First Indian Actress In Korean Movie : భారతీయ సినిమాలకు ప్రపంచ వ్యాప్తంగా ఎంత క్రేజ్ ఉందో, కొరియన్ సినిమాలకు యావత్ ప్రపంచంతో పాటు భారతదేశంలోనూ మంచి క్రేజ్ ఉంది. మరీ ముఖ్యంగా కొరియన్ సినిమాలు భారతీయ సినిమాల మాదిరిగా సెంటిమెంట్‌ను కలిగి ఉండటం చాలామందికి కనెక్ట్ అవుతుంది. అలాగే కొరియన్ సీరియల్స్, సాంగ్స్ అంతకంతకు పాపులర్ అవుతుండటం కూడా కొరియన్ సినిమాల పట్ల ఆసక్తి పెరగడానికి గల మరో కారణం.
తొలి భారతీయ నటిగా
ఇదిలాఉంటే టెలివిజన్ షోల ద్వారా ఎంతో పాపులారిటీని సంపాదించిన బాలీవుడ్ నటి అనుష్క సేన్ ఇప్పుడు అరుదైన రికార్డును క్రియేట్ చేసింది. 'దేవోంకీ దేవ్ మహాదేవ్', 'బాల్ వీర్' లాంటి సీరియల్స్‌తో మంచి గుర్తింపు సాధించిన ఈ నటి ఓ కొరియన్ సినిమాలో నటించి ఇప్పటివరకు మరే ఇండియన్ హీరోయిన్‌కు దక్కని అవకాశాన్ని కొట్టేసింది. కాగా, ఇప్పటివరకు మన దేశానికి చెందిన ఏ నటి కూడా కొరియాకి చెందిన సినిమాల్లో నటించలేదు. దీంతో అనుష్క సేన్ కొరియన్ సినిమాల్లో నటించే ఛాన్స్ కొట్టేసిన తొలి భారతీయురాలిగా అరుదైన రికార్డు సృష్టించింది.
7ఏళ్లప్పుడే తెరపైకి
అనుష్క సేన్‌తోపాటు బుల్లితెరలో స్టార్ ఇమేజ్ ఉన్న అవ్నీత్ కౌర్, సారా అర్జున్, హర్షాలి మల్హోత్రా, రుహానికా ధావన్ లాంటివారు చిన్న వయసులోనే టెలివిజన్ పరిశ్రమలోకి ప్రవేశించారు. కానీ వారెవరికీ దక్కని అవకాశం అనుష్క సేన్‌కు దక్కడం వెనుక ప్రత్యేక కారణాలు ఉన్నాయి. అనుష్క సేన్ ఏడేళ్ల వయసులో అంటే 2009లో జీ టీవీ సీరియల్ 'యహాన్ మైన్ ఘర్ ఘర్ ఖేలీ' ద్వారా తన కెరీర్‌ను ప్రారంభించింది. 2012లో 'బాల్ వీర్' అనే టీవీ సీరియల్‌లో మెహర్ పాత్రను పోషించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.
రియాలిటీ షోలోనూ పాల్గొని రికార్డు
2015లో 'క్రేజీ కుక్కడ్ ఫ్యామిలీ' చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది అనుష్క సేన్. ఆ సినిమా పెద్దగా కలెక్షన్లు వసూలు చేయలేదు. దీంతో మళ్లీ టీవీ సీరియల్స్‌నే నమ్ముకుంది అనుష్క సేన్. ఇంటర్నెట్ వాలా, లవ్ అండ్ డెవాన్ కే దేవ్, మహదేవ్ ధారావాహికల్లో నటించింది. 2019 సిరీస్ 'ఖూబ్ లడీ మర్దానీ- ఝాన్సీకి రాణి'లో మణికర్ణికా రాణి లక్ష్మీ బాయి అనే చారిత్రక పాత్ర పోషించిన అనుష్క సేన్ క్రేజ్ మరింత పెరిగిపోయింది. అంతేకాకుండా రోహిత్ శెట్టి నిర్వహించిన రియాలిటీ స్టంట్ షో 'ఖత్రోన్ కే ఖిలాడి'లో కూడా పాల్గొంది ఈ 21 ఏళ్ల చిన్నది. దీంతో రియాలిటీ షోలో పాల్గొన్న అతి పిన్న వయస్కురాలిగా కూడా రికార్డు క్రియేట్ చేసింది అనుష్క సేన్.
'ఆసియా'లో అనుష్క
'ఆసియా' అనే కొరియన్ చిత్రంలో నటించే అవకాశాన్ని దక్కించుకుంది అనుష్క సేన్. దీంతో కొరియన్ సినిమాలో నటించిన తొలి భారతీయ నటిగా నిలిచింది. 'నేను చేస్తున్న సినిమా పేరు ఆసియా, ఇది ఒక రకమైన ఆలోచన. ఆసియాపై ఒక చలనచిత్రాన్ని రూపొందించాలనే ప్రణాళికలో భాగంగా ఆసియా దేశాల్లోని నటీనటులు అందరినీ ఈ సినిమాలోకి తీసుకున్నారు. ఈ సినిమాలో నేను ప్రధాన పాత్ర పోషిస్తున్నాను' అంటూ ఓ ఇంటర్వ్యూలో చెప్పింది అనుష్క సేన్. చిత్రీకరణ సమయంలో దక్షిణ కొరియాలో అద్భుతమైన అనుభూతి పొందినట్లు అనుష్క సేన్ చెప్పింది. తనకి ఈ అవకాశం రావడంపై ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేసింది.
నెలకు రూ.5లక్షలు
చిన్నవయసులోనే బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చిన అనుష్క సేన్ తన నటనతో మంచి పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం ఒక్క ఎపిసోడ్‌కు రూ.లక్ష వసూలు చేస్తున్న అనుష్క సేన్, టీవీ షోలు, సీరియళ్ల ద్వారా నెలకు కనీసం రూ.5 లక్షల వరకు సంపాదిస్తోంది. ప్రస్తుతం ఆమె నికర సంపాదన రూ.15 కోట్లు వరకు ఉంటుందని అంచనా. ఈమె ప్రస్తుతం రూ.51 లక్షల ఖరీదు చేసే బీఎమ్‌డబ్ల్యూ స్పోర్ట్స్ కారును వినియోగిస్తోంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
నమ్రత బర్త్‌డే సెలబ్రేషన్స్ - స్పెషల్ అట్రాక్షన్‌గా ఆ ఇద్దరు!