ETV Bharat / entertainment

నాకు అలాంటోడే కావాలి అంటున్న శ్రీలీల - మీలో ఎవరైనా అలా ఉన్నారా? - guntur karam sreeleela movies

Heroine Sreeleela Husband qualities : టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ శ్రీలీల తనకు ఎలాంటోడు కావాలో చెప్పింది. దానికి నెటిజన్లు ఫన్ని ఫన్నీగా రిప్లైలు ఇస్తున్నారు. దాని గురించే కథనం

నాకు అలాంటోడే కావాలి అంటున్న శ్రీలీల - మీలో ఎవరైనా అలా ఉన్నారా?

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 13, 2024, 1:33 PM IST

Heroine Sreeleela Husband qualities : శ్రీలీల తెలుగు సినీ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. ఎందుకంటే ఈమె టాలీవుడ్ యంగ్ సెన్సేషన్. అతి తక్కువ సమయంలోనే హీరోయిన్​గా తనను తాను నిరూపించుకుంది. స్టార్ హీరోలతో వరుస సినిమాలు చేస్తూ తన క్యూట్​ యాక్టింగ్​తో మనసు దోచింది. ముఖ్యంగా తన ఎనర్జిటిక్ డ్యాన్స్​తో ప్రేక్షకులను ఫిదా చేసింది. అయితే తాజాగా ఓ షోలో పాల్గొన్న ఈ భామ తన భర్త ఎలా ఉండాలో చెప్పుకొచ్చింది.

వివరాల్లోకి వెళితే. ఇటీవలే సూపర్ స్టార్​ మహేశ్​ బాబుతో కలిసి గుంటూరు కారం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది ముద్దుగుమ్మ శ్రీలీల. అయితే ఈ చిత్రం టాక్​ పరంగా డివైడ్ రెస్పాన్స్​ను అందుకున్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లనే సాధించి ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం మరిన్ని సినిమాలు చేస్తోంది. అలానే స్టార్ హీరోయిన్​గా ఎదగడానికి తనకున్న ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటోంది.

కాని గ్లామర్​ అండ్ డ్యాన్స్​ టాలెంట్ ఉన్నా ఈ భామకు అంతగా కలిసి రావట్లేదు. స్టోరీ సెలక్షన్స్​లో తప్పటడుగు వేస్తోందనే వాదన వినిపిస్తోంది. దీంతో అన్ని వరుస పరాజయాలను అందుకుంటోంది. మొదట రామ్​ పోతినేనితో స్కంద పర్వాలేదనిపించినా తర్వాత భగవంత్ కేసరితో భారీ హిట్​ను ఖాతాలో వేసుకుంది. అనంతరం పంజా వైష్ణవ్​తో ఆది కేశవ, నితిన్​తో ఎక్స్​ట్రార్డనరీ వంటి చిత్రాలు దెబ్బకొట్టాయి. దీంతో ఈ భామ కెరీర్ ఏం అవుతుందా అని ఆమెతో పాటు ఫ్యాన్స్​ కూడా కాస్త ఆలోచిస్తున్నారు.

అయితే తాజాగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఎంటర్టైన్మెంట్స్ ప్రొడక్షన్ హౌస్​ ఒరిజినల్ అనే ఇంటర్వ్యూ ప్రోగ్రాంలో పాల్గొంది శ్రీలీల. దీనికి సౌమ్య హోస్ట్​గా వ్యవహరిస్తోంది. ఈ షో మొదటి ఎపిసోడ్​కు గెస్ట్​గా వచ్చిన శ్రీలీలను క్యూట్ అండ్​ ఫన్నీ క్వశ్చన్స్​ అడిగారు యాంకర్​. దాన్ని ప్రోమోను రిలీజ్ చేశారు. ఈ ప్రచార చిత్రం ఆద్యంతం ఫన్నీ ఫన్నీగా సాగింది.

ఇందులోనే సౌమ్య మీకు బ్రెయిన్ ఉన్న అబ్బాయి కావాలా, ఫన్నీ, జోవియల్​గా ఉండే అబ్బాయి కావాలా అని అడగగా - ఫన్నీ, జోవియల్ అబ్బాయే కావాలి అని చెప్పింది. బ్రెయిన్​తో చేసే పనులు తాను చూసుకుంటాను అని చెప్పింది. ఈ సమాధానం విన్న నెటిజన్లు ఇండైరెక్ట్​గా బ్రెయిన్ లేని అబ్బాయి అయిన పర్లేదు, నవ్వించే అబ్బాయి కావలనమాట అంటూ కామెంట్లు చేస్తున్నారు. త్వరలోనే దీనికి సంబంధించిన ఫుల్ ఇంటర్వ్యూ విడుదల కానుంది.

విజయ్ దేవరకొండపై పీవీ సింధు షాకింగ్ కామెంట్స్​ - అలా అనేసిందేంటి?

9 రోజుల క్రితం మిస్సింగ్ - నది ఒడ్డున శవమై తేలిన ప్రముఖ దర్శకుడు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.