్​ క్లైమాక్స్​లో ఓ ట్విస్ట్​తో సీక్వెల్​పై ఆసక్తిని అమాంతం పెంచేశారు. చాలా ప్రశ్నలకు తొలి పార్ట్​లో సమాధానాలు చెప్పలేదు. ఇక హీరోయిన్ జాన్వీ కపూర్​కు సంబంధించి కూడా రన్​టైమ్ చాలా తక్కువగా ఉంది. తంగమ్- వర మధ్య అసలైన లవ్​ ట్రాక్ సీక్వెల్​లోనే ఉండనుంది. అవన్నీ రెండో పార్ట్​ చూసి తెలుసుకోవాల్సిందే అని దర్శకులు శివ అన్నారు.

బాక్సాఫీస్ వద్ద 'దేవర' రోర్​ - ఇప్పటివరకు ఎంత వసూలు చేసిందంటే? - Jr NTR Devara Movie

'దేవర' సక్సెస్​ మీట్​ - సెలబ్రేషన్స్​ కోసం తారక్ కూడా వెయిటింగ్ అంట! - Devara Success Meet

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.