Dil Raju Dance: టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్‌రాజు తన సోదరుడి కుమారుడు ఆశిశ్ రెడ్డి వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌లో సందడి చేస్తున్నారు. ఫిబ్రవరి 14న ఆశిశ్ రెడ్డి- అద్వైత రెడ్డి వివాహం రాజస్థాన్ జైపుర్‌లో ఘనంగా జరిగింది. ఈ వివాహ వేడుకకు ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు హారయ్యారు. ఇక పెళ్లిలో దిల్‌రాజు తన మనవరాలితో కలిసి డ్యాన్స్ చేస్తూ సందడి చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌కాగా, తాజాగా మరో వీడియా ఒకటి బయటకు వచ్చింది.
పెళ్లికి ముందురోజు ఆశిశ్ రెడ్డి- అద్వైత రెడ్డి సంగీత్ గ్రాండ్‌గా జరిగింది. ఈ వేడుకలోనూ దిల్‌రాజు హుషారుగా కనిపించారు. షేర్వాణీ ధరించి లైవ్ మ్యూజిక్ కాన్సర్ట్‌ను ఎంజాయ్ చేశారు. తమిళ్ స్టార్ హీరో విజయ్ దళపతి బీస్ట్ సినిమాలోని 'అరబిక్ కుతూ' పాటకు స్టెప్పులెస్తూ ఈవెంట్‌కు హైలైట్‌గా నిలిచారు. ప్రస్తుతం ఈ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇక న్యూ కపుల్ ఆశిశ్- అద్వైత రెడ్డి ఫస్ట్‌టైమ్ ఓ ఫొటో సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇద్దరూ సంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోతున్నారు. వీరికి నెటిజన్లు, ఫ్యాన్స్ సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
అయితే కుటుంబ సభ్యులు, కొంతమంది సన్నిహితులు, ప్రముఖుల సమక్షంలో ఈ పెళ్లి జరిగడం వల్ల ఫిబ్రవరి 20న హైదరాబాద్‌లో గ్రాండ్‌గా రిసిప్షన్ పార్టీ ఏర్పాటు చేశారు. ఈ ఈవెంట్‌కు ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖులకు టాలీవుడ్ సెలబ్రిటీలకు ఆహ్వానాలు అందాయి. దిల్‌రాజు స్వయంగా పలువురి నివాసాలకు వెళ్లి స్వయంగా ఆహ్వానించారు.
ఆశీశ్ రెడ్డి 'రౌడీ బాయ్స్' సినిమాతో తెరంగేట్రం చేశారు. ఈ సినిమాలో కేరళ కుట్టి అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా నటించింది. ఈ సినిమాకు బాక్సాఫీస్ వద్ద మిశ్రమ స్పందన లభించింది. ప్రస్తుతం ఆశీశ్ 'సెల్ఫిష్' అనే సినిమాతో మరోసారి ప్రేక్షకులను అలరించనున్నారు. డైరెక్టర్ కసి విశాల్ ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. 'లవ్‌టుడే' ఫేమ్ చిన్నది ఇవానా ఈ సినిమాలో ఆశీశ్తో జతకట్టనుంది. ఈ సినిమా 2024 సమ్మర్లో రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది.
'నన్ను వాడుకుంటే తాటతీస్తా'- దిల్ రాజు స్ట్రాంగ్ కౌంటర్
సినీ పరిశ్రమ సమస్యలపై త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డిని కలుస్తాం : నిర్మాత దిల్ రాజు