ETV Bharat / entertainment

'ఎవరు గెలిస్తే నాకెందుకండి' - కల్కితో ముడిపెడుతూ ఎన్నికలపై నాగ్ అశ్విన్​ కామెంట్స్​! - Kalki 2898 AD Nag ashwin - KALKI 2898 AD NAG ASHWIN

Kalki 2898 AD Nag Ashwin : కల్కి సీజీ వర్క్​పై అప్డేట్ ఇచ్చారు చిత్ర దర్శకుడు నాగ్ అశ్విన్​. అలాగే ప్రస్తుతం ఏపీలో జరిగే ఎన్నికలపై కామెంట్ చేశారు. ఏం అన్నారంటే? ETV Bharat

ETV Bharat
Kalki 2898 AD Nag Ashwin (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : May 11, 2024, 1:33 PM IST

Updated : May 11, 2024, 2:28 PM IST

Kalki 2898 AD Nag Ashwin : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ హీరోగా దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్‌ ఫిల్మ్ కల్కి 2898 ఏడీ. ఈ సినిమా నిర్మాత స్వప్నదత్‌ తాజాగా దర్శకుడు నాగ్​ అశ్విన్​తో జరిగిన సరదా సంభాషణను ఇన్​స్టాలో పోస్ట్ చేశారు. "కల్కి సీజీ వర్క్‌ చేసే వారందరూ ఓటేయడానికి హైదరాబాద్‌ నుంచి వాళ్ల స్వస్థలాలకు వెళ్లిపోయారు. మరి ఇప్పుడెలా" అంటూ నాగ్‌ అశ్విన్‌ అడగగా - 'ఎవరు గెలుస్తారేంటి' అని స్వప్న తిరిగి ప్రశ్నించారు. అందుకు ఆయన సరదాగా బదులిచ్చారు. "ఎవరు గెలిస్తే నాకెందకు నా సీజీ షాట్స్‌ ఎప్పుడు వస్తాయో ఏమో అని ఎదురుచూస్తున్నాను" అని పేర్కొన్నారు. దీంతో కల్కి గ్రాఫిక్స్‌ వర్క్‌ ఇంకా పెండింగ్‌లో ఉన్నట్లు తెలిసింది.

అయితే వాయిదా పడుతూ వస్తోన్న ఈ చిత్రాన్ని జూన్‌ 27న వరల్డ్​ వైడ్​గా గ్రాండ్​గా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. రీసెంట్​గానే ఈ రిలీజ్ డేట్​ను అఫీషియల్​గా అనౌన్స్​ కూాడా చేశారు. దీంతో ఈలోగా ఎలాగైనా మిగిలి ఉన్న పనిని త్వరగా పూర్తి చేయాలని మూవీ యూనిట్‌ గట్టిగా ప్రయత్నిస్తుంది.

కాగా, ఈ కల్కి సినిమా భారీ బడ్జెట్‌తో సైన్స్‌ ఫిక్షన్‌ థ్రిల్లర్​గా తెరకెక్కుతోంది. భారీ బడ్జెట్​తో వైజయంతీ మూవీస్ నిర్మిస్తోంది. సినిమాలో పలు భాషలకు చెందిన టాప్ స్టార్ యాక్టర్స్ భాగం అయ్యారు. ప్రభాస్‌తో పాటు బోల్డ్ బ్యూటీస్​ దీపికా పదుకొణె. దిశా పటానీ, బిగ్​ బీ అమితాబ్‌ బచ్చన్‌, యూనివర్సల్ స్టార్​ కమల్‌ హాసన్‌ లాంటి వారు కీలక పాత్రలు పోషించడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. మహాభారతంతో మొదలై క్రీస్తుశకం 2898లో(Kalki 2898 AD Movie story) పూర్తయ్యే కథ ఇది అని, మొత్తంగా ఆరు వేల ఏళ్ల వ్యవధిలో ఈ కథ సాగుతుందని వివరించారు నాగ్ అశ్విన్. గతం, భవిష్యత్తుతో ముడిపడిన కథ అయినందున ఈ చిత్రం కోసం కొత్త ప్రపంచాల్ని సృష్టించామని చెప్పుకొచ్చారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

అరుంధ‌తి అక్కవా, చంద్ర‌ముఖి చెల్లెలివా - దెయ్యంతో వెన్నెల‌ కిశోర్​ కామెడీ చూశారా? - OMG Teaser

వీకెండ్ స్పెషల్​ - OTTలో 25 క్రేజీ సినిమా/సిరీస్​లు స్ట్రీమింగ్​ - This Week OTT Releases Movies

Last Updated : May 11, 2024, 2:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.