ETV Bharat / entertainment

'ధనుశ్​ 51' షూటింగ్ స్టార్ట్​​ - తిరుపతిలో మూవీ టీమ్ సందడి - ధనుశ్​ 51 మూవీ షూటింగ్​

Dhanush Nagarjuna Movie Shooting : ధనుశ్​, నాగార్జున కాంబినేషన్​లో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీకి సంబంధించిన షూటింగ్​ తాజాగా తిరుపతిలో జరిగింది. అయితే దీని కారణంగా అక్కడి ప్రజలకు అంతరాయం జరిగినట్లు తెలుస్తోంది. ఇంతకీ ఏం జరిగిందంటే ?

Dhanush Nagarjuna Movie Shooting
Dhanush Nagarjuna Movie Shooting
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 30, 2024, 2:14 PM IST

Updated : Jan 30, 2024, 2:27 PM IST

Dhanush Nagarjuna Movie Shooting : టాలీవుడ్ స్టార్ హీరో నాగార్జున, ధనుశ్​ లీడ్​ రోల్స్​లో క్లాసిక్​ డైరెక్టర్​ శేఖర్ కమ్ముల ఓ సినిమా రూపొందిస్తున్నారు. 'ధనుశ్​ 51' అనే వర్కింగ్ టైటిల్​తో తెరకెక్కుతున్న ఈ మూవీ సెట్స్​పైకి అడుగుపెట్టింది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ షూటింగ్ తిరుపతిలో జరుగుతోంది. అక్కడి అలిపిరి, హరేకృష్ణ మందిర ప్రాంతాల్లో చిత్రీకరణ సాగుతోంది. ఈ నేపథ్యంలో తమ అభిమాన తారలను చూసేందుకు ఫ్యాన్స్ గుమిగూడారు. దీంతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్​ ఏర్పడింది.

ఉదయం నుంచే చిత్రీకరణ ప్రారంభమైనందున అలిపిరి ప్రాంతంలో రోడ్డుకు ఇరువైపులా రెండు కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే పోలీసులు వెంటనే ఆ ప్రాంతానికి చేరుకుని ట్రాఫిక్‌ సమస్యను పరిష్కరించారు. అయితే చిత్ర నిర్మాణ యూనిట్ ముందుగానే అనుమతి తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఇక ధనుశ్​ 51 సినిమా విషయానికి వస్తే - ఈ సినిమాను శేఖర్ కమ్ముల ఓ రియల్ ఇన్సిడెంట్ ఆధారంగా ప్లాన్ చేస్తున్నట్టుగా అప్పట్లో రూమర్స్ వచ్చాయి. అంతే కాకుండా ఈ చిత్రం మొత్తం పీరియాడిక్ బ్యాక్ డ్రాప్​తో పాటు ఓ పొలిటికల్ డ్రామాగా ప్లాన్ చేస్తున్నట్టుగా సమాచారం. ఇక ఈ సినిమాలో ధనుశ్​తో పాటు రష్మిక జంటగా నటిస్తున్నారు. పూస్కూర్‌ రామ్మోహనరావు, సునీల్‌ నారంగ్‌ ఈ చిత్రానికి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి (ఏషియాన్ గ్రూప్)లో అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో కలిసి పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని రూపొందించనున్నారు.

మరోవైపు నాగార్జున ఇటీవలే 'నా సామి రంగ' సక్సెస్​ను అందుకున్నారు. సంక్రాంతి బరిలోకి వచ్చిన ఈ మూవీ మంచి టాక్​తో పాటు కలెక్షన్ల పరంగానూ సక్సెస్​ అందుకుంది. ధనుశ్​ కూడా 'కెప్టెన్​ మిల్లర్'​ అనే సినిమాతో థియేటర్లలో సందడి చేశారు. సంక్రాంతి కానుకగా కోలీవుడ్​లో ఈ సినిమా విడుదలవ్వగా, తెలుగులో తాజాగా ఈ సినిమా సందడి చేసింది. ఈ రెండింటి తర్వాత ఈ ఇద్దరూ కలిసి ఈ మూవీ షూటింగ్​లో బిజీగా ఉన్నారు.

ధనుష్​ కూడా తప్పని తిప్పలు- ఆ విషయంలో ఏకంగా ఏడ్చేశారట!

ఇంట్రెస్టింగ్​గా ధనుష్- శేఖర్ కమ్ముల మూవీ పోస్టర్! నాగార్జునతో లింక్ ఏంటి?

Last Updated : Jan 30, 2024, 2:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.