ETV Bharat / entertainment

గ్రామీ విజేతలుగా శంకర్​ మహదేవన్​, జాకీర్ హుస్సేన్​

Grammy Awards 2024 : సంగీత రంగంలో ప్రతిష్ఠాత్మకంగా భావించే గ్రామీ అవార్డుల ప్రదానోత్సవం వేడుకగా జరిగింది. ఇందులో ఇండియన్ మ్యూజిక్ ఆర్టిస్ట్​లు శంకర్​ మహదేవన్​, జాకీర్ హుస్సేన్​ విజయకేతనం ఎగురవేశారు.

grammy awards 2024
గ్రామీ అవార్డ్స్ 2024
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 5, 2024, 8:43 AM IST

Updated : Feb 5, 2024, 10:47 AM IST

Grammy Awards 2024 Shankar Mahadevan : సంగీత రంగంలో ప్రతిష్ఠాత్మకంగా భావించే గ్రామీ అవార్డుల ప్రదానోత్సవం సోమవారం అట్టహాసంగా జరిగింది. లాస్‌ ఏంజిల్స్​ వేదికగా జరిగిన 66వ గ్రామీ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో ప్రపంచదేశాలకు చెందిన సంగీత కళాకారులు పాల్గొన్నారు. ఈ అవార్డుల కోసం ప్రపంచ వ్యాప్తంగా పలు కేటగిరీల్లో అనేక పాటలు, మ్యూజిక్ ఆల్బమ్స్, వీడియో ఆల్బమ్స్ పోటీపడ్డాయి.

అయితే ఈ అంతర్జాతీయ సంగీత వేదికపై భారతీయులకు కూడా అవార్డులు దక్కడం విశేషం. ఇండియన్ మ్యూజిక్ ఆర్టిస్ట్​లు శంకర్ మహదేవన్​, జాకీర్ హుస్సేన్​ విజయకేతనం ఎగురవేశారు. వీరు కంపోజ్​ చేసిన 'దిస్ మూమెంట్​' బెస్ట్ గ్లోబల్ మ్యూజిక్​ ఆల్బమ్​గా అవార్డ్​ సొంతం చేసుకుంది. ఈ అవార్డు రావడంపై హర్షం వ్యక్తం చేసిన శంకర్ మహదేవన్​ ఈ పురస్కారాన్ని త‌న‌ భార్యకు అంకితమిస్తున్న‌ట్లు తెలిపారు. "నాకు ప్రతి విషయంలో ఎంతో ప్రోత్సాహం అందించిన నా భార్యకు ఈ అవార్డును అంకితం చేస్తున్నాను. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను? అని అన్నారు.

ఇకపోతే ఈ 'దిస్​ మూమెంట్​' పాటను 8 మంది కలిసి కంపోజ్ చేశారు. శక్తి ఫ్యూజన్‌ రూపొందించిన ఈ సాంగ్​కు జాన్ మెక్​ లాగ్లిన్(గిటార్​), జాకిర్ హుస్సేన్​(తబ్లా), శంకర్​ మహదేవన్​(సింగర్​), వి సెల్వగనేశ్​(percussionist​), గనేశ్​ రాజాగోపాలన్​(వయోలిన్ విద్వాంసుడు​) వర్క్ చేశారు. ఇకపోతే, భారతీయ సంగీతం గొప్పదనాన్ని విశ్వ వేదికపై చాటిన ఈ ఇద్దరికి ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

గ్రామీ 2024 విజేతలు

  • ఉత్తమ ర్యాప్‌ ఆల్బమ్‌ - మైఖేల్‌ (కిల్లర్‌ మైక్‌)
    ఉత్తమ ఆఫ్రికన్‌ సంగీత ప్రదర్శన - టైలా (వాటర్)
    మ్యాజిక్‌ వీడియో - జోనథన్‌ క్లైడ్‌ ఎమ్‌ కూపర్‌ (ఐయామ్‌ ఓన్లీ స్లీపింగ్‌)
    గ్లోబల్‌ మ్యూజిక్‌ ప్రదర్శన - జాకిర్‌ హుస్సేన్‌, బెలా ఫెక్‌ (పష్టో)
    గ్లోబల్‌ మ్యూజిక్‌ ఆల్బమ్‌ - శక్తి (దిస్ మూమెంట్‌)
    ఉత్తమ క్లాసికల్‌ సోలో వోకల్‌ ఆల్బమ్‌ - జూలియా బూల్లక్‌, సోలోయిస్ట్‌ (వాకింగ్‌ ఇన్‌ ద డార్క్‌)
    ఉత్తమ రాక్ ఆల్బమ్‌ - పారామోర్‌ (దిస్‌ ఇజ్‌ వై)
    ఉత్తమ రాక్‌ సాంగ్‌, ప్రదర్శన - బాయ్‌జెనియస్‌ (నాట్‌ స్ట్రాంగ్‌ ఎనఫ్‌)
    ఉత్తమ కామెడీ ఆల్బమ్‌ - డేవ్‌ చాపెల్‌ ( వాట్స్ ఇన్ ఏ నేమ్‌)
    ఉత్తమ కంట్రీ సాంగ్‌, సోలో ప్రదర్శన - క్రిస్‌ స్టేప్లెటన్‌ (వైట్‌ హార్స్‌)

నిమిషానికి కోటిన్నర - 'లాల్​ సలామ్'​ రజనీ రెమ్యునరేషన్ అన్ని కోట్లా?

స్టార్ హీరోయిన్​తో ప్రముఖ నిర్మాత రిలేషన్​షిప్​​ - రెడ్ హ్యాండెడ్​గా పట్టుకున్న భార్య!

Last Updated : Feb 5, 2024, 10:47 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.