ETV Bharat / entertainment

రిషభ్​ శెట్టికి ప్రశాంత్ వర్మ థాంక్స్ - 'హనుమాన్' రోల్​కు పర్ఫెక్ట్ మ్యాచ్! - PRASHANTH VARMA JAI HANUMAN

రిషభ్​ శెట్టికి థాంక్స్ చెప్పిన ప్రశాంత్ వర్మ- నేషనల్ అవార్డ్ విన్నర్​ ఫొటో షేర్ చేసిన డైరెక్టర్

Prashanth Varma Jai Hanuman
Prashanth Varma Jai Hanuman (Source: ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 1, 2024, 3:41 PM IST

Prashanth Varma Jai Hanuman : నేషనల్ అవార్డ్ విన్నర్ రిషభ్ శెట్టి- యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కాంబోలో తెరకెక్కుతున్న సినిమా 'జై హనుమాన్'. 'శ్రీ రాముడికి హనుమంతుడు ఇచ్చిన మాట ఏమిటి?' అనే ప్రశ్నకు సమాధానంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. దీపావళి సందర్భంగా రీసెంట్​గా సినిమా నుంచి మేకర్స్​ తొలి పోస్టర్ విడుదల చేశారు. శ్రీ రాముడి విగ్రహాన్ని ఆంజనేయుడు గుండెలకు హత్తుకున్నట్లు ఉన్న ఈ పోస్టర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.

తాజాగా ప్రశాంత్ వర్మ నటుడు రిషభ్​తో కలిసి ఉన్న ఓ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ నేపథ్యంలో జై హనుమాన్ సినిమాలో భాగమైనందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. 'ఈ ప్రాజెక్ట్‌లో భాగమైన, జాతీయ అవార్డు అందుకున్న నటుడు రిషభ్‌ శెట్టికి ధన్యవాదాలు. హనుమాన్‌పై ఆయనకు ఉన్న భక్తి , అసమానమైన అంకితభావం ఈ పాత్రకు జీవం పోశాయి. అద్భుతమైన పరివర్తన, పరిపూర్ణత, తిరుగులేని నిబద్ధత 'జై హనుమాన్‌'ని అసాధారణమైనదిగా ఆయన మార్చారు. ప్రపంచవ్యాప్తంగా తన అభిమానులకు మరపురాని అనుభూతిని అందించడానికి ఆయన అన్ని విధాలా ప్రయత్నిస్తున్నారు. మీతో కలిసి ఈ ప్రయాణాన్ని ఆరంభించినందుకు ఆనందంగా ఉంది. జై హనుమాన్, జై జై హనుమాన్​' అని రాసుకొచ్చారు.

కాగా, ఈ ఏడాది జనవరిలో రిలీజైన 'హనుమాన్​' కు ఇది సీక్వెల్​గా రానుంది. 2024 సంక్రాంతి బరిలో నిలిచిన ఈ సినిమా భారీ విజయం సాధించింది. దీంతో ఈ సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమా 'హను- మాన్‌'కు మించి వందరెట్లు భారీ స్థాయిలో ఉంటుందని దర్శకుడు ప్రశాంత్‌ వర్మ ఇప్పటికే ఓ సందర్భంలో తెలిపారు. సీక్వెల్‌లో తేజ సజ్జా హీరో కాదని, కానీ సీక్వెల్‌లోనూ సజ్జా హనుమంతు పాత్ర ఉంటుందని అన్నారు.

ఈ 'జై హనుమాన్' చిత్రంతో పాటు, 'అధీర', 'మహాకాళి' చిత్రాలు కూడా ప్రశాంత్ వర్మ పీవీసీయూ సినిమాటిక్‌ యూనివర్స్‌లో భాగంగానే రానున్నాయి. మరోవైపు నందమూరి నట వారసుడు, బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ డెబ్యూ మూవీకి కూడా ప్రశాంత్‌ వర్మనే దర్శకత్వం వహిస్తున్నారు. మరి ఇది పీవీసీయూలో భాగమా కాదా అనేది ప్రస్తుతానికి తెలియాల్సి ఉంది.

'జై హనుమాన్' దీపావళి సర్​ప్రైజ్- ఆంజనేయుడి పాత్రలో రిషభ్ శెట్టి కన్ఫార్మ్​

PVCUలో ప్రభాస్ సినిమా - ప్రశాంత్ వర్మతో మూవీకి డార్లింగ్ ఓకే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.