Happy Birthday Ram pothineni : టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ ఉస్తాద్ రామ్ పోతినేని - ఈ పేరుకు స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. సినీ బ్యాగ్రౌండ్‌తో చిత్రసీమలోకి అడుగుపెట్టినప్పటికీ చాలా కష్టపడి తనకంటూ సెపరేట్ ఇమేజ్ సంపాదించుకున్నారు. ఓ వైపు క్లాస్ హీరోగా మరోవైపు మాస్ హీరోగా కెరీర్లో రాణిస్తూ ముందుకెళ్తున్నారు. అయితే ప్రస్తుతం పలు ప్రాజెక్ట్స్‌తో పాన్ ఇండియా ఆడియెన్స్‌ను టార్గెట్ చేస్తున్న రాపో(RAPO పుట్టినరోజు నేడు (మే 15). ఈ సందర్భంగా ఆయన గురించి కొన్ని ఆసక్తికర విషయాలు మీకోసం.
- 1988 మే 15వ తేదీన మురళీ పోతినేని, పద్మశ్రీ దంపతులకు జన్మించారు రామ్. వీరిది విజయవాడ. ఆ తర్వాత హైదరాబాద్‌లో సెటిల్ అయిపోయారు. టాలీవుడ్ సీనియర్ ప్రొడ్యూసర్ స్రవంతి రవి కిశోర్ రామ్‌పోతినేనికి పెదనాన్న అవుతారట. అలా మరో హీరో శర్వానంద్‌తోనూ బంధుత్వం ఉంది. రామ్ పోతినేని అక్క మధుస్మితను శర్వానంద్ అన్న కళ్యాణ్ పెళ్లి చేసుకున్నారు. అలా వీరిద్దరూ బావబామ్మర్ది అవుతారన్న సంగతి చాలా తక్కువ మందికే తెలుసు.
- చెన్నైలో చదువుకున్న రామ్ పోతినేని 2002లో అడయాళం అనే తమిళ షార్ట్ ఫిల్మ్‌తో కెరీర్ ప్రారంభించారు. ఇందులో ఆయన మత్తు పదార్థాలకు బానిస అయిన 18ఏళ్ల కుర్రాడి పాత్ర పోషించారు. అప్పుడు ఈయన వయసు 11 ఏళ్లు మాత్రమే. ఇందులో ఆయన నటనకు గానూ యూరోపియన్ ఫిల్మ్ ఫెస్టివల్లో బెస్ట్ యాక్టర్ అవార్డ్ వచ్చింది.
- ఆ తర్వాత దర్శకుడు వైవీఎస్ చౌదరీ చేతుల మీదుగా 2006లో 'దేవదాస్ సినిమాతో హీరోగా(18 ఏళ్లకే) ఎంట్రీ ఇచ్చారు. తొలి చిత్రంతోనే స్క్రీన్ ప్రెజెన్స్‌తో అందరినీ ఆకట్టుకున్నారు. ఫిల్మ్‌ఫేర్ బెస్ట్ డెబ్యూటెంట్ అవార్డ్ కూడా వచ్చింది. నటించిన తొలి సినిమానే సిల్వర్ జుబ్లీగా ఆడటం మొదట రామ్‌కే చెల్లింది.
- ఆ తర్వాత మస్కా, గణేశ్, రామరామ కృష్ణకృష్ణ, కందిరీగ, ఎందుకంటే ప్రేమంట, ఒంగోలు గిత్త, మసాలా, పండగ చేస్కో, నేను శైలజ, శివం, హైపర్, ఉన్నది ఒకటే జిందగీ, హలో గురు ప్రేమ కోసమే వంటి సినిమాలను వరుసగా రిజల్ట్స్‌తో సంబంధం లేకుండా చేశారు. ఇందులో కొన్ని సూపర్ హిట్స్, ఫ్లాప్స్ ఉన్నాయి.
- కానీ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ రామ్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ అందుకుంది. ఊర మాస్ హీరోగా పేరిచ్చింది. మంచి ఫాలోయింగ్‌ను తెచ్చిపెట్టింది. ఇక రెడ్ పర్వాలేదనిపించినా ది వారియర్ బోల్తా కొట్టింది. చివరగా బోయపాటితో చేసిన స్కంద మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. ఇక రామ్ నటించిన చాలా సినిమాలకు యూట్యూబ్ హిందీ వెర్షన్లో మంచి వ్యూస్ వస్తాయి. అయితే ఇంకా పాన్ ఇండియా మార్కెట్‌ను సంపాదించుకోలేకపోయారు. ప్రస్తుతం ఆ పని మీదే ఉన్నారు.
Rampothineni Double Ismart : ప్రస్తుతం పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో డబుల్ ఇస్మార్ట్ చేస్తున్నారు. ఇందులో సంజయ్ దత్ కూడా నటించడం విశేషం. ఈ సినిమా త్వరలోనే రిలీజ్ కానుంది. ఈ చిత్రంతో ఆయన బాలీవుడ్లో క్రేజ్ సంపాదించుకుంటారేమో చూడాలి.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
గుండె సంబంధిత సమస్యతో హాస్పిటల్లో చేరిన ప్రముఖ నటి! - Rakhi Sawant Hospitalized
బాలయ్య పెట్టిన ఆ ఒక్క మెసేజ్ - షోలోనే ఏడ్చేసిన యాంకర్ ఉదయభాను! - Balakrishna Udaya bhanu