NTR Devara Trailer : ట్రైలర్ రిలీజ్‌కు ముందే దేవర సినిమా టికెట్ల ప్రీ సేల్ వన్ మిలియన్ డాలర్ల మార్క్‌ను టచ్ చేయడంపై యంగ్ టైగర్ ఎన్టీఆర్ స్పందించారు. దైవ ఆశీస్సులు, ఫ్యాన్స్, సినీ ప్రేక్షకుల ప్రేమ వల్లే అది సాధ్యమైందని పేర్కొన్నారు. ట్రైలర్ లాంఛ్ ఈవెంట్లో ఎన్టీఆర్ ఈ విధంగా స్పందించారు.
Devara Pre Sales One Million Tickets : దేవర గురించి మాట్లాడుతూ "RRRలో రామ్ చరణ్‌తో కలిసి నటించాను. ఆరేళ్ల తర్వాత నా సోలో మూవీ రిలీజ్ కానుంది. అందుకే కాస్త టెన్షన్‌గానూ ఉంది. రిలీజ్ కోసం ఇంట్రెస్టింగ్ ఎదురుచూస్తున్నాను. ముంబయిలో ట్రైలర్ విడుదల చేయడం ఎంతో ఆనందంగా ఉంది. 'ఆర్‌ఆర్ఆర్' ప్రమోషన్స్‌లో టైమ్‌లో నార్త్ ఆడియెన్స్ ఆదరణ చూసి ఆశ్చర్యపోయాను. ఈ కొత్త మూవీని కూడా ఆదరిస్తారని ఆశిస్తున్నాను" అని తారక్ పేర్కొన్నారు.
"దేవర విజువల్స్ సూపర్‌గా ఉంటాయి. చివరి 40 నిమిషాలు అయితే ప్రత్యేకంగా ఆకట్టుకుంటుంది. సినిమా సినిమాకీ కొరటాల శివపై నా ప్రేమ, గౌరవం పెరుగుతోంది. ఆయనతో చాలా కాలంగా పరిచయం, ప్రేమ ఉంది. నా బృందావనం చిత్రానికి శివ రచయితగా ఉన్నారు. కమర్షియల్ సినిమాల్లో ప్రజల్లో ధైర్యాన్ని నింపుతూ ముందుకు తీసుకెళ్తుంటాడు హీరో. కానీ దేవర దానికి భిన్నంగా ఉంటుంది. ఇందులో మనిషిని చంపేంత ధైర్యంతో ఉండే కొందరికి హీరో భయాన్ని పరిచయం చేస్తాడు. అండర్ వాటర్‌లో 38 రోజులు షూటింగ్ చేశాము. హై ఓల్టేజ్ యాక్షన్‌తో ఈ మూవీ రాబోతుంది" అని ఆసక్తి రేకెత్తించారు తారక్.
'జనతా గ్యారేజ్' తర్వాత తారక్‌తో కలిసి పని చేయడంపై దర్శకుడు కొరటాల శివ మాట్లాడారు. "తారక్ నా క్లోజ్ ఫ్రెండ్. ఒక్క సారి కెమెరా ఆన్ అయితే పాత్రకు తగ్గట్టుగా మారిపోతారు." అని అన్నారు. జాన్వీ కపూర్ గురించి కూడా మాట్లాడారు కొరటాల. "ఎన్టీఆర్ - జాన్వీ కపూర్ జోడీ బాగుంది. అప్పుడు సీనియర్ ఎన్టీఆర్ - శ్రీదేవిలా ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ - జాన్వీ" అని అన్నారు.