ETV Bharat / entertainment

మూడోసారి తండ్రి కాబోతున్న స్టార్ హీరో! - Hero sivakarthikeyan - HERO SIVAKARTHIKEYAN

ప్రముఖ హీరో మూడోసారి తండ్రి కాబోతున్నట్లు తెలిసింది. ఆయన భార్య బేబీ బంప్ ఫొటోస్ వైరల్ అవుతున్నాయి. ఎవరంటే?

Source Getty Images
Siva karthikeyan (Source Getty Images)
author img

By ETV Bharat Telugu Team

Published : May 30, 2024, 10:01 PM IST

Updated : May 30, 2024, 10:19 PM IST

Hero sivakarthikeyan Becomes Father third time : హీరో శివకార్తికేయన్‌ త్వరలో తండ్రి కాబోతున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ఈ వార్త జోరుగా చక్కర్లు కొడుతోంది. ఇప్పటికే శివకార్తికేయన్‌- ఆర్తి దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే చాలాకాలం తర్వాత ఇప్పుడీ జంట మూడో బిడ్డ కోసం ప్లాన్‌ చేశారని కథనాలు వస్తున్నాయి. తాజాగా ఓ అభిమాని తనయుడి పుట్టినరోజు వేడుకలకు శివకార్తికేయన్‌, ఆయన భార్య ఆర్తి గెస్ట్​లుగా వెళ్లారు.

అయితే ఆ వీడియోలో ఆర్తికి కాస్త పొట్ట ఉన్నట్లుగా కనిపించింది. దీంతో నెటిజన్లు, అభిమానులు అది బేబీ బంప్‌ అయి ఉండొచ్చని అంచనా వేస్తూ వీడియోను వైరల్ చేస్తున్నారు. త్వరలో మరో జూనియర్‌ శివకార్తికేయన్‌ రాబోతున్నారని హర్షం వ్యక్తం చేస్తున్నారు. కామెంట్ల రూపంలో అభినందలు తెలుపుతూ వీడియోను షేర్ చేస్తున్నారు. కాగా శివకార్తికేయన్‌ ఇండస్ట్రీలోకి రాకుముందే 2010లో ఆర్తిని పెళ్లి చేసుకున్నారు. వీరికి 2013లో కూతురు ఆరాధన, 2021లో కుమారుడు గుగన్‌ దాస్‌ జన్మించారు.

Hero SivaKarthikeyan Upcoming Movies : ఇక శివకార్తికేయన్​కు తెలుగులోనూ ఫుల్ ఫాలోయింగ్ ఉందన్న సంగతి తెలిసిందే. ఆయన నటించిన సినిమాలు ఇక్కడ కూడా డబ్ అయి సూపర్ హిట్స్ అందుకున్నాయి. రెమో చిత్రంతో టాలీవుడ్ ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ హీరో ఆ తర్వాత వరుణ్ డాక్టర్, కాలేజ్ డాన్, ప్రిన్స్​ వంటి చిత్రాలతో ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. రీసెంట్​గా అలయాన్ సినిమాతో బాక్సాఫీస్ ముందు హిట్ అందుకున్నారు. ఆయనలో హీరో మాత్రమే కాదు సింగర్‌ కూడా ఉన్నారు. ఆ మధ్య ఓ కన్నడ చిత్రంలో వాయడి పేట పుల్ల అనే పాటను ఆలపించి ఆకట్టుకున్నారు. ఆ సాంగ్‌ మంచి సెన్సేషన్‌ కూడా అయింది.

ప్రస్తుతం శివకార్తికేయన్​ సినిమాల విషయానికి వస్తే ఆయన నటించిన అమరన్‌ సినిమా విడుదలకు సిద్ధం అవుతోంది. ఇందులో ఆయన మేజర్‌ ముకుంద్‌ వరదరాజన్‌గా కనిపించనున్నారు. ఆ తర్వాత ఏఆర్‌ మురుగదాస్‌తో ఓ సినిమా చేయనున్నారు.

రాజమౌళి, మహేశ్ సినిమాలో ఛాన్స్​ - క్లారిటీ ఇచ్చిన కట్టప్ప - Rajamouli Mahesh Movie

సినిమాల్లో సల్మాన్ లిప్ కిస్​ చేసిన ఒకే ఒక్క స్టార్ హీరోయిన్ ఎవరంటే? - SALMAN KHAN

Last Updated : May 30, 2024, 10:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.