ETV Bharat / entertainment

'ఇంద్ర' షూటింగ్​లో మెగా ఫ్యామిలీ సందడి - యంగ్ చెర్రీని చూశారా? - Indra Re Release Behind The Scenes - INDRA RE RELEASE BEHIND THE SCENES

Indra Re Release Behind The Scenes : 'ఇంద్ర' సినిమా రీరిలీజ్ కానున్న నేపథ్యంలో మేకర్స్ తాజాగా ఈ సినిమా నుంచి ఓ బిహైండ్​ ద సీన్ వీడియో రిలీజ్ చేశారు. అందులో చిరుతో పాటు ఆయన ఫ్యామిలీ మెంబర్స్ కనిపించి సందడి చేశారు. ఆ వీడియోను మీరూ చూసేయండి.

Indra Re Release Behind The Scenes
Indra Re Release Behind The Scenes (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Aug 21, 2024, 7:18 PM IST

Indra Re Release Behind The Scenes : మెగాస్టార్ చిరంజీవి లీడ్​ రోల్​లో వచ్చిన బ్లాక్‌బస్టర్‌ మూవీ 'ఇంద్ర'. చిరు కొత్త జానర్​లో నటించిన ప్రేక్షకులను మెప్పించిన ఈ చిత్రం ఇప్పుడు ఆయన పుట్టినరోజు సందర్భంగా మరోసారి రిలీజయ్యేందుకు సిద్ధమైంది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మేకర్స్ ఈ చిత్రాన్ని ఆగస్టు 22న ప్రతిష్టాత్మకంగా విడుదల చేస్తోంది.

ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీకి సంబంధించిన 'అమ్మడు అప్పచీ' అనే సాంగ్‌ మేకింగ్‌ వీడియో విడుదల చేసింది. అందులో వింటేజ్​ చిరుతో పాటు ఆయన తనయుడు రామ్‌ చరణ్‌, కుమార్తెలు అలాగే అల్లుడు వైష్ణవ్‌ తేజ్‌ స్పెషల్‌ అట్రాక్షన్‌గా నిలిచారు. చిరు డ్యాన్స్​ షూట్ చేస్తున్న సమయంలో చెర్రీ సెట్స్​లో సందడి చేశారు. నిర్మత అశ్వినీదత్​ అలాగే ప్రొడక్షన్ టీమ్​తో మాట్లాడుతూ కనిపించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది.

ఆ పేరు వినగానే పులకించిపోతుంది - 'ఇంద్ర' సక్సెస్‌కు అదే కారణం
Chiranjeevi Indra Movie Re Release : తన చిత్రాల్లో అత్యంత సాంకేతికంగా , ఉన్నత వాణిజ్య హంగులున్న చిత్రంగా ఇంద్ర నిలిచిందని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. ఆగస్టు 22న ఆయన బర్త్‌డే సందర్భంగా రీరిలీజ్‌ కానున్న నేపథ్యంలో 'ఇంద్ర' మూవీ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.

ఇంద్రసేనారెడ్డి పేరు వినగానే ఒళ్లు పులకించిపోతుందని, 22 ఏళ్ల తర్వాత మళ్లీ తన పుట్టినరోజున ఈ మూవీ రీరిలీజ్ కానుండటం ఎంతో సంతోషాన్ని ఇస్తుందన్నారు. ఆ రోజుల్లో 'ఇంద్ర' ఘన విజయం సాధించడానికి కథే కారణమని అన్నారు. నేటి తరం ప్రేక్షకులకు ఈ చిత్రాన్ని వెండితెరపై చూపించాలన్న నిర్మాతలు స్వప్నదత్ , ప్రియాంక దత్‌లకు మెగాస్టార్ ప్రత్యేక అభినందనలు తెలిపారు.

"ఒక్క మాటలో చెప్పాలంటే కమర్షియల్‌ చిత్రానికి ఓ పెర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ 'ఇంద్ర'. డైరెక్టర్‌ బి.గోపాల్‌ దీన్ని ఎంతో గొప్పగా తెరకెక్కించారు. ఈ సినిమాలో పనిచేసిన అందరికీ పేరుపేరునా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. 22 ఏళ్ల తర్వాత ఇప్పుడు రీరిలీజ్‌ కావడం నాకెంతో సంతోషాన్ని ఇస్తోంది. 2002 జులై 22 'ఇంద్ర' రిలీజ్‌ సందర్భంగా ఎలా ఎమోషనయ్యానో ఇప్పుడు కూడా అలానే ఉన్నాను. ఈ తరం వాళ్లకు ఈ సినిమాను బిగ్‌ స్క్రీన్‌పై చూపించాలనే ఆలోచన వచ్చిన స్వప్నదత్‌, ప్రియాంక దత్‌లకు నా హృదయపూర్వక అభినందనలను తెలియజేస్తున్నాను. అందరూ ఎంజాయ్‌ చేయండి" అంటూ చిరు మాట్లాడారు.

ఆస్ట్రేలియాలో చెర్రీకి స్పెషల్ అవార్డు - 'తిరిగి వెళ్తుంటే బాధగా అనిపించింది' - Indian Film Festival of Melbourne

చిరంజీవితో అలా చేయాలన్నారు! - రాత్రంతా భయంతో నిద్రపోలేదు : సోనాలి బింద్రే - Chiranjeevi Sonali Bendre Indra

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.