Famous Celebrities Divorce: ప్రేమలు, పెళ్లిళ్లు, విడాకులు.. ప్రస్తుతం ఇవి సాధారణం అయ్యాయి. ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్లు కూడా కొన్నాళ్లకు విడిపోతున్న పరిస్థితి. అందులోనూ సెలబ్రిటీల విడాకుల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఏ రోజు ఏ సెలబ్రిటీ విడాకులు గురించి ప్రకటిస్తారో తెలియని పరిస్థితి. తాజాగా.. టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా విడాకులు తీసుకున్నట్లు ప్రకటించారు. తన భార్య నటాషా స్టాంకోవిచ్‌తో నాలుగేళ్ల బంధానికి స్వస్తి పలికినట్లు ప్రకటించారు. 2020లో పెళ్లి చేసుకున్న ఈ జంట.. 2024లో విడిపోయారు. వీరికి ఓ కుమారుడు కూడా ఉన్నాడు. హార్దిక్ పాండ్యా విడాకుల నేపథ్యంలో.. ఇప్పటి వరకు విడాకులు తీసుకున్న బాలీవుడ్ సెలబ్రిటీలు, ఇతర ప్రముఖుల గురించి నెటిజన్లు తెగ సెర్చ్ చేస్తున్నారు. మరి వారు ఎవరో ఇప్పుడు చూద్దాం..
అమీర్ ఖాన్ - కిరణ్ రావు: అమీర్ ఖాన్.. మొదటి భార్యతో విడాకుల తర్వాత.. డిసెంబరు 28, 2015న కిరణ్ రావును పెళ్లి చేసుకున్నారు. వారికి ఆజాద్ రావు ఖాన్ అనే అబ్బాయి ఉన్నాడు. 16 సంవత్సరాల వివాహ బంధం తర్వాత 2021లో పరస్పర అంగీకారంతో విడిపోతున్నట్లు ప్రకటించారు.
శిఖర్ ధావన్ - ఆయేషా ముఖర్జీ: ఆస్ట్రేలియాకు చెందిన బాక్సర్ ఆయేషా ముఖర్జీని ధావన్ 2012లో వివాహం చేసుకున్నాడు. వీరికి ఓ కుమారుడున్నారు. అయితే, వీరి మధ్య మనస్పర్థలు రావడంతో 2020 నుంచి దూరంగా ఉంటున్నారు. ధావన్ నుంచి తాను విడిపోతున్నట్లు 2021లో ఆయేషా ఇన్‌స్టా వేదికగా ప్రకటించింది. ఆమెకు అంతకు ముందే పెళ్లి అయి భర్త నుంచి విడిపోయింది. మొదటి భర్త ద్వారా ఆమెకు ఇద్దరు కుమార్తెలున్నారు.
మలైకా అరోరా - అర్బాజ్ ఖాన్: అర్బాజ్ ఖాన్, నటి మలైకా అరోరా 1998లో వివాహం చేసుకున్నారు. వారికి అర్హాన్ ఖాన్ అనే కుమారుడు 2002లో జన్మించాడు. ఈ జంట 28 మార్చి 2016న విడిపోతున్నట్లు ప్రకటించారు. 11 మే 2017న అధికారికంగా విడాకులు తీసుకున్నారు.
హృతిక్ రోషన్ - సుసానే ఖాన్: హృతిక్, సుస్సేన్ 20 డిసెంబర్ 2000న వివాహం చేసుకున్నారు. 14 సంవత్సరాల వివాహం తర్వాత.. ఈ జంట 2014లో పరస్పరం విడిపోవాలని నిర్ణయించుకుని విడాకులు తీసుకున్నారు.
విడాకులు తీసుకున్న మరో స్టార్ సెలబ్రిటీ కపుల్ - 11ఏళ్ల వివాహ బంధానికి స్వస్తి
కరిష్మా కపూర్ - సంజయ్ కపూర్: కరిష్మా, సంజయ్ 2003లో వివాహం చేసుకున్నారు. అనేక విభేదాలు, ఆరోపణల కారణంగా.. ఈ జంట 2014లో అధికారికంగా విడిపోయారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.
ఈషా దేఓల్ - భరత్ తక్తానీ: ప్రముఖ నటి, రాజకీయ నాయకురాలు హేమమాలిని పెద్ద కూతురు ఈషా దేఓల్(హీరోయిన్) తన భర్త నుంచి విడిపోయింది. తన 12 ఏళ్ల వైవాహిక జీవితానికి స్వస్తి చెబుతూ ఈ విషయాన్ని ఆఫీషియల్‌గా ప్రకటించింది. 2012లో భరత్ తక్తానీని పెళ్లాడిన ఈషా.. 2024లో విడాకులు తీసుకుంది.
అర్జున్ రాంపాల్ - మెహర్ జెసియా: 1998లో అర్జున్ రాంపాల్, మెహర్ జెసియా వివాహం చేసుకున్నారు. 2019లో విడాకుల కోసం దరఖాస్తు చేయగా.. 2022లో విడిపోతున్నట్లు ప్రకటించారు.
సైఫ్ అలీఖాన్ - అమృతా: సైఫ్ అలీఖాన్ 1991లో ప్రముఖ హిందీ నటి అమృతా సింగ్‌ను వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. 2004లో ఈ జంట విడాకులు తీసుకున్నారు. భరణంగా అమృతాకు ఆస్తిలో సగం వాటా ఇచ్చారు సైఫ్ అలీఖాన్. ఆ తర్వాత 2012లో ప్రముఖ బాలీవుడ్ నటి కరీనా కపూర్‌ను రెండో వివాహం చేసుకున్నారు.
సంజయ్ దత్ - రిచా శర్మ: 1987లో నటి రిచా శర్మతో సంజయ్ దత్ వివాహం జరిగింది. 1996లో రిచా బ్రెయిన్ ట్యూమర్‌తో మృతి చెందింది. వీరికి త్రిషాలా కూతురు. 1998లో మోడల్ రియా పిళ్లైతో రెండో పెళ్లి జరిగింది. 2005లో విడాకులు తీసుకున్నారు. 2008లో మాన్యతా దత్‌ను గోవాలో మూడో పెళ్లి చేసుకున్నారు సంజయ్.
జీవీ ప్రకాశ్- సైంధవి: ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాశ్.. తన భార్య సైంధవి నుంచి విడిపోయినట్లు తెలిపారు. ఇరు కుటుంబ సభ్యుల అంగీకారంతో 2013లో ప్రేమించుకుని పెళ్లి చేసుకున్న ఈ జంట.. 2024 మే లో విడిపోయారు. వీరిద్దరికి ఓ కూతురు ఉంది.
ధనుష్ - ఐశ్వర్య రజనీకాంత్: ధనుష్, ఐశ్వర్య రజనీకాంత్.. తమ 18 సంవత్సరాల వివాహ బంధానికి 2022లో వీడ్కోలు పలికారు. వీరికి ఇద్దరు కొడుకులు ఉన్నారు. పలు కారణాల వల్ల విడిపోతున్నట్లు సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు.
షాకింగ్ : సీక్రెట్‌గా పెళ్లి - ఏడాదికే విడాకులు తీసుకున్న జబర్దస్త్ నటి