Family Star Vijay Devarkonda : ఫ్యామిలీ స్టార్ సినిమా గత వారం విడుదలైంది. ఆ సినిమా మీద కొన్ని సోషల్ మీడియా సైట్లు విపరీతంగా దుష్ప్రచారం చేస్తున్నారంటూ విజయ్ దేవరకొండ టీమ్ మాదాపూర్ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియాలో చేసిన పోస్ట్స్ స్క్రీన్ షాట్స్‌ను ఆ సినిమా నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పోలీసులకు సమర్పించింది. ఇలాంటివి చేసేవారిపై తగిన చర్యలు తీసుకోవాలని కూడా కోరింది. అయితే ఈ నేపథ్యంలో విజయ్ కూడా స్వయంగా వెళ్లి కంప్లైంట్ ఇచ్చారంటూ ఒక ఫోటో వైరల్ అయింది. అయితే అది నిజం కాదని విజయ్ తాజాగా క్లారిటీ ఇచ్చారు. టీమ్ మాత్రమే వెళ్లి కంప్లైంట్ ఇచ్చారని తను వెళ్లలేదని స్పష్టత ఇచ్చారు. ఫొటో ఇప్పటిది కాదని పాతదని చెప్పారు.
అంతకుముందు ఈ సినిమా నిర్మాత దిల్ రాజు కూడా ఈ ట్రోల్స్ విషయమై స్పందించారు. సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తున్నా కొన్ని సోషల్ మీడియా పోస్ట్స్ ద్వారా తమ సినిమాపై ట్రోల్స్ వేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
కాగా, ఏప్రిల్ 5న విడుదలైన ఫ్యామిలీ స్టార్ సినిమాలో విజయ్‌కు జోడిగా మృణాల్ ఠాకూర్ నటించింది. పరశురామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు గోపి సుందర్ సంగీతం అందించారు. దాదాపు రూ.50 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిందీ సినిమా. మొదటి రోజు కలెక్షన్ దాదాపు రూ. 6 కోట్లు వచ్చాయి. ఐదు రోజుల్లో దాదాపు రూ. 16 కోట్ల వరకు అందుకుంది. రంజాన్‌తో పాటు వేసవి సెలవులు కూడా కలిసి రావడం వల్ల రెండో వారంతానికి ఈ సినిమాకు పెట్టిన బడ్జెట్లో సగం అయినా వచ్చే అవకాశం ఉంది. ఇక ఈ సినిమా ఓటిటి రైట్స్‌ను నెట్ ఫ్లిక్స్(Family Star OTT) దక్కించుకుందట. మరో రెండు వారాల తర్వాత ఓటిటిలో విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. చూడాలి మరి థియేటర్లలో అంతగా ఆకట్టుకోని ఈ చిత్రం ఓటీటీలోనైనా మంచి రెస్పాన్స్‌ను అందుకుంటుందో లేదో.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
టాలీవుడ్ నెక్ట్స్ సెంచరీ కొట్టే హీరో అతడేనా? - Tollywood Tier 2 Heroes
అంజలి 50వ సినిమా 'గీతాంజలి మళ్లీ వచ్చింది' ఎలా ఉందంటే? - Geethanjali Malli Vachindi Review