ETV Bharat / entertainment

ఆ 3 సవాళ్లను బ్రేక్ చేస్తేనే 'దేవర' సక్సెస్​ - తారక్ ఏం చేస్తారో? - Devara NTR movie release

Devara NTR : దేవర కొత్త రిలీజ్ డేట్​తో ఫ్యాన్స్​లో కొత్త టెన్షన్ మొదలైంది. తారక్​ ముందు మూడు సవాళ్లు నిలిచాయి. మరి ఎన్టీఆర్​ వాటిని బ్రేక్ చేస్తారో లేదో చూడాలి.

ఆ 3 సెంటిమెంట్స్​ను బ్రేక్ చేస్తేనే 'దేవర' సక్సెస్​ - తారక్ ఏం చేస్తారో?

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 17, 2024, 5:12 PM IST

Devara NTR : RRR తర్వాత ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న ఫుల్ మాస్ యాక్షన్​ చిత్రం దేవర. కొరటాల దర్శకత్వంలో రానున్న ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. అయితే ఏప్రిల్ 5కు రావాల్సిన ఈ చిత్రం దసరా పోటీకి రెడీ అయింది. అయితే ఇప్పుడీ కొత్త రిలీజ్ డేట్​తో ఫ్యాన్స్​కు మరో కొత్త టెన్షన్ మొదలైంది. అలానే తారక్​ ముందు మూడు సవాళ్లు కూడా నిలిచాయి.

అందులో మొదటిది - రాజమౌళితో చేసిన తర్వాత సినిమా చేస్తే అది ఫ్లాప్ అవుతుంది. దానికి ఇప్పటికే చాలా ఉదాహరణలు ఉన్నాయి. ఆర్​ఆర్​ఆర్​ తర్వాత రామ్​చరణ్​ ఆచార్యతో భారీ డిజాస్టర్​ను అందుకున్న సంగతి తెలిసిందే. అంతకుముందు నితిన్, రవితేజ, ప్రభాస్ లాంటి హీరోలందరూ ఈ బాధితులే. మరి ఇప్పుడు ఎన్టీఆర్ దేవరతో ఆ సెంటిమెంట్​ను బ్రేక్​ చేస్తారా లేదా అనేది ఇండస్ట్రీలో పెద్ద ఇంట్రెస్టింగ్​గా మారింది.

ఇంకా ఎన్టీఆర్​కు దసరా సీజన్ పెద్దగా కలిసి రాదనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. రామయ్య వస్తావయ్యా, ఊసరవెళ్లి సహా పలు సినిమాలు ఓపెనింగ్స్​ను​ భారీగానే అందుకున్న పెద్దగా లాభాలను, పెట్టిన పెట్టుబడులను అందుకోలేకపోయాయని ట్రేడ్ వర్గాల సమాచారం. అయితే అక్టోబర్ నెలలో వచ్చిన బృందావనం చిత్రం మాత్రం అపట్లో మంచి సక్సెస్ అయింది.

ఇక ఎన్టీఆర్ ఇప్పటికే ఎన్నో సార్లు ద్విపాత్రాభినయం, త్రిపాత్రాభినయం కూడా చేశారు. అయితే ఆయన ​ తండ్రి కొడుకులుగా చేసిన సినిమాలు బాక్సాఫీస్ ముందు నిరాశ పరిచాయి. భారీ అంచనాలతో వచ్చిన అంధ్రావాలా, శక్తి తేడా కొట్టాయి. ఇప్పుడు దేవరలోనూ ఎన్టీఆర్​ తండ్రి కొడుకు పాత్రల్లో డబుల్ రోల్ చేస్తున్నారు. చూడాలి మరి ఈ మూడు సెంటిమెంట్స్​ను ఎన్టీఆర్​ బ్రేక్ చేసి దేవరతో భారీ సక్సెస్​ను అందుకుంటారో లేదో..

కాగా, ప్రస్తుతం చిత్రంలో ప్రతినాయకుడిగా నటిస్తున్న బాలీవుడ్ స్టార్ సైఫ్​ అలీ ఖాన్​ ఈ మధ్యే గాయపడి కోలుకుంటున్నారు. ఆయనకు సంబంధించిన షూట్​ డిలే అవుతోంది. ఇక ఈ చిత్రంతో జాన్వీ కపూర్ టాలీవుడ్​ అరంగేట్రం చేస్తోంది. శ్రీకాంత్, మలయాళ స్టార్​ షైన్ టామ్ చాకో ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సినిమాలో అండర్‌ వాటర్‌ సీక్వెన్స్‌ సినిమాకే హైలైట్ అని చెబుతున్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

బాక్సాఫీస్ కింగే అయినా​ - భార్య కోసం గల్లీలోని కిరాణా కొట్టుకు!

NBK 109 వర్సెస్​ దేవర : బాబాయ్ -​ అబ్బాయ్​ బాక్సాఫీస్ ఫైట్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.