ETV Bharat / entertainment

ఓవర్సీస్​లో 'దేవర' మేనియా- 6 నిమిషాల్లోనే ప్రీ బుకింగ్స్ సోల్డ్​ ఔట్! - Devara Overseas Pre Sales

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 2, 2024, 6:12 PM IST

Devara Overseas Pre Sales: పాన్ఇండియా ఎన్టీఆర్ 'దేవర' మూవీ ప్రీ బుకింగ్స్​లో జోరు చూపిస్తోంది. కెనడాలో దేవర మూవీ ప్రీ సేల్స్‌ మొదలైన 6 నిమిషాల్లోనే టికెట్లు సోల్డ్ అవుట్ అయినట్లు తెలుస్తోంది.

Devara Overseas
Devara Overseas (Source: ETV Bharat)

Devara Overseas Pre Sales: గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ హీరోగా అత్యంత భారీ బడ్జెట్​తో రానున్న చిత్రం 'దేవర'. ఈ సినిమాను రెండు భాగాలుగా తీసుకువస్తున్నారు దర్శకుడు కొరటాల శివ. తొలి భాగం సెప్టెంబరు 27న వరల్డ్ వైడ్ గ్రాండ్​గా రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన సాంగ్స్, పోస్టర్స్ సినిమాపై అంచనాలు పెంచేశాయి. 'ఆర్ఆర్ఆర్' వంటి భారీ హిట్ తర్వాత తారక్ నటించిన సినిమా కావడం వల్ల 'దేవర'పై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

6 నిమిషాల్లోనే
దేవర సినిమా వరల్డ్ వైడ్​గా విడుదలయ్యేందుకు ఇంకా 25 రోజులుంది. ఇప్పటికే భారీ అంచనాలు పెంచుతున్న దేవర సినిమా ప్రీ సేల్స్‌, సోమవారం కెనడాలో 25 స్క్రీన్లలో గ్రాండ్‌గా మొదలయ్యాయి. ప్రీ సేల్స్‌ మొదలైన 6 నిమిషాల్లోనే గ్రేటర్‌ టొరంటో ఏరియాలోని లీడింగ్ మల్లీప్లెక్స్‌ చైన్ మార్కెట్‌లో ఉన్న యార్క్‌ సినిమాస్‌, వుడ్‌ సైడ్‌ స్క్వేర్ సినిమాస్‌, అల్బియాన్‌ సినిమాస్‌, సెంట్రల్‌ పార్క్‌ వే సినిమాస్‌ స్క్రీన్లపై ఫాస్ట్ ఫిల్లింగ్‌ బోర్డ్సు్ దర్శనమిస్తున్నాయని తెలుస్తోంది. దీంతో తారక్‌ హీరోగా తెరకెక్కిన 'దేవర' సినిమాకు వరల్డ్‌ వైడ్‌గా క్రేజ్ ఏ రేంజ్​లో ఉందో అర్థం చేసుకోవడానికి ఈ ఒక్క విషయం చాలు. ఈ క్రమంలో 'దేవర' ప్రీమియర్లలో ఆల్ టైమ్ రికార్డులు సృష్టిస్తుందని అభిమానులు అంచనా వేస్తున్నారు.

అన్నయ్య నిర్మాణంలో
సముద్రతీరం నేపథ్యంలో సాగే యాక్షన్‌ డ్రామాగా కొరటాల శివ దేవరను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను జూనియర్ ఎన్టీఆర్ అన్నయ్య నందమూరి కల్యాణ్ రామ్, మిక్కిలినేని సుధాకర్ సంయుక్తంగా నిర్మించారు. అలాగే చిత్రానికి యంగ్ టాలెంట్ అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు. సినిమాలో తారక్ తండ్రీకొడుకులుగా ద్విపాత్రాభినయం చేయనున్నారని తెలుస్తోంది. బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ విలన్ గా కనిపించనున్నారు.

ఆకట్టుకున్న సాంగ్స్
కాగా, ఇప్పటికే దేవర నుంచి రిలీజైన పాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. యూట్యూబ్ లో రికార్డులు సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా చుట్టమల్లె సాంగ్ ప్రేక్షకులను కట్టిపడేసింది. ఈ పాటలో ఎన్టీఆర్ - జాన్వీ జోడీ ఆకట్టుకునేలా కనిపించింది. మెలోడియస్ సాగిన ఈ సాంగ్ మ్యూజిక్ లవర్స్ ను ఒక ట్రాన్స్‌ లోకి తీసుకెళ్లింది.

అమ్మ కోరిక తీర్చిన తారక్- ఆమె బర్త్​ డేకు ఇదే స్పెషల్ గిఫ్ట్ - JR NTR With Mother

సెప్టెంబర్​లో సినిమా పండగ- కళ్లన్నీ 'దేవర', 'గోట్'పైనే- లిస్ట్​లో 'ఎమర్జెన్సీ' కూడా - September Movies 2024

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.