Disha Patani Latest Interview : 2015లో పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన 'లోఫర్' సినిమాతో వెండితెరకు పరిచయమైంది బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచినప్పటికీ, ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి. దీంతో ఏకంగా బాలీవుడ్లో ఈ చిన్నదానికి వరుస ఆఫర్లు వచ్చాయి. ఈ క్రమంలోనే ఈ భామ టీమ్ఇండియా మాజీ కెప్టెన్ ధోనీ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన 'ధోనీ ది అన్‌టోల్డ్ స్టోరీ' సినిమాలోనూ ఛాన్స్ పట్టేసింది. ఇక ఈ సినిమా భారీ విజయం సాధించడం వల్ల ఆమె బీటౌన్‌లో టాప్ హీరోయిన్గా ఎదిగింది. మరి ఈ అమ్మడుకు సినిమాల్లోకి రావాలనే ఆలోచన ఎలా వచ్చింది? ఆమె ఇండస్ట్రీలోకి రావాడానికి కారణాలు ఏంటో మీకు తెలుసా?
దిశా పటానీ తండ్రి ఉత్తరప్రదేశ్ బరేలిలో ఓ పోలీస్ ఆఫీసర్. అమ్మ హెల్త్ ఇన్స్పెక్టర్. ఇక ఆమె సోదరి ఖుష్బూ దేశానికి సేవ చేయాలనే ఉద్దేశంతో ఇండియన్ ఆర్మీలో లెఫ్టినెంట్ హోదాలో విధులు నిర్వర్తిస్తోంది. అయితే పూర్తిగా పోలీస్ కుటుంబ నేపథ్యం ఉన్న దిశా సినిమా రంగాన్ని ఎంచుకోడానికి గల కారణాలు ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. తన తండ్రి పోలీస్ కావడం వల్ల ఆయన దిశాకు ఆ నేపథ్యంలో వచ్చే సినిమాలను ఎక్కువగా చూపించేవారట. అలాగే తన తల్లికి కూడా సినిమాలపై ఆసక్తి ఉండటం కూడా మరో కారణం అని చెప్పింది.
బీటెక్ చదువుతున్న సమయంలో స్థానికంగా జరిగే అందాల పోటీల కోసం తనకు తెలియకుండానే దిశా ఫ్రెండ్స్ ఆమె ఫొటోలను ఆడిషన్స్‌కు పంపించారట. అయితే ఆ పోటీకి ఎంపికైనట్లు లెటర్ రావడం వల్ల దిశా ఏమాత్రం ప్రిపేర్ కాకుండానే ఆ పోటీల్లో పాల్గొంది. అయినప్పటికీ అందరిని ఆశ్చర్యపరుస్తూ ఆ పోటీలో రన్నర్‌గా నిలిచింది. ఆ పోటీ వల్ల వచ్చిన కాన్పిడెన్స్, ధైర్యంతో చదువు మానేసి ముంబయి వెళ్లి మోడలింగ్‌తో పాటు అడిషన్స్‌కు వెళ్లడం ప్రారంభించింది. ఆ సమయంలోనే పూరీ సినిమాలో అవకాశం దక్కించుకుంది. ఆ తర్వాత 'ధోనీ' లాంటి సూపర్ హిట్ సినిమాతో ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డులలో బెస్ట్ డెబ్యూట్ యాక్ట్రెస్ అవార్డును గెలుచుకుంది. ఆ తర్వాత ఏకంగా యాక్షన్ కింగ్ జాకీ చాన్‌తో 'కుంగ్ ఫూ యోగా' లో నటించే అవకాశం వచ్చింది.
అయితే చిన్నప్పుడు తండ్రి నేర్పించిన మార్షల్ ఆర్ట్స్, కిక్ బాక్సింగ్ వల్ల ఆ సినిమా అడిషన్స్ లో యాక్షన్ సీన్ సునాయాసంగా చేసిన దిశాను వెంటనే తీసుకున్నారు. జాకీ చాన్ లాంటి గొప్ప నటుడితో పనిచేయడం తన అదృష్టమని చెప్తూ ఆ సినిమా షూటింగ్ లో జాకీ చాన్ తన అనుభవాలన్నీ కథల రూపంలో యాక్షన్ చేసి చూపించడం ఎంజాయ్ చేశానని అంటోంది ఈ కల్కి భామ.
బరేలీ టు బాలీవుడ్- పైలట్ అవ్వాలని యాక్టర్‌గా మారి సూపర్ క్రేజ్!
Disha Patani Latest Photos : దిశా.. చూస్తే ఎక్కేస్తుంది నిషా.. బాలీవుడ్ బ్యూటీ హాట్ గ్లామర్ షో