Chiranjeevi Viswambhara Ajith kumar : ఇద్దరు స్టార్ హీరోలు ఓకే స్టేజ్ పంచుకున్నా, ఒక చోట కలిసినా వారి అభిమానులు పండగ చేసుకుంటారు. వారిద్దరు కలిసి దిగిన ఫొటోలను షేర్ చేస్తూ ఆనందాన్ని వ్యక్తం చేస్తారు. అయితే తాజాగా ఇదే జరిగింది. మెగాస్టార్ చిరంజీవి, తలా అజిత్ కుమార్ ఒకే షూటింగ్ స్పాట్లో కనిపించారు. ఇక అంతే కెమెరా కళ్లు క్లిక్ మనిపించడంతో వారి ఫొటోల్ తెగ వైరల్ అవుతున్నాయి.
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ "గుడ్ బ్యాడ్ అగ్లీ" అనే యాక్షన్ థ్రిల్లర్ సినిమా చేస్తున్నారు. మార్క్ ఆంటోనీ ఫేమ్ డైరెక్టర్ అధిక్ రవిచంద్రన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ ప్రస్తుతం హైదరాబాద్‍లో షూటింగ్ జరుపుకుంటోంది. విశ్వంభర సెట్స్ దగ్గరే జరుగుతోంది. ఈ సందర్భంగా టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవిని అజిత్ కలిశారు. ఈ విషయాన్ని సర్‌ప్రైజ్ గెస్ట్ వచ్చారంటూ చిరూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తామిద్దరి పాత్ జ్ఞాపకాలను పంచుకున్నారు.
"విశ్వంభర సెట్స్‌కు ఓ సర్‌ప్రైజ్ స్టార్ గెస్ట్ వచ్చారు. ప్రియమైన అజిత్ కుమార్ వచ్చారు. కలిసి గొప్పగా సమయాన్ని గడిపాం. నేను ఆడియో లాంచ్ చేసిన ఆయన ప్రేమ పుస్తకం మూవీ జ్ఞాపకాలను మళ్లీ గుర్తు చేసుకున్నాం. ఆయన భార్య షాలినీ నా జగదేక వీరుడు అతిలోక సుందరిలో బాలనటిగా నటించింది" అని చిరంజీవి రాసుకొచ్చారు. అజిత్ స్టార్ డమ్ ఎప్పటికీ ఇలానే కొనసాగాలని ఆశించారు.
అజిత్ కుమార్ తన 63వ సినిమాగా ఈ గుడ్ బ్యాడ్ అగ్లీ ప్రాజెక్టుకు ఓకే చెప్పారు. అధిక్ రవిచంద్రన్ డైరక్షన్ చేస్తుండగా దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. అభినందన్ రామానుజం సినిమాటోగ్రఫీ, విజయ్ వేలుకుట్టి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. యానిమల్ ఫేం బాబీ దేఓల్, హీరోయిన్ శ్రీలీల నటిస్తున్నారని తెలిసింది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతగా వ్యవహరిస్తోంది. 2025 సంక్రాంతికి సినిమా రానుంది.
ఇక చిరంజీవి విశ్వంభర సోషియో ఫాంటసీ డ్రామాగా తెరకెక్కుతోంది. ఎంఎం కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు. త్రిష హీరోయిన్గా నటిస్తుండగా అశికా రంగనాథ్ మరో కీలక పాత్రలో నటిస్తోంది. ఇది కూడా సంక్రాంతికే రానుంది. ఇక త్రిష - అజిత్ కుమార్ కూడా కలిసి 'విదాముయర్చీ' అనే మరో సినిమాలో నటిస్తున్నారు.
విజయ్ స్పెషల్ రికార్డు - రీరిలీజ్ ట్రెండ్‌లోనూ ఆ 'ఒక్కడే' ఫస్ట్ - Vijay Gilli Movie
దేవరకు పోటీగా గేమ్‌ఛేంజర్ - క్లారిటీ ఇచ్చిన దిల్ రాజు కూతురు!