ETV Bharat / entertainment

'రాజా సాబ్​' బర్త్​డే స్పెషల్ మోషన్ పోస్టర్ - సింహాసనంపై కూర్చొని సిగార్ కాలుస్తూ - THE RAJA SAAB MOVIE

'ది రాజా సాబ్​' మోషన్​ పోస్టర్ - ఎప్పుడూ చూడని విధంగా సరికొత్తగా ప్రభాస్!

The Raja Saab Poster
Prabhas (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 23, 2024, 2:23 PM IST

Updated : Oct 23, 2024, 2:29 PM IST

Prabhas The Raja Saab Poster : రెబల్​ స్టార్ ప్రభాస్ బర్త్ ​డే సందర్భంగా ఆయన అప్​కమింగ్ మూవీ 'ది రాజా సాబ్' మేకర్స్, అభిమానుల కోసం ఓ డిఫరెంట్​ మోషన్​ పోస్టర్​ను రిలీజ్​ చేశారు. అందులో ప్రభాస్ ఎప్పుడూ చూడని విధంగా సరికొత్తగా కనిపించారు. ఇందులో ప్రభాస్​ సింహాసనంపై కూర్చొని సిగార్​ కాలుస్తూ రాజు లుక్​లో కనిపించారు. బ్యాక్​గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఆకట్టుకునేలా సాగింది. అంతకుముందు రోజు విడుదల చేసిన పోస్టర్​లో గళ్ల చొక్కా, కళ్లద్దాలు పెట్టుకుని స్టైల్‌గా నడుస్తూ కనిపించారు ప్రభాస్‌.

మారుతి దర్శకత్వంలో హారర్ కామెడీగా రాజాసాబ్​ తెరకెక్కుతోంది. సీక్రెట్‌గా షూటింగ్​ మొదలు పెట్టిన ఈ చిత్రాన్ని చాలా షెడ్యూళ్లు జరిపిన తర్వాత అఫీషియల్​గా అనౌన్స్​ చేశారు. మిగిలిన చిత్రీకరణను వీలైనంత త్వరగానే కంప్లీట్ చేసేలా చిత్ర యూనిట్ ప్లాన్​ చేసుకుంటూ ముందుకు వెళ్తోంది.

కాగా, హర్రర్ థ్రిల్లర్ కాన్సెప్ట్​తో రాబోతున్న 'ది రాజా సాబ్'లో ప్రభాస్​తో పాటు నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో సంజయ్ దత్ కీలక పాత్రలో నటిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌ నిర్మిస్తోంది. టీజీ విశ్వప్రసాద్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మూవీ బ‌డ్జెట్ దాదాపు రూ. 200 కోట్లపైనే అని టాలీవుడ్ వ‌ర్గాల్లో ప్ర‌చారం జ‌రుగుతోంది. తమన్ స్వరాలు సమకూరుస్తున్నాడు. తెలుగు సహా హిందీ, తమిళం, మళయాలం, కన్నడ భాషల్లో పాన్ఇండియా లెవెల్​లో ఈ చిత్రం తెరకెక్కుతోండగా, వచ్చే ఏడాది ఏప్రిల్ 10న విడుదల కానుంది.

Prabhas Upcoming Movies : ప్ర‌స్తుతం తెలుగులో మోస్ట్ బిజీయోస్ట్ హీరోగా కొన‌సాగుతోన్నారు ప్ర‌భాస్‌. రాజాసాబ్‌తో పాటు, హ‌ను రాఘ‌వ‌పూడి ద‌ర్శ‌క‌త్వంలో ఫౌజీ అనే పీరియాడిక‌ల్ ల‌వ్ స్టోరీ, సందీప్ వంగాతో స్పిరిట్ అనే మూవీ చేస్తున్నారు. వీటితో పాటే క‌ల్కి, స‌లార్ సీక్వెల్‌ల‌లోనూ ప్ర‌భాస్ హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమాలతో పాటు హ‌నుమాన్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ వ‌ర్మ డైరెక్ష‌న్‌లో ఓ మూవీకి గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్లు ప్రచారం సాగుతోంది.

డార్లింగ్ బర్త్​డే స్పెషల్ - ప్రభాస్ గురించి ఈ 10 ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసా?

'ఆ కటౌట్​ చూసి అన్ని నమ్మేయాలి డూడ్​!' - డార్లింగ్​కు చిరు స్పెషల్ విషెస్​!

Last Updated : Oct 23, 2024, 2:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.