ETV Bharat / entertainment

రూ.1400 కోట్ల విజువల్ వండర్ మూవీ రిలీజ్​కు రెడీ - ఫుల్ యాక్షన్ మోడ్​, ఛేజింగ్ సీన్స్​తో! - Furiosa A Mad Max Saga - FURIOSA A MAD MAX SAGA

Furiosa A Mad Max Saga Movie : మూవీ లవర్స్​ను అలరించేందుకు రూ.1400కోట్ల విజువల్ వండర్ యాక్షన్ సినిమా రిలీజ్​కు రెడీ అయింది. పూర్తి వివరాలు స్టోరీలో.

Source Getty Images
Cinema (Source Getty Images)
author img

By ETV Bharat Telugu Team

Published : May 16, 2024, 5:50 PM IST

Furiosa A Mad Max Saga Release Date : మ్యాడ్‌మ్యాక్స్ సిరీస్ గురించి సినీ ప్రియులకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేద. ఈ సిరీస్​ నుంచి వచ్చిన సినిమాలన్నీ అదిరే యాక్ష‌న్ సీన్స్​, విజువ‌ల్ ఎఫెక్ట్స్‌, గ్రాఫిక్స్​తో ప్రేక్ష‌కుల‌ను బాగా ఆకట్టుకున్నాయి. అయితే ఇప్పుడా సిరీస్​ నుంచి ఈ సారి ప్రీక్వెల్ వచ్చేందుకు రెడీ అయింది. ఫ్యూరియోసా ఏ మ్యాడ్‌మాక్స్ సాగా పేరుతో ఇది థియేటర్లలో రిలీజ్ కానుంది.

రీసెంట్​గా కూడా కేన్స్ ఫిలిమ్​ ఫెస్టివ‌ల్‌లో ఈ ఫ్యూరియోసా ఏ మ్యాడ్ మ్యాక్స్ సాగాను స్క్రీనింగ్ చేయగా మంచి రెస్పాన్స్ దక్కింది. ఏడు నిమిషాల స్టాండింగ్ ఓవేష‌న్ కూడా ల‌భించింది. సినిమా అద్భుతంగా ఉందంటూ ప్ర‌శంస‌లు దక్కాయి. ఇప్ప‌టికే నార్త్ అమెరికాలోనూ ఈ చిత్రాన్ని రిలీజ్​ చేయగా మూడు రోజుల్లోనే యాభై మిలియ‌న్ డాల‌ర్ల వ‌సూళ్ల‌ను చేసిందని హాలీవుడ్ సినీ వర్గాలు తెలిపాయి. ఇక ఇండియాలోనూ ఈ చిత్రం కచ్చితంగా వంద కోట్ల వ‌సూళ్ల‌ను అందుకుంటుందని ట్రేడ్ వ‌ర్గాలు అంచనా వేస్తున్నాయి. పైగా ఈ హాలీవుడ్ మూవీకి పెద్ద సినిమాలేవి పోటీగా రావట్లేదు. ఇది కూడా కలిసొచ్చే అవకాశం అని అంటున్నారు. ఇంగ్లీష్‌తో పాటు తెలుగు, త‌మిళం, హిందీ భాష‌ల్లోనూ ఈ చిత్రం మే 23న థియేటర్లలో విడుదల కానుంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

Furiosa A Mad Max Saga Budget : ఈ చిత్రాన్ని దాదాపు రూ. 1400 కోట్ల బ‌డ్జెట్‌తో తెర‌కెక్కించారని తెలిసింది. జార్జ్ మిల్ల‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. క్రిస్ హెమ్స్‌వ‌ర్త్‌, అన్న‌ టేల‌ర్ జాయ్ హీరోహీరోయిన్లుగా నటించారు. కాగా, మ్యాడ్‌మ్యాక్స్ సిరీస్‌లో ఇప్ప‌టివ‌ర‌కు నాలుగు సినిమాలు వచ్చాయి. ఇప్పుడు ఫ్యూరియోసా ఐదో చిత్రం. త్వరలోనే మ్యాడ్ మాక్స్ ది వెస్ట్‌లాండ్ పేరుతో ఆరో భాగం కూడా రాబోతోంది. చివరిగా 2015లో విడుదలైన మ్యాడ్ మ్యాక్స్ ఫ్యూరీ రోడ్ చిత్రం క‌మ‌ర్షియ‌ల్‌గా భారీ విజయాన్ని అందుకుంది. బెస్ట్ పిక్చ‌ర్‌, డైరెక్ట‌ర్‌తో పాటు మొత్తం ప‌ది విభాగాల్లోనామినేట్ అయిన ఈ చిత్రం ఆరు ఆస్కార్ అవార్డుల‌ను కూడా దక్కించుకుంది.

1977లో అనౌన్స్​మెంట్​ 2024లో రిలీజ్​కు సిద్ధం - రూ.1000 కోట్ల బడ్జెట్​తో రానున్న సినిమా! - MEGALOPOLIS MOVIE

రామ్​చరణ్​ హీరోయిన్​ను పట్టేసిన రాకింగ్ స్టార్​ యశ్​! - Toxic Movie Heroine

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.