February 2024 Release Movies : సంక్రాంతి సీజన్‌తో పాటు రిపబ్లిక్ డే బాక్సాఫీస్ కూడా ముగిసింది. వీటన్నింటిలో హనుమాన్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకోగా మిగతావి మిక్స్డ్ టాక్‌ను దక్కించుకున్నాయి. చిన్న సినిమాగా విడుదలైన హనుమాన్ ఏకంగా రూ.200 కోట్లకు పైగా వసూళ్లను అందుకుని సంచలనం సృష్టించింది. అయితే ఇక జనవరి వంతు ముగిసింది. ఫిబ్రవరి మొదలు కానుంది. ఫిబ్రవరిలో తెలుగుతో పాటు తమిళ, హిందీ, హాలీవుడ్ కలిపి మొత్తంగా 14 సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.
తొలి వారం విడుదలయ్యే సినిమాల్లో చెప్పుకోదగ్గ చిత్రం 'అంబాజీపేట మ్యారేజీ బ్యాండ్'. సుహాస్, శివాని జంటగా దుష్యంత్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రమిది. ఫిబ్రవరి 2న ఈ సినిమా విడుదల కానుంది. ఇప్పటికే రిలీజైన ట్రైలర్, సాంగ్స్ మెప్పించాయి. ఇక ఇదే రోజు గేమ్ ఆన్, బూట్ కట్ బాలరాజు, హ్యాపీ ఎండింగ్, కిస్మత్ వంటి చిత్రాలు కూడా రిలీజ్ కానున్నాయి.
ఇక రెండో వారంలో జీవా ప్రధాన పాత్రలో నటించిన 'యాత్ర 2' ఫిబ్రవరి 8వ తేదీన ఆడియెన్స్ ముందుకు రానుంది. మాస్ మహారాజా హీరోగా నటించిన ఈగల్ చిత్రం ఫిబ్రవరి 9వ తేదీన విడుదల కానుంది. ఈ రెండు సినిమాలపై మంచి అంచనాలే ఉన్నాయి. ఐశ్వర్య ధనుశ్ దర్శకత్వంలో రజనీకాంత్ గెస్ట్ రోల్ పోషించిన లాల్ సలామ్ కూడా ఫిబ్రవరి 9నే రిలీజ్ కానుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఫిబ్రవరి 16న మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన ఆపరేషన్ వాలెంటైన్ రిలీజ్ కానుంది. హీరో సందీప్ కిషన్ నటించిన సోషియో ఫాంటసీ ఊరు పేరు భైరవకోన కూడా అదే రోజు ఆడియెన్స్‌ను పలకరించనుంది. దీంతో పాటే ఫిబ్రవరి 16నే సుందరం మాస్టర్, మడమె వెబ్ కూడా విడుదల కానున్నాయి.
ఫైనల్‌గా చివరి వారంలో సంతోష్ శోభన్ నటించిన జోరుగా హుషారుగా షికారు పోదామా(ఫిబ్రవరి 29), రాజ్ తరుణ్ తిరగబడరా స్వామి(ఫిబ్రవరి 29) సినిమాలు థియేటర్స్‌లోకి రానున్నాయి. మరి ఈ చిత్రాల్లో ఏ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకుంటుందో చూడాలి.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
సంక్రాంతి సినిమాల OTT డేట్స్ - ఏ సినిమా ఎప్పుడంటే?
చైనీస్, ఇండోనేషియా, కొరియన్లో రీమేకైన తొలి ఇండియన్ మూవీ ఈయనదే!