ETV Bharat / entertainment

ఫస్ట్ డే డైరెక్టర్ నాకు అలా చెప్పారు! అది నేనెప్పటికీ మర్చిపోలేను : 'కంగువా' ప్రమోషన్స్​లో దిశా పటానీ - SURIYA KANGUVA MOVIE

'కంగువా' ప్రమోషన్స్​లో దిశా పటానీ సూపర్ యాక్టివ్! సూపర్ యాక్టివ్! - సినిమా గురించి ఏం చెప్పారంటే?

Disha Patani About Kanguva
Disha Patani (Associated Press)
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 2, 2024, 9:12 AM IST

Disha Patani About Kanguva : 'కంగువా' సినిమాతో మరికొద్ది రోజుల్లో అభిమానులను పలకరించేందుకు వస్తున్నారు బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ. భారీ అంచనాల నడుమ నవంబర్ 14న ఈ చిత్రం థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం జరుగుతున్న ప్రమోషనల్ ఈవెంట్స్​లో ఆమె యాక్టివ్​గా పాల్గొంటూ సినిమా గురించి పలు ఆసక్తికరమైన విషయాలు చెప్పుకొస్తున్నారు. అలా తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ సినిమాలో నటించడం గురించి తన అనుభవాలను పంచుకున్నారు దిశ.

"నా కెరీర్‌లో ఇప్పటికీ నమ్మశక్యం కానీ క్షణాలు అవి. ఎందుకంటే నేను ఈ సినిమాలో ఎంతో మంది అద్భుతమైన వ్యక్తులు, దర్శకుడు, నటులతో కలిసి పని చేశాను. అతి తక్కువ సమయంలోనే మేమందరం ఒక కుటుంబంలా మారిపోయాం. మూవీటీమ్​ సహకారంతోనే ఎన్ని సవాళ్లు ఎదురైనా సరే నేను ఈ సినిమా షూటింగ్​ను ఎంతో సక్సెస్​ఫుల్​గా పూర్తిచేయగలిగాను. తన సినిమాలో నటీనటులు సెట్స్‌కి వచ్చినప్పుడల్లా సంతోషంగా పనిచేసుకోవాలని కోరుకుంటున్నాని డైరెక్టర్ శివ నాకు ఫస్ట్​ డే చెప్పారు. షూటింగ్‌ టైమ్​లో ఆయన నన్ను ఎంతో జాగ్రత్తగా చూసుకున్నారు. సూర్యతో కలిసి పనిచేయడం నా జీవితంలో మర్చిపోలేని ఓ మంచి అనుభవం. ఆయన కంటే తన కళ్లే ఎక్కువగా మాట్లాడతాయి. ఆయన నుంచి మనం ఎన్నో విషయాలను నేర్చుకోవచ్చు. బాబీ దేవోల్, జగపతి బాబు ఇలా చాలా మంది లెజెండ్స్‌తో కలిసి పనిచేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను" అని దిశా చెప్పుకొచ్చారు.

ఇక 'కంగవా' విషయానికి వస్తే, డైరెక్టర్ శివ తెరకెక్కించిన ఈ చిత్రంలో సూర్యతో పాటు బాబీ డియోల్, దిశా పటానీ లాంటి స్టార్స్ కీలక పాత్రలు పోషించారు. స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్, KVN ప్రొడక్షన్స్, పెన్ స్టూడియోస్ బ్యానర్లు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించాయి. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవీశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. తాజాగా విడుదలైన టీజర్, ట్రైలర్ కూడా ప్రేక్షకులను తెగ ఆకట్టుకున్నాయి. ఇందులో సూర్య రెండు విభిన్న పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది.

రాజమౌళి ఇన్​స్పిరేషన్​తో 'కంగువా' మూవీ! - అందుకే రెండేళ్లు పట్టింది : హీరో సూర్య

'20 ఏళ్ల తర్వాత రోలెక్స్‌ కోసమే అలా చేశా - కమల్​హాసన్​ అంటే భయమేసింది!' - సూర్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.