Johnny Lever Latest Interview : సినీ ఇండస్ట్రీలోకి వచ్చిన ప్రతి ఒక్కరూ ఈ ఫీల్డ్‌లో అంత ఈజీగా నిలదొక్కుకునుండరు. వారి విజయగాథల వెనుక కొన్ని సార్లు ఎన్నో కష్టాలు కన్నీళ్లు కూడా ఉంటాయి. అలాంటి ఆటుపోట్లను ఎదుర్కొని ఆ నటులు తమ నటనతో అభిమానులను ఆకట్టుకుని స్టార్‌డమ్‌ను అందుకుంటుంటారు. బీటౌన్‌కు చెందిన జానీ లివర్ కూడా తన కెరీర్‌కు ముందు ఎన్నో ఒడుదొడుకులను ఎదుర్కొన్నారు. తెర మీద ఆయన కనిపించారంటే చాలు నవ్వు పుట్టుకొచ్చేస్తుంది. అలాంటి ఎక్స్‌ప్రెషన్‌తో ఆయన నటన ఎంత గొప్పదో అర్థం చేసుకోవచ్చు.
బయటకు నవ్వుతూ కనిపించే కొంత మంది మనసులో ఎంతో బాధ ఉంటుంది అన్నట్లు ఎప్పుడూ తన హాస్యంతో మనల్ని నవ్వించే జానీ లివర్ చిన్నతనంలో ఎన్నో బాధల్ని అనుభవించారట. ఓ ఇంటర్వూలో ఆయన చిన్నతనం గురించి చెప్పుకుని ఎమోషనలయ్యారు.
తన తండ్రి కారణంగా జానీ ఏడవ తరగతిలోనే చదువు మానేయాల్సి వచ్చిందట. ఆయన తండ్రి ప్రతి రోజూ మద్యం తాగేవారట. దాని మైకంలో ఉంటూ ఎప్పుడూ కుటుంబాన్ని పట్టించుకునే వారు కాదట. తన పెద్ద మామయ్యే ఫీజు కట్టి వాళ్లను చదివించారట. ఇంటికి సరుకులు కూడా ఇప్పించేవారట. కొన్నాళ్లకి ఇది నచ్చక జానీ బడికి వెళ్లడం మానేశారట. స్కూల్లో ఉన్నప్పుడు తన స్నేహితులు తనతో చాలా ప్రేమగా ఉండేవారని, తాను అందరినీ ఇమిటేట్ చేస్తూ సరదాగా గడిపేవారినంటూ జానీ లీవర్ చెప్పుకొచ్చారు.
కేవలం స్నేహితులు మాత్రమే కాదు టీచర్లకు కూడా జానీని ప్రేమగా చూసుకునే వారట. ముఖ్యంగా వాళ్ల క్లాస్ టీచర్ తనను చాలా అభిమానించేవారట. ఇన్నేళ్లైనా ఇప్పటికీ ఆమె జానీతో టచ్ లోనే ఉన్నారని ఆయన చెప్పుకొచ్చారు. అప్పట్లో తన బడికి వెళ్లడం మానేసినప్పడు ఆమె తన కోసం చాలా మంది విద్యార్థులకు ఇంటికి పంపించారట. ఫీజు కట్టి, బట్టలు కొనివ్వడానికి కూడా ఆమె ముందుకొచ్చారంటూ జానీ అప్పటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.
జానీ తన తండ్రి కారణంగా చదువు మానేయడమే కాకుండా మద్యం తాగడానికి కూడా అలవాటు పడ్డారంటూ తెలిపారు. చిన్నతనంలో ఏమీ తెలియని వయసులో ఆయన తనకు మద్యం చాలా మంచిది, కడుపును చక్కగా శుభ్రం చేస్తుందంటూ తండ్రే స్వయంగా తనతో మద్యం తాగించేవారంటూ జానీ చెప్పుకొచ్చారు.
అంతే కాకుండా 13 సంవత్సరాల వయస్సులో తన తండ్రి ప్రవర్తనతో విస్తుపోయి ఆయన ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నారట. అయితే అప్పుడు జానీకి తన ముగ్గురు చెల్లెళ్లు గుర్తొచ్చారని వెంటనే ఆ ఆలోచన మానుకున్నట్లు తెలిపారు. అన్ని కష్టాలు అనుభవించి ఇండస్ట్రీలో నిలదొక్కుకుని స్టార్ కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. బీటౌన్‌లో మోస్ట్ ట్యాలెంటడ్ యాక్టర్స్‌గా ఎదిగారు.
ఇప్పుుడు ఆయన తనయ జేమీ లివర్ కూడా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. అల్లరి నరేశ్, ఫరియా అబ్దుల్లా లీడ్ రోల్స్‌లో వచ్చిన 'ఆ ఒక్కటి అడక్కు' సినిమాలో నటించారు. తన యాక్టింగ్‌తో ప్రేక్షకులను అలరించి తండ్రికి తగ్గ తనయ అనిపించుకున్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">