The Goat Movie Venkat Prabhu : కోలీవుడ్ స్టార్ హీరో నటించిన 'ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్'(ది గోట్) భారీ అంచనాలతో రీసెంట్గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ చిత్రం కలెక్షన్స్ పరంగా రికార్డులు సృష్టించినా టాక్ పరంగా లైట్‌గా మిక్స్డ్ టాక్ దక్కించుకుంది. ఈ నేపథ్యంలో నెగటివ్ రివ్యూస్‌పై దర్శకుడు వెంకట్ ప్రభు స్పందించారు.
ప్రేక్షకుల కోసమే ఈ సినిమాను తెరకెక్కించానని, క్రిటిక్స్ కోసం కాదని దర్శకుడు వెంకట్ ప్రభు అన్నారు. "సినిమాను తెరకెక్కించేందుకు మేం పడిన కష్టాన్ని ఎవరూ గుర్తించరు. ఎవరూ దీని గురించి మాట్లాడరు. కానీ కొందరు మాత్రం కావాలనే చిత్రంపై నెగెటివ్ కామెంట్స్ చేస్తుంటారు. ఈ మూవీలో ఉన్న రిఫరెన్స్‌లు ఏ సినిమాలోనూ ఉండవు. ఏ హీరో ఫ్యాన్ అయినా ఈ చిత్రాన్ని సెలబ్రేట్ చేసుకోవాలనే ఆలోచనతోనే రిఫరెన్స్‌లను తీసుకున్నాం. అతిథి పాత్రల కోసమే సినిమాను చేయలేదు. ఆడియెన్స్, అభిమానులు కోరుకునే అన్ని అంశాలను కథలో ఉండేలా తీర్చిదిద్దాం. సినిమా ప్రేక్షకుల కోసమే గానీ రివ్యూవర్స్ కోసం కాదు. అందరినీ మెప్పించేలా మూవీ తెరకెక్కించాలంటే ఎంతో సమయం కావాలి. మాకు తక్కువ సమయం మాత్రమే ఉంది" అని వెంకట్ ప్రభు అన్నారు.
The Goat Movie Collections : విజయ్ దళపతి కథానాయాకుడిగా వచ్చిన ఈ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ మూవీ ఈ నెల 5న విడుదలైంది. మీనాక్షి చౌదరి హీరోయిన్ నటించింది. వైభవ్, ప్రశాంత్, స్నేహ, లైలా, ప్రభుదేవ సహా పలువురు సినిమాలో నటించారు. శివ కార్తికేయన్, త్రిష గెస్ట్ రోల్స్‌లో సందడి చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో దివంగత నటుడు విజయకాంత్ రూపాన్ని కూడా చూపించారు. టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీని కూడా నటించేలా ప్రయత్నించారు కానీ వర్కౌట్ అవ్వలేదు. దీంతో ఐపీఎల్ ధోనీ విజువల్స్‌ను చూపించారు. కాగా, ఈ చిత్రం నాలుగు రోజుల్లో రూ. 280 కోట్లకుపైగా కలెక్షన్లను అందుకుంది.
The Goat Movie Run Time : ఈ సినిమా ఒరిజినల్ రన్ టైమ్ 3:40 గంటలు. కానీ 2:59 గంటల నిడివితోనే థియేటర్లలో రిలీజ్ చేశారు మేకర్స్. ఓటీటీలో మాత్రం ఫుల్ రన్‌టైమ్‌తోనే రిలీజ్ చేస్తారట.
డైరెక్టర్‌గా విజయ్ దళపతి కొడుకు - టాలీవుడ్ హీరోతో ఫస్ట్ మూవీ! - Vijay Thalapathy Son Movie