ETV Bharat / entertainment

పెళ్లైన మూడు నెలలకే నటి విడాకులు! - Divya Agarwal Divorce - DIVYA AGARWAL DIVORCE

పైళ్లైన మూడు నెలలకే తన భర్తతో విడిపోయేందుకు ఓ నటి సిద్ధమైనట్లు ప్రచారం సాగుతోంది. ఇంతకీ ఆమె ఎవరంటే?

Source Getty Images
Divya Agarwal Divorce (Source Getty Images)
author img

By ETV Bharat Telugu Team

Published : May 27, 2024, 10:27 PM IST

Divya Agarwal Divorce : గతంలో ప్రేమలో విఫలమైన నటి ఇప్పుడు పెళ్లిలోనూ ఫెయిల్ అయినట్లుగా తెలుస్తోంది. ఆమెనే ప్రముఖ బాలీవుడ్ నటి దివ్య అగర్వాల్. ఈ ఏడాది ఆమె తన ప్రియుడు అపూర్వ పడ్గాంకర్​ను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే పెళ్లైన మూడు నెలలకే వారిద్దరూ విడాకులు తీసుకొంటున్నారన్న వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వినిపిస్తున్నాయి. తాజాగా దివ్య తన ఇన్‌స్టాగ్రామ్ నుంచి పెళ్లి ఫొటోలన్నింటినీ తొలగించడం ఈ ఊహాగానాలకు తావిచ్చింది.

వాస్తవానికి దివ్య అగర్వాల్ రెండెళ్ల క్రితమే ప్రేమలో విఫలమైంది. నాలుగేళ్ల ప్రేమాయణం తర్వాత ప్రియుడు వరుణ్ సూద్​తో బ్రేకప్ జరిగిన విషయాన్ని2022లో మార్చి 6న స్వయంగా తానే బయటపెట్టింది. తర్వాత కొన్నాళ్లకు వ్యాపారవేత్త అపూర్వ పడ్గాంకర్ తో ప్రేమలో పడింది దివ్య. వీరిద్దరికీ 2022లో నిశ్చితార్థం జరగ్గా మూడు నెలల క్రితం అంటే ఈ ఏడాది ఫిబ్రవరి 20న పెళ్లి జరిగింది. అపూర్వ తనను చాలా బాగా చూసుకుంటాడని, అర్థం చేసుకునే భర్త దొరకడం తన అదృష్టం అని రీసెంట్​గానే చెప్పిన దివ్య ఇంతలోనే అందరికీ షాక్ ఇచ్చింది. విషయం విడాకుల వరకూ వచ్చిందా అని అనుమానించేలా చేసింది.

తన సోషల్ మీడియా అకౌంట్లలో నుంచి పెళ్లి ఫోటోలన్నింటినీ తొలగించింది ఈ బిగ్ బాస్ ఫేం బ్యూటీ దివ్య.ఈ సంగతి గమనించిన నెటిజన్లు ఆమె ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ మొత్తాన్ని వెతకడం మొదలు పెట్టారు. అపూర్వతో కలిసి దివ్య దిగిన ఒక్క ఫొటో కూడా కనిపించలేదు.పెళ్లి ఆల్బమ్​తో పాటు పెళ్లికి ముందు కొన్ని సందర్భాల్లో వారిద్దరూ దిగిన ఫొటోలు, పండగ సెలబ్రేషన్లు అన్నింటినీ డిలీట్ చేసేసింది.

పెళ్లైన మూడు నెలలకే వీరిద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయా అని కొందరు, హ్యాపీగా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు కదా ఇంతలోనే విడిపోతున్నారా అని ఇంకొందరు, విషయం విడాకుల వరకూ వచ్చిందా అని మరికొందరు అనుకుంటుంటే, ఇదంతా సోషల్ మీడియాలో ఫేం అయ్యేందుకు చేస్తున్నారా అని కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా ఈ అమ్మడు బయటపెట్టేవరకూ విడాకుల విషయాన్ని కన్ఫామ్ చేసుకోలేం.

కాగా, దివ్య అగర్వాల్,అపూర్వ ఇద్దరూ కలిసి చివరగా మే 24న దివ్య ఫ్రెండ్ పుట్టినరోజు పార్టీలో కనిపించారు. అక్కడ వారి వివాహ జీవితం గురించి ప్రశ్నించగా అపూర్వ సైలెంట్ గా ఉండగా, పెళ్లి తర్వాత ఏమీ మారలేదని అంతా అలాగే ఉందని దివ్య చెప్పుకొచ్చింది.

కల్కి 2898 ఏడీ నుంచి మరో స్పెషల్‌ వీడియో - ఆ రోజు నుంచే ఓటీటీలో స్ట్రీమింగ్‌ - Prabhas kalki 2898 AD

రూ.190కోట్ల బడ్జెట్ - కలెక్షన్స్​ రూ.15 కోట్లే! - Biggest Disaster movie

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.