Director Teja Birthday Special : టాలీవుడ్లో సెన్సేషనల్ డైరెక్టర్ అనగానే గుర్తొచ్చే పేరు తేజ. 'చిత్రం' సినిమా ద్వారా డైరెక్టర్‌గా తన జర్నీ స్టార్ట్ చేసిన ఆయన ఇప్పటి వరకు చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ తనదైన బాటలోనే ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. అయితే ఈ స్టార్ డైరెక్టర్ కొత్త టాలెంట్ను పరిచయం చేయడంలో ఎప్పుడూ ముందుంటారు. ఆయన స్కూల్ నుంచి ఇప్పటి వరకు ఎంతో మంది హీరోయిన్లు వచ్చారు. ప్రస్తుతం వారిలో కొంతమంది స్టార్ స్టేటస్‌ను అనుభవిస్తున్నారు. వారెవరంటే :
- తొలి సినిమా 'చిత్రం'తో టాలీవుడ్ పరిశ్రమకు రీమాసేన్ రూపంలో సరికొత్త అందాన్ని పరిచయం చేశారు డైరెక్టర్ తేజ. ఇందులో ఈ ముద్దుగుమ్మ తన నటనతో తెలుగు ప్రేక్షకులను ఆక్టటుకుంది. ఆ తర్వాత ఈమె తెలుగుతో పాటు తమిళంలో పలు సినిమాల్లో నటించి ఆడియెన్స్‌ను మెప్పించింది.
- ఆ తర్వాత 2001లో విడుదలైన 'నువ్వు నేను' సినిమాతో అనిత అనే మరో బ్యూటీని పరిచయం చేశారు. ఈ సినిమాతోనే హీరో ఉదయ్‌కిరణ్ కూడా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. వీరిద్దరితో ఓ సూపర్ హిట్ కొట్టారు డైరెక్టర్ తేజ. ఈ సినిమ ఈ ముగ్గురి కెరీర్‌ను మలుపు తిప్పింది.
- ఇక 2002లో వచ్చిన జయం సినిమాతో సదా ఇండస్ట్రోలోకి ఎంట్రీ ఇచ్చారు. తేజ స్కూల్ ద్వారా తెలుగు తెరకు పరిచయమైన ఈ బ్యూటీ ఈ సినిమాతో తెలుగుతో పాటు తమిళంలోనూ స్టార్‌డమ్‌ను సంపాదించింది.
- మన చందమామ కాజల్‌ను కూడా తేజానే ఇండస్ట్రీకి పరిచయం చేశారు 'లక్ష్మీ కల్యాణం' సినిమాతో ఈమె టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది.
- ఇక 'నీకు నాకు' అనే సినిమా ద్వారా నందితా శ్వేత ఆ తర్వాత వచ్చిన 'ధైర్యం' సినిమా ద్వారా రైమా సేన్‌ను టాలివుడ్‌కు పరిచయం చేశారు. ఇలా ఇండస్ట్రీకి దాదాపు వెయ్యి మందికి పైగా టెక్నిషియన్లను, వారిలో కొంతమంది నటులను పరిచయం చేసినట్లు అప్పట్లో తేజ స్వయంగా వెల్లడించారు.
ఫుట్ పాత్‌పై జీవనం
Director Teja Biography : ఇక తేజ పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే చిన్నతనం నుంచే తేజ కష్టాల కడలిని ఈదుకుంటూ జీవితం సాగించారంటూ ఓ ఇంటర్వ్యూలో ఎమోషనలయ్యారు. చిన్నప్పుడే తల్లిదండ్రుల మరణం వల్ల తమ బంధువులు వాళ్లను ఆస్తి కోసం చేరదీశారని అయితే ఒకానొక సమయంలో ఆయన్ను వాళ్లే బయట పడుకోమన్నారంటూ చెప్పుకొచ్చారు. అవన్ని తట్టుకుని ఆ తర్వాత ఎవరికీ చెప్పకుండా పారిపోయి వచ్చేశారని అప్పుడు ఉండేందుకు చోటు లేక ఫుట్‌పాత్ మీద ఆకలితో పడుకున్నారంటూ బాధపడ్డారు. అయితే అక్కడ నుంచి ఇప్పుటి వరకు ఎన్నో విజయాలు సాధించారంటే దానికి కారణం సినిమానే అంటూ చెప్పుకొచ్చారు. ఇకపోతే రీసెంట్గా అహింస చిత్రంతో ప్రేక్షకుల్ని పలకరించిన ఆయన త్వరలోనే విలక్షన నటుడు రానాతో ఓ సినిమా చేయబోతున్నారు.
డైరెక్టర్ తేజ స్కూల్ నుంచి మరో కొత్త అందం.. లక్కీ హ్యాండ్ వర్కౌట్ అవుతుందా?