ETV Bharat / entertainment

దసరా బరిలో చైతూ - దేవరతో తండేల్​ బాక్సాఫీస్ ఫైట్! - Devara VS Thandel

Devara VS Thandel : దేవర చిత్రం కొత్త రిలీజ్​ డేట్​ను ఖరారు చేసుకోవడంతో బాక్సాఫీస్​ ముందు కొత్త పోరు తెరలేచెే అవకాశం కనిపిస్తోంది. అదే సమయంలో 'దేవర'తో పోటీపడేందుకు నాగచైతన్య సిద్ధమైనట్లు సమాచారం అందుతోంది.

దసరా బరిలో చైతూ - దేవరతో తండేల్​ బాక్సాఫీస్ ఫైట్!

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 18, 2024, 2:47 PM IST

Devara VS Thandel : ఆర్​ఆర్​ఆర్​ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్​ నటిస్తున్న భారీ బడ్జెట్ సినిమా దేవర. వేసవి కానుకగా ఏప్రిల్​లో రావాల్సిన ఈ చిత్రం కొన్ని అనివార్య కారణాల వల్ల దసరా బాక్సాఫీస్​కు రానుంది. అక్టోబర్ 10న సినిమా విడుదల కానుంది. అయితే దేవర చిత్రం ఈ కొత్త రిలీజ్​ డేట్​ను ఖరారు చేసుకోవడంతో బాక్సాఫీస్​ ముందు కొత్త పోరు తెరలేచెే అవకాశం కనిపిస్తోంది. అదే సమయంలో 'దేవర'తో పోటీపడేందుకు నాగచైతన్య సిద్ధమైనట్లు సమాచారం అందుతోంది.

వివరాల్లోకి వెళితే. అక్కినేని నాగచైతన్య చాలా రోజులుగా ఫ్లాపుల్లో ఉన్న సంగతి తెలిసిందే. బంగార్రాజు తర్వాత ఆయన మరో హిట్ అందుకోలేదు. థ్యాంక్యూ, లాల్ సింగ్ చద్ధా, కస్టడీ వంటి చిత్రాలు వరుసగా డిజాస్టర్లుగా నిలిచాయి. అయితే రీసెంట్​గా ఓటీటీలో వచ్చిన దూత వెబ్​ సిరీస్​ మాత్రం మంచి సక్సెస్ అందుకుంది. దీంతో ఆచితూచి ఎలాగైన సరైన థియేటర్ హిట్ అందుకోవాలని తండేల్ కథను ఎంచుకున్నారు చైతూ.

రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్​తో చందు మొండేటి దీన్ని తెరకెక్కిస్తున్నారు. చైతూ కెరీర్​లోనే బిగ్గెస్ట్ ప్రాజెక్ట్​గా ఈ తండేల్​ రూపొందుతోంది. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. గుజరాత్‌ సూరత్​లోని ఒక మత్స్యకారుడి నిజ జీవితంలో జరిగిన ఘటనల ఆధారంగా ఇది తెరకెక్కుతోందని తెలుస్తోంది. ఈ కథంతా సముద్ర తీర ప్రాంతం చుట్టూనే తిరుగనుంది. శ్రీకాకుళంలో మొదలై పాకిస్థాన్ వరకూ చేరుకుంటుందట. సాయిపల్లవి హీరోయిన్​గా నటిస్తోంది. అయితే ఈ చిత్రాన్ని దసరా సమయంలోనే విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించినట్లు తెలిసింది. ప్రస్తుతం ఈ విషయం ఫిలిం సర్కిల్స్​లో చక్కర్లు కొడుతోంది. ఒకవేళ ఇదే కనుక నిజమైతే ఈ దసరాకి బాక్స్ ఆఫీస్ దగ్గర 'దేవర' వర్సెస్​ 'తండేల్' సినిమాల మధ్య గట్టి పోటీ ఉండే అవకాశం ఉంటుంది. ఇక్కడ మరో విశేషమేంటంటే ఈ రెండు సినిమాలు సముద్రం బ్యాక్ డ్రాప్​తోనే వస్తున్నాయి.

'దేవర' లో తండ్రీ, కొడుకులుగా 'దేవర' చిత్రంలో ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేస్తున్నారని తెలిసింది. ఎందుకంటే రీసెంట్​గా రిలీజ్​ చేసిన పోస్టర్​లో తారక్​ యంగ్ లుక్​లో కనిపించారు. ఇంకా ఈ పోస్టర్ మీద దేవర పేరులో 'వర' అని రెడ్ కలర్ థీమ్​ను హైలైట్ చేశారు. దీంతో తారక్​ తండ్రి, కొడుకులుగా అలరించబోతున్నట్లు అంతా అనుకుంటున్నారు. బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ ఈ సినిమాతో టాలీవుడ్ అరంగేట్రం చేస్తోంది. ప్రకాశ్ రాజ్‌, శ్రీకాంత్‌, టామ్‌ షైన్‌ చాకో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. నందమూరి కళ్యాణ్‌ రామ్‌ సమర్పణలో ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌, యువసుధ ఆర్ట్స్‌ బ్యానర్‌పై మిక్కిలినేని సుధాకర్‌, హరిక్రష్ణ కే చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ట్రెండింగ్​గా యంగ్ లయన్​ మోక్షజ్ఞ లేటెస్ట్ లుక్​ - చూస్తే కాలర్ ఎగరేయాల్సిందే!

హ్యాపీ బర్త్​ డే అనుపమ - టిల్లుగాడి దెబ్బకు మందు కొడుతూ - మసాలా డోస్​తో గ్లామర్ షో

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.