Highest Paid Malayalam Actor : మలయాళ సినీ ఇండస్ట్రిలో మమ్ముట్టి , మోహన్‌లాల్ లాంటి సూపర్ స్టార్స్ ఉన్నారు. ఇప్పటి తరం హీరోలు దుల్కర్ సల్మాన్, పృథ్వీరాజ్ సుకుమారన్, ఫహాద్ ఫాజిల్, టోవినో థామస్ కూడా తమ నటనతో మలయాళ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. అయితే రెమ్యూనరేషన్ విషయంలో మాత్రం ఓ స్టార్ హీరో వీళ్లందరినీ బీట్ చేస్తున్నారు. ఇంతకీ ఆయన ఎవరంటే ?
ఇంతకీ ఆయన ఎవరో కాదు మల్లు నటుడు మోహన్‌లాల్. మలయాళంలో మెస్ట్ సక్సెస్ఫుల్ యాక్టర్స్‌లో ఒకరైన ఈయన మాలీవుడ్‌లోనే కాకుండా తెలుగు, తమిళంలోనూ నటించి గుర్తింపు పొందారు. అయితే ఆయన ప్రతి సినిమాకు తీసుకునే రెమ్యూనరేషన్ 8 కోట్లు నుండి 17 కోట్లు మధ్యలో ఉంటుందని టాక్ నడుస్తోంది.
గతేడాది రజనీకాంత్ లీడ్ రోల్లో వచ్చిన 'జైలర్' సినిమాలో అతిధి పాత్రలో కనిపించారు మోహన్ లాల్. ఆ సినిమాలో నటించిన కొద్ది నిమిషాలకే ఆయన దాదాపు రూ. 8 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నట్టు సమాచారం. ఇక సీనియర్ నటుడు మమ్ముట్టి కూడా తన ప్రతి సినిమాకు ఆయన పాత్ర నిడివి బట్టి దాదాపు రూ. 4 కోట్లు నుంచి రూ.10 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటారని సమాచారం.
మరోవైపు మమ్ముట్టి తనయుడు దుల్కర్ సల్మాన్ కూడా పాపులరే. ఆయన కూడా తన పాత్ర డిమాండ్ బట్టి సినిమాకు రూ. 3 నుంచి రూ.8 కోట్ల వరకు తీసుకుంటారని అంచనా.
ఇక సలార్ సినిమాతో సౌత్‌తో పాటు నార్త్ ప్రేక్షకులను అలరించారు స్టార్ హీరో పృథ్వీరాజ్. ఈయన కూడా తన ప్రతి సినిమాకు రూ. 3 నుంచి రూ. 10 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటారని సినీ వర్గాల టాక్.
పుష్ప సినిమాతో తనలోని కొత్త షేడ్‌ను చూపించారు మల్లు స్టార్ ఫహద్ ఫాజిల్. 'పార్టీ లేదా పుష్పా' అంటూ తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఇక ఫహాద్ తన ప్రతి సినిమాకు దాదాపు మూడున్నర నుంచి రూ. 6 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటారట. 'మిన్నల్ మురళి' సినిమాతో ఓటీటీలో అన్ని బాషల ప్రేక్షకులను మెప్పించి తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న టోవినో థామస్ కూడా తన ప్రతి సినిమాకు రూ. కోటి నుంచి రూ. నాలుగు కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటారట.
-
Finally convinced Casper and Whiskey to pose with me! pic.twitter.com/qNulDo0jbx
— Mohanlal (@Mohanlal) October 17, 2023