ETV Bharat / entertainment

వీకెండ్ స్పెషల్​ - సడెన్​గా OTTలోకి వచ్చేసిన తెలుగు హారర్​ మూవీ - Latest Telugu Horror Film - LATEST TELUGU HORROR FILM

వీకెండ్​ స్పెషల్​గా ఓటీటీలోకి మరో తెలుగు హారర్ కామెడీ చిత్రం వచ్చేసింది. ఇంతకీ ఆ చిత్రం ఏంటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో తెలుసుకుందాం. Getty Images

Getty Images
OTT (Getty Images)
author img

By ETV Bharat Telugu Team

Published : May 11, 2024, 5:08 PM IST

Geethanjali Malli Vachindi OTT : తెలుగు ఆడియెన్స్​లో హారర్ కామెడీ సినిమాలకు ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుందన్న సంగతి తెలిసిందే. అందుకే ఓటీటీ ప్లాట్​ఫామ్స్​ రెగ్యులర్​గా ఇంట్రెస్టింగ్ హారర్ మూవీస్​ను స్ట్రీమింగ్​కు అందుబాటులోకి తెస్తుంటాయి. అలా తాజాగా ఇదే బ్యాక్​డ్రాప్​తో మరో సినిమా అందుబాటులోకి వచ్చింది. అదే గీతాంజలి మళ్లీ వచ్చింది.

సీనియర్ హీరోయిన్ అంజలి టైటిల్ రోల్ పోషించిన లేటెస్ట్​ మూవీ ఇది. ఇప్పుడీ చిత్రం మరో ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు వచ్చింది. మొదట ఏప్రిల్ 11న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదు. అంతగా కలెక్షన్లు కూడా రాలేదు. టోటల్​ రన్​ టైమ్​లో మిక్స్డ్ టాక్​గా నిలిచింది. అయితే ఇది విడుదలై నెల రోజులు కూడా కాకుండానే మే8న ఆహాలోకి వచ్చిన ఈ చిత్రం ఇప్పుడు మరో ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో కూడా వచ్చేసింది. తాజాగా అది కూడా సడెన్​గా అమెజాన్ ప్రైమ్ వీడియోలో దర్శనమిచ్చింది. ఎటువంటి ముందస్తు ప్రకటన లేకుండా వచ్చి సర్​ప్రైజ్ చేసింది.

వాస్తవానికి గీతాంజలి మళ్లీ వచ్చింది చిత్ర డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుందనే ప్రచారం సాగింది. కానీ ఆ తర్వాత ఆహా దీని హక్కులను కొనుగోలు చేసింది. అంతలోనే ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియో కూడా ఈ చిత్రాన్ని స్ట్రీమింగ్ చేస్తోంది.

కాగా, 2014లో వచ్చిన హారర్ కామెడీ గీతాంజలి సూపర్ సక్సెస్ సాధించింది. దానికి సీక్వెల్‍గా పదేళ్ల తర్వాత ఇప్పుడు వచ్చిన గీతాంజలి మళ్లీ వచ్చింది. శివ తుర్లపాటి దర్శకత్వం వహించారు. అయితే ఈ చిత్రంలో అంజలి పాత్రకు పెద్దగా సవాల్‌ విసిరే సీన్స్​ ఏమీ లేవు. కాకపోతే క్లైమాక్స్​లో తనలోని యాక్షన్‌ కోణాన్ని చూపించింది. కొన్ని హారర్‌ సన్నివేశాలలో ఆమె పలికించిన హావభావాలు బాగున్నాయి. శ్రీనివాసరెడ్డి, సత్య, రవిశంకర్, షకలక శంకర్, సునీల్, సత్యం రాజేశ్ ఇతర ప్రధాన పాత్రల్లో నటించి తమ పాత్రలకు న్యాయం చేశారు. కోన వెంకట్, భాను భోగవరపు కథ, స్క్రీన్‍ప్లే అందించారు. కోన వెంకట్, ఎంవీవీ సత్యనారాయణ నిర్మించారు. ప్రవీణ్ లక్కరాజు స్వరాలు సమకూర్చారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

వీకెండ్ స్పెషల్​ - OTTలో 25 క్రేజీ సినిమా/సిరీస్​లు స్ట్రీమింగ్​ - This Week OTT Releases Movies

హిందీ తెరపై తెలుగోడి బయోపిక్​ - సూపర్ రెస్పాన్స్​! - Rajkummar Rao Srikanth Movie

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.