Hanuman OTT: తేజ సజ్జా- ప్రశాంత్ వర్మ సెన్సేషనల్ మూవీ హనుమాన్ మూడో వారం కూడా దూసుకెళ్తోంది. ఇప్పటికే ఈ సినిమా వరల్డ్‌వైడ్‌గా రూ.250 కోట్ల మార్క్ దాటేసింది. ఇక ఇప్పటికే థియేటర్లలో మూవీ ఎక్స్పీరియన్స్ చేసిన ఆడియెన్స్ ఇప్పుడు ఓటీటీ కోసం ఎదురు చూస్తున్నారు. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జీ5 (Zee 5) ఈ సినిమా స్ట్రీమింగ్స్ రైట్స్ దక్కించుకుంది. అయితే ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం సినిమా రిలీజైన మూడు వారాలకు రావాల్సి ఉంది. కానీ, ఈ సినిమాకు భారీ స్థాయిలో ఆదరణ లభిస్తోంది. సినిమా విడుదలై 15 రోజులు దాటినా హౌస్‌ఫుల్ షోతో రన్ అవుతోంది. దీంతో హనుమాన్ ఓటీటీ స్ట్రీమింగ్ మరింత ఆలస్యం కానుంది.
అయితే మూవీటీమ్, జీ5తో ఓటీటీ రిలీజ్ అగ్రిమెంట్‌ను సవరించుకున్నట్లు తెలుస్తోంది. ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తున్నందున ఈ నిర్ణయం తీసుకున్నారట. తాజా అగ్రిమెంట్ ప్రకారం ఈ సినిమా రిలీజైన 55 రోజుల తర్వాత ఓటీటీలో అందుబాటులోకి తీసుకురానున్నారు. అంటే మార్చి మొదటి వారం నుంచి హనుమాన్ స్ట్రీమింగ్ కానుంది.
-
#M9Exclusive
— M9.NEWS (@M9Breaking) January 29, 2024 " class="align-text-top noRightClick twitterSection" data="
Zee5 has #HanuMan OTT Rights.
Original Agreement is for streaming after three weeks. Zee5 extended it to after 55 days helping the theatrical run.
The film is a jackpot for Zee!
">#M9Exclusive
— M9.NEWS (@M9Breaking) January 29, 2024
Zee5 has #HanuMan OTT Rights.
Original Agreement is for streaming after three weeks. Zee5 extended it to after 55 days helping the theatrical run.
The film is a jackpot for Zee!#M9Exclusive
— M9.NEWS (@M9Breaking) January 29, 2024
Zee5 has #HanuMan OTT Rights.
Original Agreement is for streaming after three weeks. Zee5 extended it to after 55 days helping the theatrical run.
The film is a jackpot for Zee!
Hanuman Overseas Collection: విడుదల రోజు నుంచే హనుమాన్ ఓవర్సీస్లోనూ దూసుకుపోతోంది. తాజాగా ఈ మూవీ మరో రికార్డ్ కొట్టింది. ఓవర్సీస్లో 5మిలియన్ డాలర్ల క్లబ్‌లోకి హనుమాన్ ఎంటర్ అయ్యింది. దీంతో ఓవర్సీస్లో 5మిలియన్ డాలర్లు సాధించిన టాప్- 5 తెలుగు సినిమాల్లో ఒకటిగా నిలిచింది.
Saindhav OTT: విక్టరీ వెంకటేశ్ తాజాగా సైంధవ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. యంగ్ డైరెక్టర్ శైలేష్ కొలను ఈ సినిమా తెరకెక్కించారు. జనవరి 13న రిలీజైన ఈ సినిమా మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా డిజిటల్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. అయితే ఈ మూవీ ఫిబ్రవరి 02 నుంచి స్ట్రీమింగ్ అవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో కన్నడ భామ శ్రద్ధ శ్రీనాథ్, నవాజుద్దిన్ సిద్దిఖీ, రుహానీ శర్న తదితరులు నటించారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
PVCUలో రవితేజతో సినిమా ప్లాన్- హనుమాన్ డైరెక్టర్ క్రేజీ అప్డేట్