IMDB Most Popular Indian Stars : ప్రముఖ ఎంటర్‌టైన్‌మెంట్ పోర్టల్ ఐఎండీబీ తాజాగా మోస్ట్ పాపులర్ ఇండియన్ స్టార్స్ లిస్ట్‌ను రిలీజ్ చేసింది. ఈ ఏడాదిలో ఆ పోర్టల్‌లో ఎక్కువగా సెర్చ్ జరిగిన హీరో-హీరోయిన్ల లిస్ట్‌ను ఈ మేరకు ప్రకటించింది. అందులో టాప్ వన్ పొజిషన్లో త్రిప్తి డిమ్రీ నిలిచారు. ఈ ఏడాది ఆమె నటించిన 'బ్యాడ్ న్యూజ్' అలాగే 'లైలా మజ్ను' రీరిలీజ్‌తో పాటు 'భూల్ భులయ్యా3' సినిమాలు విడుదలవ్వడం వల్ల తన పేరు పాపులర్ అయినట్లు తెలుస్తోంది.
ఇక ఈ లిస్ట్‌లోని రెండు ప్లేస్‌లో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె ఉంది. ఇక మూడు స్థానంలో షాహిద్ కపూర్ సోదరుడు యంగ్ హీరో ఇషాన్ ఖత్తర్ ఉన్నారు. నాలుగో పొజిషన్‌ను బీటౌన్ బాద్షా షారుక్ ఖాన్ నిలిచారు.
మరోవైపు టాప్ 5లో స్టార్ హీరోయిన్ శోభిత ధూళిపాళ కూడా ఉన్నారు. నాగచైతన్యతో పెళ్లి, అలాగే ఆమె నటించిన 'మంకీ మ్యాన్' విడుదల నేపథ్యంలో ఆమె ఈ లిస్ట్‌లో ఐదో స్థానంలో నిలిచారు. ఇక ఆరు, ఏడు స్థానాలను శార్వరీ వాఘ్, ఐశ్వర్యరాయ్ బచ్చన్ ఉన్నారు.
అయితే ఎనిమిదో స్థానాన్ని టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత కైవసం చేసుకున్నారు. రీసెంట్గా సామ్ నటించిన 'సిటడెల్: హనీ బన్నీ' ప్రేక్షకుల ముందుకువచ్చిన నేపథ్యంలో ఆమె ఈ స్థానంలో ఉన్నట్లు ఆ సంస్థ పేర్కొంది. ఈ వెబ్ సిరీస్ ప్రచారంలో సమంత తన ఆరోగ్యం, వ్యక్తిగత విషయాల గురించి చర్చించారు. దీంతో సమంత కోసం అభిమానులు వెతకడంతో ఎనిమిదో స్థానంలో నిలిచారు. సమంత తర్వాత స్థానాల్లో అలియా భట్, ప్రభాస్ ఉన్నారు.
ఎలా లిస్ట్ తయారు చేశారంటే?
వీక్లీ లిస్ట్‌లోని పాపులర్ స్టార్స్ జాబితా ఉన్న వారి ర్యాకింగ్ బేస్ చేసుకుని దీన్ని రెడీ చేసినట్లు పేర్కొంది. అంతేకాకుండా వరల్డ్‌వైడ్‌గా ఉన్న 250 మిలియన్లకు పైగా విజిటర్ల పేజీ వ్యూవ్స్ ఆధారంగా చేసుకొని ఈ ర్యాంకింగ్స్‌ను వెల్లడించినట్లు సదరు సంస్థ తెలిపింది.
'వాళ్లు సెకండ్ హ్యాండ్ అన్నారు - అయినా రివెంజ్ తీసుకోలేదు' - విడాకులపై సమంత