Richest star kid In India: స్టార్ కిడ్ అంటే స్టార్‌కు ఉన్నంత ఇమేజ్ ఉంటుంది. తండ్రి ఇమేజ్‌తో పాటు వారసత్వంగా వచ్చే ఆస్తులు అన్నీ ఆ స్టార్ కిడ్కే చెందుతాయి. మనీ కంట్రోల్ అనే ఇంగ్లీష్ వెబ్‌సైట్ డేటా ప్రకారం సల్మాన్ ఖాన్ రూ.2900 కోట్లతో రిచెస్ట్ స్టార్ కిడ్స్‌లో ఒకరిగా నిలిచారు. కానీ, ఆయన నెం.1 పొజిషన్ దక్కించుకోలేకపోయారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, బాలీవుడ్ నటులు రణబీర్ కపూర్, ఆలియా భట్, అభిషేక్ బచ్చన్ వంటి స్టార్ యాక్టర్స్ కూడా టాప్- 1లో నిలువలేదు.
ఇంతకీ టాప్ -1లో ఎవరున్నారంటే? - బాలీవుడ్ గ్రీక్ హీరో హృతిక్ రోషన్ నిలిచారు. నటుడి నుంచి డైరెక్టర్- ప్రొడ్యూసర్‌గా మారిన రాకేశ్ రోషన్ కొడుకే ఈ హృతిక్. రాకేశ్ రోషన్ ఆస్తులు దాదాపు రూ.3100 కోట్లుగా ఉన్నాయని నివేదికలు పేర్కొన్నాయి. ఆయన వారసుడిగా 'కహో నా ప్యార్ హై' సినిమాతో 2000లో హీరోగా ఎంట్రీ ఇచ్చారు హృతిక్. ఆ తర్వాత స్టార్‌గా ఎదిగేందుకు కొంత కాలం కష్టపడ్డాడు. అనంతరం 'క్రిష్', 'ధూమ్ 2', 'జోధా అక్బర్', 'అగ్నిపథ్', 'కాబిల్' లాంటి సినిమాలతో స్టార్ హీరో అయిపోయారు. అయితే హృతిక్ కేవలం సినిమాల ద్వారానే కాకుండా ఇతర మాధ్యమాల ద్వారా కూడా ఆదాయం గడిస్తున్నారు. బ్రాండ్ అంబాసిడర్‌గా, సోషల్ మీడియా పోస్టింగ్‌లతో, నిర్మాతగా, టెలివిజన్ షోలతో, స్టార్టప్‌లలో పెట్టుబడిదారుడిగా, HRX అనే బ్రాండ్ రూపకర్తగా ఆర్జిస్తున్నారు.
ముంబయిలోని లోనావాలాలో సముద్రానికి ఎదురుగా లగ్జరీ హౌజ్, అరుదుగా దొరికే అత్యంత ఖరీదైన రిస్ట్ వాచ్‌లు, రోల్స్ రాయ్స్ ఘోస్ట్ సిరీస్ II, మెర్సిడెస్ మేబాచ్, మాసెరటీ స్పైడర్ లాంటి విలాసవంతమైన కార్లు ఆయన దగ్గర ఉన్నాయి. అలా ఆయన ఆస్తుల విలువ భారీగానే ఉన్నాయి.
Hrithik Roshan Upcoming Movies: ఇక హృతిక్ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం ఆయన జూనియర్ ఎన్టీఆర్, కియారా అడ్వాణీతో కలిసి వార్- 2 చేస్తున్నారు. అలానే 'క్రిష్ 4' కోసం సన్నద్ధమవుతున్నారు. గతంలో తీసిన చిత్రాల కన్నా 'క్రిష్- 4' హెవీ వీఎఫ్ఎక్స్తో భారీ బడ్జెట్‌తో తెరకెక్కనున్నట్లు సమాచారం. చూడాలి మరి ఈ చిత్రాలు ఎలాంటి ఫలితాలను అందుకుంటాయో.
కాజల్‌తో థియేటర్లో సినిమా చూసే ఛాన్స్ - ఇలా చేస్తే చాలు!
OTTలో దూసుకెళ్తోన్న భయపెట్టే దెయ్యం సినిమా - ట్విస్టులే ట్విస్టులు! - Latest Horror Movie OTT