Google 2024 Search Trends : మనం ఏదైనా ఓ విషయం గురించి తెలుసుకోవాలంటే ఆటోమెటిక్‌గా మనకు గూగుల్ గుర్తొస్తుంది. అందులో సెర్చ్ చేస్తే ఆ విషయానికి సంబంధించిన సమగ్ర సమచారం దొరుకుతుందని నమ్మకం. ఏజ్‌తో సంబంధం లేకుండా నెట్టింట చాలా వరకూ గూగుల్‌పైనే ఆధారపడుతుంటారు నెటిజన్లు. మరి ఈ ఏడాది మొత్తం మన భారతీయులు ఎక్కువ ఏ టాపిక్ గురించి వెతికారో తెలుసా? అదేంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే!
సినిమాల్లో ఆ హీరో గురించి, క్రికెట్లో అయితే!
2024లో భారతీయులు అత్యధికంగా వెతికిన అంశాల జాబితాను మంగళవారం ప్రచురించింది. అయితే అందులో ఈ ఏడాది అత్యధికంగా వెతికన టాపిక్స్‌లో క్రికెట్ లవర్స్ ఎంతో ఇష్టంగా చూసే ఐపీఎల్, టీ20 వరల్డ్ కప్ టాప్‌లో ఉన్నాయి. అయితే వీటితో పాటు సార్వత్రిక ఎన్నికలు వంటి అంశాలూ ఉన్నాయని తెలుస్తోంది. దివంగత టాటా గ్రూప్ ఛైర్మన్ రతన్ టాటా గురించి కూడా చాలా మంది నెటిజన్లు సెర్చ్ చేసినట్లు తెలుస్తోంది.
ఇక సినిమాల విషయానికొస్తే మూవీ లవర్స్ మోస్ట్ సెర్చ్డ్ టాపిక్ లిస్ట్‌లో బాలీవుడ్ మూవీ 'స్త్రీ2' పేరు టాప్‌లో ఉంది. ఇక ప్రభాస్ నటించిన 'కల్కి 2898 AD', 'సలార్' గురించి ఎక్కువ మంది సెర్చ్ చేశారని గూగుల్ వెల్లడించింది. వీటితో పాటు ప్రశాంత్ వర్మ - తేజా సజ్జా కాంబోలో తెరకెక్కిన 'హనుమాన్' కూడా ఈ లిస్ట్‌లో ఉంది. 'మీర్జాపూర్', 'హీరామండీ' షోస్ గురించి కూడా గూగుల్‌లో ఎక్కువ మంది సెర్చ్ చేసినట్లు తేలింది.
రెజ్లింగ్‌కు రిటైర్మెంట్ పలికి రాజకీయాల్లోకి అడుగుపెట్టిన వినేశ్ ఫొగాట్ గురించి కూడా చాలా మంది వెతికారని గూగుల్ వెల్లడించింది. ముఖ్యంగా మెస్ట్ సెర్చ్డ్ పర్సన్స్ లిస్ట్‌లో ఆమె అగ్రస్థానంలో నిలిచారు. బిహార్‌కు చెందిన నీతీశ్ కుమార్, చిరాగ్ పాసవాన్ గురించి కూడా ఎక్కువ మంది సెర్చ్ చేశారని తెలుస్తోంది.
మరోవైపు జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా టాప్ సెర్చ్‌లో ఉన్నారు. వ్యక్తుల లిస్ట్‌లో ఆయన ఐదో స్థానాన్ని కైవసం చేసుకున్నారు. ఇవి కాకుండా ఎక్కువగా సెర్చ్ చేసిన మీమ్స్, మీనింగ్స్, దగ్గర్లోని ప్రదేశాలు, పర్యాటక ప్రాంతాలు వంటి వాటితో గూగుల్ ఈ నివేదికను సిద్ధం చేసింది. వాటిని కూడా ఓ లుక్కేయండి మరి
Google's Year in Search 2024 is out highlighting the top trending searches in India.
— Abhishek Baxi (@baxiabhishek) December 10, 2024
More lists in the official blog post. https://t.co/YvZORZpxey pic.twitter.com/Mf3EKPGi10
IPLలో లోకల్ కుర్రాళ్లు- హోం టీమ్స్‌కు ఆడనున్న ప్లేయర్లు వీళ్లే!
'హరిహర వీరమల్లు' షూటింగ్ అప్డేట్ - ఫైనల్ షెడ్యూల్ కోసం పవన్ రెడీ