Dhruv Sarja Martin Review :
చిత్రం: మార్టిన్;
నటీనటులు: ధృవ సర్జా, వైభవి శాండిల్య, అన్వేషి జైన్, సుకృత వాగ్లే తదితరులు;
రచన: అర్జున్ సర్జా;
దర్శకత్వం: ఏపీ అర్జున్
Martin Movie Review : సౌత్ నుంచి తాజాగా విడుదలైన మరో పాన్ ఇండియా సినిమా మార్టిన్. దాదాపు నాలుగేళ్లుగా ముస్తాబైన ఈ చిత్రం ఎట్టకేలకు దసరా సందర్భంగా విడుదలైంది. సీనియర్ హీరో అర్జున్ సర్జా మేనల్లుడు ధృవ సర్జా కథానాయకుడిగా నటించారు. కేజీయఫ్ తరహాలో భారీగా ఉన్న ఈ చిత్రం ఎలా ఉందంటే?
కథేంటంటే?(Martin Movie Story) : ఓ పోర్టులో కస్టమ్స్ ఆఫీసర్‌గా విధులు నిర్వర్తించే అర్జున్ (ధృవ సర్జా), నిజాయతీ, దేశభక్తి ఉన్న అధికారి. అయితే ఓ ఆపరేషన్ కోసం పాకిస్థాన్ వెళ్లిన అతడు, అక్కడ తానెవరన్నది కూడా మరిచిపోతాడు.
అనంతరం తనెవరో కనుక్కునే క్రమంలో ఉంచాడు అర్జున్. ఈ క్రమంలో తనకు సాయం చేసిన వాళ్లంతా చనిపోతుంటారు. ఇండియాలోని తన స్నేహితులు కూడా మరణిస్తారు. అర్జున్ను ప్రేమించిన ప్రీతి (వైభవి శాండిల్య) ప్రాణాలు కూడా ప్రమాదంలో పడతాయి.
మరి ఇండియాకు తిరిగొచ్చాక అర్జున్‌కు ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి? అసలు మార్టిన్ ఎవరు? అతనికీ, అర్జున్‌కు సంబంధం ఏమిటి? అన్నదే ఈ మూవీ కథ.
ఎలా ఉందంటే ? - కళ్లు చెదిరే విజువల్స్, భారీ హంగులతో కూడిన యాక్షన్ విన్యాసాలు, ఖరీదైన లొకేషన్లు, అడుగడుగునా భారీ ఎలివేషన్ షాట్స్ అన్ని సినిమాలో ఉన్నాయి. కథలోనే కాస్త బలం తగ్గినట్టు అనిపించింది. అయితే తెరపై విరోచితమైన విన్యాసాలు, ఖరీదైన సన్నివేశాలు బానే ఉన్నాయి. సినిమా ప్రారంభం నుంచి చివరి వరకూ యాక్షన్ హంగామానే. ప్రేమకథ, దేశభక్తి అంశాలున్నాయి. కానీ కాస్త భావోద్వేగాలు తక్కువనే చెప్పాలి.
మొత్తంగా సినిమా ధృవ సర్జా యాక్షన్ విన్యాసాలు, ఆయన చేసిన హంగామాతో సాగిపోయింది. పతాక సన్నివేశాలు పర్వాలేదనిపిస్తాయి.
ఎవరెలా చేశారంటే? - సినిమా స్థాయికి తగ్గట్టుగానే హీరో ధృవ సర్జా పాత్రను తీర్చిదిద్దారు. కండలు తిరిగిన దేహంతో కనిపిస్తూ, రెండు కోణాల్లో సాగే పాత్రలో ఆయన నటన బాగుంది. ఆయన పోరాట ఘట్టాలు కూడా బాగున్నాయి. హీరోయిన్ వైభవి అందంగా కనిపించింది. ఇతర నటులు తమ పాత్రల పరిధి మేరకు నటించారు. సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంది. కెమెరా పనితనం బాగుంది. విజువల్స్ ట్రెండీగా ఉన్నాయి. రవి బస్రూర్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ప్రభావం చూపించింది. దర్శకుడు అర్జున్ కథ చెప్పడంలో కాస్త తడబడ్డారు. హీరో అర్జున్ ఈ చిత్రానికి కథను. నిర్మాణం ఉన్నతంగా ఉంది.
చివరిగా : మార్టిన్ యాక్షన్ ప్రియులకు మాత్రమే
గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!