ETV Bharat / entertainment

'జాన్వీని నేనేం అనలేదు - మా మధ్య అంత ఫ్రెండ్​షిప్​ లేదు' - Janhvi Kapoor Ulajh Movie - JANHVI KAPOOR ULAJH MOVIE

Janhvi Kapoor Ulajh Movie : బాలీవుడ్ నటి జాన్వీ కపూర్​పై తాను తాజాగా చేసిన కామెంట్స్ గురించి నటుడు గుల్షన్‌ దేవయ్య తాజాగా క్లారిటీ ఇచ్చారు. జాన్వీని తప్పుగా ఏమనలేదని అన్నారు.

Janhvi Kapoor Ulajh Movie
Janhvi Kapoor (Getty Images)
author img

By ETV Bharat Telugu Team

Published : Jul 23, 2024, 10:21 AM IST

Janhvi Kapoor Ulajh Movie : బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్‌, బీటౌన్​ హీరో గుల్షన్‌ దేవయ్య లీడ్​ రోల్స్​లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ 'ఉలఝ్‌'. దేశభక్తి కథాంశంతో పాటు ఇండియన్‌ ఫారెన్‌ సర్వీసెస్‌ నేపథ్యంలో సాగే ఈ థ్రిల్లర్‌ చిత్రాన్ని సుధాన్షు సరియా తెరకెక్కిస్తున్నారు. ఆగస్టు 2న ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషనల్​ ఈవెంట్స్​ను ముమ్మరం చేశారు మేకర్స్​.

ఇక ప్రమోషన్స్​లో భాగంగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో జాన్వీ గురించి సంచలన కామెంట్స్ చేశారు గుల్షన్‌. తనకు ఆమెతో ఫ్రెండ్లీ రిలేషన్‌ లేదని అన్నారు. షూటింగ్​లోనూ అలాగే సీన్స్​ తెరకెక్కించే సమయంలోనే తనతో మాట్లాడేవారంటూ కామెంట్‌ చేశారు. ఈ వ్యాఖ్యలు కాస్త సోషల్ మీడియాలో కాంట్రవర్సీలకు దారితీసింది. అయితే గుల్షన్‌ తాజాగా ఈ ఇష్యూపై స్పందించి క్లారిటీ ఇచ్చారు.

"జాన్వీ గురించి నేనేం తప్పుగా మాట్లాడలేదు. మా ఇద్దరి మధ్య స్నేహం లేదన్నాను అంతే. అది మా ఇద్దరి తప్పు కాదు. ఆమె ఓ మంచి యాక్ట్రెస్​. ఎంతో ప్రొఫెషనల్‌గా నటిస్తారు. మా ఇద్దరిపై తీసిన ప్రతి సీన్ బాగానే వచ్చింది. చేసే ప్రతి సినిమా సెట్‌లోనూ మూవీటీమ్ మొత్తం ఫ్యామిలీలా కలిసిపోవాలనేది రూల్ కాదు కదా. నేను ఎవ్వరినీ కించపరచట్లేదు. ఉద్దేశపూర్వకంగానూ ఎవరి గురించి తప్పుగా అస్సలు మాట్లాడలేదు. ఈ సినిమా కోసం మేం వందశాతం పనిచేశాం. డైరెక్టర్ చెప్పినట్లుగానే నటించాం. గతంలోనూచాలా మంది హీరోయిన్స్‌తో కలిసి స్క్రీన్‌ షేర్‌ చేసుకున్నాను. వారందరితో నాకు మంచి స్నేహం ఏర్పడింది. సోనాక్షి సిన్హా, రాధికా ఆప్టే లాంటి స్టార్స్​లో కలిసి నటించడం నేను ఎప్పటికీ మర్చిపోలేను. మేము అప్పుడప్పుడు ఎన్నో విషయాల గురించి కూడా మాట్లాడుకునేవాళ్లం. కానీ, జాన్వీతో మాత్రం సినిమా గురించే చర్చించాను. ఇదే విషయాన్ని ఇటీవలే ఓ ఇంటర్వ్యూలోనూ వెల్లడించాను" అని గుల్షన్‌ క్లారిటీ ఇచ్చారు. ఇక గుల్షన్‌ చేసిన కామెంట్స్​పై జాన్వీ కూడా స్పందించారు. వాస్తవంగా వారిద్దరూ సెట్‌లో ఎప్పుడూ ఇతర విషయాలు మాట్లాడుకోలేదని అన్నారు.

'ఉలఝ్' - దేశద్రోహం కేసు నుంచి జాన్వీ ఎలా బయటపడింది!?

ఆస్పత్రి నుంచి జాన్వీ డిశ్చార్జ్- ఇప్పుడెలా ఉందంటే? - Janhvi Kapoor Discharged

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.