ETV Bharat / entertainment

నార్త్​ అమెరికాలో 'దేవర' విధ్వంసం! - వారంలోనే ఆ హిట్ మూవీ రికార్డును బ్రేక్​ చేసేందుకు రెడీ! - Jr NTR Devara Movie - JR NTR DEVARA MOVIE

Devara North America Ticket Bookings : జూనియర్ ఎన్​టీఆర్ 'దేవర' మూవీ ప్రస్తుతం నార్త్​ అమెరికా ప్రీ సేల్స్​లో రోజుకో కొత్త రికార్డు నెలకొల్పుతోంది. ఈ నేపథ్యంలో త్వరలోనే మరో ఘనతను సొంతం చేసుకోనుంది. ఇంతకీ అదేంటంటే?

Devara North America Ticket Bookings
Devara North America Ticket Bookings (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 22, 2024, 9:28 AM IST

Devara North America Ticket Bookings : జూనియర్ ఎన్​టీఆర్​ అప్​కమింగ్ మూవీ 'దేవర'పై రోజు రోజుకూ అంచనాలు మరింతగా పెరిగిపోతున్నాయి. ఇప్పటికే వచ్చిన ట్రైలర్​, ప్రమోషనల్ ఈవెంట్స్​తో హైప్​ పెరగ్గా, ప్రేక్షకులు కూడా ఈ మూవీని థియేటర్లలో చూసేందుకు వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే, అడ్వాన్స్ బుకింగ్స్​ విషయంలో 'దేవర' సరికొత్త రికార్డ్స్​ను క్రియేట్ చేస్తోంది. ముఖ్యంగా ఓవర్సీస్​లో టికెట్లు నిమిషాల్లో అమ్మడై సంచలనాలు క్రియేట్ చేస్తోంది. ఈ నేపథ్యంలో అక్కడ ఈ సినిమా తాజాగా ఓ సరికొత్త ఘనతను అందుకోనున్నట్లు తెలుస్తోంది. దీని వల్ల 'కల్కి 2898 ఏడీ' రికార్డు బ్రేక్ సూచనలు కనిపిస్తున్నాయని సినీ వర్గాల మాట.

నార్త్ అమెరికాలో తొలి వారాంతంలో 'కల్కి 2898 ఏడీ' 11 మిలియన్ల డాలర్లకు పైగా కలెక్షన్లు సాధించి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. అంతే కాకుండా మొదటి వారాంతంలో ఈ మార్కును క్రియేట్ చేసిన తొలి ఇండియన్ ఫిల్మ్​గా నిలిచింది. కానీ, ఇప్పుడు 'దేవర' జరుగుతున్న ప్రీ బుకింగ్స్​ లెక్కలు చూస్తుంటే ఈ చిత్రం తొలి వారంలోనే 11 మిలియన్ల డాలర్ల రికార్డును బ్రేక్ చేయనున్నట్లు తెలుస్తోంది.

ఇక 'దేవర' సినిమా విషయానికి వస్తే ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్​గా నటిస్తోంది. సీనియర్ నటుడు సైఫ్ అలీ ఖాన్ విలన్​గా నటించనున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ డ్యుయల్ రోల్​లో కనిపించనున్నారు. శ్రీకాంత్, శ్రుతి మారాఠే, చైత్ర రాయ్, షైన్ టామ్, మురళీ శర్మ, ప్రకాశ్ రాజ్, రమ్యకృష్ణ తదితరులు నటించారు. అనిరుధ్ రవిచంద్రన్ సంగీంతం అందించగా, రత్నవేలు డీఓపీ బాధ్యతలు చూశారు. ఎన్టీఆర్, యువసుధ బ్యానర్లపై సంయుక్తంగా రూపొందిన ఈ సినిమా సెప్టెంబర్ 27న రిలీజ్ కానుంది.

ఇక ఇటీవల విడుదలైన ట్రైలర్​కు మంచి రెస్పాన్స్ వచ్చింది. హై లెవెల్ వీఎఫ్​ఎక్స్, అండర్ వాటర్ సీన్స్​ బాగా ఆకట్టుకున్నాయి. ఎన్టీఆర్, జాన్వీ లుక్స్, యాక్షన్ సీన్స్ ట్రైలర్​లో చూపించారు. 10రోజుల్లోనే ఈ ట్రైలర్​కు తెలుగులో 43+ మిలియన్ల వ్యూస్ వచ్చాయి. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ఈ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కించారు.

'దేవర' పాన్ ఇండియా ప్రమోషన్స్ ​- సందీప్ వంగాతో, కపిల్​ శర్మతో తారక్ నవ్వులే నవ్వులు! - NTR Devara Promotions

'దేవర' వీఎఫ్​ఎక్స్​ కోసం 30 రోజులు నిద్ర లేకుండా - అంచనాలకు మించేలా! - NTR Devara Movie VFX

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.