Vishwak Sen Gangs Of Godavari : ప్రతి వారంలాగే ఈ వారం కూడా బాక్సాఫీస్ వద్ద ముగ్గురు యంగ్ హీరోల సినిమాలు సందడి చేస్తున్నాయి. విశ్వక్ సేన్, ఆనంద్ దేవరకొండ, కార్తికేయ తమ చిత్రాలతో ప్రేక్షకులను అలరించేందుకు వచ్చారు. భారీ అంచనాల నడుమ థియేటర్లలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ మూడు చిత్రాలు ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాయి. అందులో ఒకటేమో హిట్ టాక్ అందుకోగా, మిగతా రెండూ మిక్స్డ్ టాక్‌తో నడుస్తోంది.
అయితే తాజాగా నెటిజన్లు ఈ మూడు సినిమాలకు సంబంధించిన కామన్ పాయింట్స్‌ను కనిపెట్టారు. మూడింటిలో కొన్ని ఇంట్రెస్టింగ్ పోలికలను వెతికి వాటిని ట్రెండ్ చేస్తున్నారు. అవేంటో చూసేద్దామా?
మొదటిది ఏంటంటే ఈ మూడు సినిమాల్లోనూ బ్లాక్ మనీకి సంబంధించిన పలు సీన్స్ ఉన్నాయి. అంతే కాకుండా అందులోని కొన్ని సన్నివేశాలు కూడా ఆ పాయింట్ చుట్టే నడుస్తాయట.
రెండో విషయం ఏంటంటే ఈ చిత్రాల్లో హీరోలకు మధ్య కూడా ఓ కామన్ పాయింట్ ఉంది. లీడ్ రోల్స్ ముగ్గురూ కూడా అనాథలుగానే కనిపించారు. 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' సినిమాలో విశ్వక్ సేన్ తన తల్లిదండ్రులు చిన్నప్పుడు చనిపోవడం వల్ల అనాథగా మారుతాడు. పెద్దయ్యాక చిన్నపాటి దొంగతనాలు చేస్తూ అదే ఊరిలో ఉంటాడు. 'భజే వాయు వేగం'లోనూ కార్తికేయ కూడా అనాథే. అంతే కాకుండా అతడు పెద్దయ్యాక ఓ కారును దొంగలించే ప్లాన్‌లో భాగమవుతాడు. ఇదిలా ఉండగా, 'గం గం గణేశా'లో ఆనంద్ దేవరకొండ కూడా ఆ మూవీలో అనాథగానే కనిపిస్తాడు. అంతే కాకుండా ఓ డైమండ్ దొంగగానూ సినిమాల్లో కనిపిస్తాడు.
ఇక ఫైనల్‌గా ఈ మూడు సినిమాలకు సంబంధించిన అసలైన కోయిన్సిడెన్స్ ఏంటంటే, 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' ప్రొడ్యూసర్ పేరు నాగ వంశీ, 'భజే వాయు వేగం' ప్రొడ్యూసర్ పేరు యూ.వీ వంశీ, ఇక 'గం గం గణేశ' ప్రొడ్యూసర్ పేరు కారుమంచి వంశీ. ఇలా ఈ మూడు చిత్రాల నిర్మాతల పేర్లు కూడా భలేగా కలిశాయి.
గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి - తొలిరోజు ఎన్ని కోట్లంటే?
గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి - ఎరుపెక్కిన గోదావరి - Gangs Of Godavari Review