ETV Bharat / entertainment

లేడీ బాస్​గా శ్రీలీల కొత్త మూవీ గ్లింప్స్​ - అల్ట్రా స్టైలిష్​ లుక్​లో కట్టిపడేసింది! - HappyBirthday Sreeleela - HAPPYBIRTHDAY SREELEELA

HappyBirthday Sreeleela Nithin Robinhood movie : శ్రీలీల కొత్త సినిమా నుంచి అదిరిపోయే గ్లింప్స్​ రిలీజ్ అయింది. ఇందులో శ్రీలీల లేడీ బాస్​గా అల్ట్రా స్టైలిష్​ లుక్​లో ఫుల్​ రిచ్ అండ్​ గ్లామర్​గా కనిపించి ఆకట్టుకుంది. మీరు వీడియో చూశారా?

source ETV Bharat
Sreeleela (source ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Jun 14, 2024, 11:49 AM IST

HappyBirthday Sreeleela Nithin Robinhood movie : మొన్నటి వరకు చేతినిండా సినిమాలతో కెరీర్‌ పరంగా దూసుకెళ్లిన నటి శ్రీలీల. ఓవైపు ఎంబీబీఎస్‌ చదువుతూనే మరోవైపు టాప్‌ హీరోల సరసన ఆఫర్స్‌ సొంతం చేసుకుంటూ టాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగింది. కానీ అదృష్టం కలిసి రాక చేసిన ప్రతీ సినిమా వరుసగా ఫ్లాప్ అయ్యాయి. దీంతో కాస్త జోరు తగ్గించిన ఈ ముద్దుగుమ్మ సరైన కథ కోసం వేచి చూస్తోంది. ప్రస్తుతం ఆమె చేతిలో ఉస్తాద్ భగత్ సింగ్​, రవితేజ 75వ సినిమాలు మాత్రమే ఉన్నాయి.

అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ మరో సినిమాకు గ్రీన్ ఇచ్చినట్లు తెలిసింది. దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్​మెంట్ కూడా వచ్చింది. అదే నితిన్ హీరోగా నటిస్తున్న రాబిన్​ హుడ్. నేడు శ్రీలీల పుట్టినరోజు సందర్భంగా రాబిన్ హుడ్ టీమ్ స్పెషల్​ బర్త్​డే విషెస్ తెలుపుతూ ఓ గ్లింప్స్​ను విడుదల చేసింది. ఇందులో శ్రీలీల అల్ట్రా స్టైలిష్​ లుక్​లో ఫుల్​ రిచ్ అండ్​ గ్లామర్​గా కనిపించింది. ఓ ఫ్లైట్​ నుంచి దిగి నడుస్తూ 'సునామీలో టీ సైలెంట్ ఉండాలి, నా ముందు నువ్వు సైలెంట్ ఉండాలి' అంటూ వెన్నెల కిశోర్​ డైలాగ్ చెబుతూ ఆకట్టుకుంది. అనంతరం ఓ కుర్చిలో టీ తాగుతూ బుక్ చదువుతూ కనిపించింది. ఈ వీడియోను షేర్ చేసిన మూవీటీమ్​ 'లేడీ బాస్ వ‌చ్చేసింది. హ్యాపీ బ‌ర్త్‌డే శ్రీలీల' అంటూ క్యాప్షన్ రాసుకొచ్చింది. శ్రీలీలను అలియాస్ నీరా వాసుదేవ్​గా పరిచయం చేస్తున్నట్లు తెలిపింది.

కాగా, నితిన్ హీరోగా వెంకీ కుడుముల ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. భీష్మ కాంబినేష‌న్ కావ‌డం వల్ల ఈ సినిమా పై అభిమానుల్లో మంచి అంచ‌నాలు ఏర్పడ్డాయి. అయితే ఈ చిత్రంలో మొద‌ట‌గా ర‌ష్మిక న‌టిస్తుంద‌ని చిత్ర బృందం అనౌన్స్ చేసింది. కానీ కొన్ని కార‌ణాల వ‌ల్ల ఆమె ఈ చిత్రం నుంచి త‌ప్పుకుంది. ఆ తర్వాత రాశి ఖ‌న్నాతో పాటు ప‌లువురు హీరోయిన్ల పేర్లు వినిపించాయి. అయితే దీనిపై చిత్ర బృందం స్పందించ‌లేదు. తాజాగా శ్రీలీల గ్లింప్స్​ను విడుదల చేస్తూ రూమ‌ర్లు అన్నింటికి స‌మాధానం ఇచ్చింది. ఇకపోతే గతంలో నితిన్​ - శ్రీలీల కలిసి ఎక్స్​ట్రార్డినరీలో నటించిన సంగతి తెలిసిందే. ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర యావరేజ్​గా నిలిచింది.

పేరు మార్చుకోనున్న శ్రీలీల! - ఎందుకంటే?

మాట నిలబెట్టుకున్న శ్రీలీల - ఆ స్టార్ హీరో సినిమాకు నో! - Vijay Thalapathy Sreeleela

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.