Hanuman Movie Box Office Collection : సంక్రాంతి బరిలోకి వచ్చి సెన్సేషనల్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు యంగ్ హీరో తేజ సజ్జా. ఆయన లీడ్ రోల్లో తెరకెక్కిన హనుమాన్ మూవీ ఇప్పటి వరకు ఎన్నో రికార్డులను బ్రేక్ చేసి సక్సెస్‌ఫుల్‌గా దూసుకెళ్తోంది. బాక్సాఫీస్‌లోనూ మంచి వసూళ్లు సాధించి చరిత్రకెక్కింది. పాన్ ఇండియా లెవెల్లో వచ్చిన ఈ చిత్రం అటు తెలుగు ఆడియెన్స్‌తో పాటు ఇతర భాష ప్రేక్షకులను ఆకట్టుకోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా ఈ మూవీ హిందీలో ఓ అరుదైన రికార్డును సాధించింది.
ఈ సినిమా బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద రూ. 50 కోట్లు నెట్ మార్కును దాటింది. అలా డబ్బింగ్ సినిమాల్లో అత్యథిక వసూళ్లు సాధించిన సినిమాగా చరిత్రెక్కింది. ఇప్పటికే ఈ లిస్ట్‌లో 'బాహుబలి 2' టాప్‌లో ఉండగా, ఆ తర్వాత కేజీఎఫ్ 2, RRR, రోబో 2.0, సలార్, సాహో, బాహుబలి 1, పుష్ప, కాంతార సినిమాలు ఈ జాబితాలో స్థానాన్ని సొంతం చేసుకున్నాయి.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
మరోవైపు ఈ చిత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో సక్సెస్‌ఫుల్‌గా దూసుకెళ్తోంది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా 31వ రోజు సుమారు రూ. 24 లక్షల షేర్‌ను వసూలు చేసిందట. ఈ నేపథ్యంలో నైజాంలో రూ. 7.15 కోట్లు, సీడెడ్‌లో రూ. 4.00 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 9.50 కోట్ల మేర బిజినెస్ జరిగిందని సమాచారం. అంతేకాకుండా ఇటీవల కాలంలో 30 రోజుల పాటు, అదీ 300లకు పైగా సెంటర్లలో సందడి చేసిన చిత్రంగా ఈ సినిమా రికార్డుకెక్కింది.
Hanuman Movie Cast : ఇక సినిమ విషయానికి వస్తే - ఈ సినిమాలో తేజతో పాటు అమృత అయ్యర్, వరలక్ష్మి శరత్‌కుమార్ కీ రోల్స్‌లో నటించారు. 'వానా' మూవీ ఫేమ్ వినయ్ రాయ్, వెన్నెల కిషోర్, రాజ్ దీపక్ శెట్టి, గెటప్ శ్రీను తదితరులు కీలక పాత్రలు పోషించారు. నిర్మాత నిరంజన్‌రెడ్డి ప్రైమ్‌షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై ఈ సినిమాను తెరకెక్కించారు. గౌర హరి, అనుదీప్ దేవ్, కృష్ణ సౌరభ్ ఈ చిత్రానికి చక్కటి సంగీతాన్ని అందించారు. ట్రైలర్‌తో పాటు, సాంగ్స్ కూడా ఆడియెన్స్‌ను తెగ ఆకట్టుకున్నాయి.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
హనుమాన్ : ఒక్క రుధిరమణి కోసం వంద మణులు - అంజనాద్రి ఆర్ట్ వర్క్ విశేషాలివీ!
PVCUలో రవితేజతో సినిమా ప్లాన్- హనుమాన్ డైరెక్టర్ క్రేజీ అప్డేట్