ETV Bharat / entertainment

దీపికా డెబ్యూ తెలుగు సినిమా 'కల్కి 2898 AD' కాదు? ఏదో తెలుసా? - Kalki 2898 AD Movie - KALKI 2898 AD MOVIE

Deepika Padukone Kalki Movie : 'కల్కి 2898 AD' భారీ అంచనాల మధ్య త్వరలో రిలీజ్‌ కానున్న నేపథ్యంలో నటి దీపికా పదుకుణె గురించి ఓ ఆసక్తికరమైన విషయం తెలిసింది. ఇదే ఆమె మొదటి తెలుగు సినిమా అని చాలా మంది భావిస్తున్నారు. కానీ అది నిజం కాదు. ఇంతకీ దీపికా నటించిన తొలి తెలుగు సినిమా ఏదంటే?

Deepika Padukone Kalki Movie
Deepika Padukone Kalki Movie (Associated Press)
author img

By ETV Bharat Telugu Team

Published : Jun 25, 2024, 9:33 PM IST

Deepika Padukone Kalki Movie : 'కల్కి 2898 AD' మూవీ ప్రపంచ వ్యాప్తంగా జూన్‌ 27న విడుదల కాబోతోంది. ఇందులో బాలీవుడ్‌ నటి దీపికా పదుకొణె కీలక పాత్ర పోషించింది. ఆమె సుమతి (SUM-80)గా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉంది. అయితే చాలా మంది దీపికా పదుకొణెది ఇదే తొలి తెలుగు సినిమా అని అనుకుంటారు. కానీ అది నిజం కాదు. 'కల్కి 2898 AD' విడుదల సమీపిస్తున్న వేళ, దీపికా పదుకొణె గురించి ఒక ఆసక్తికరమైన విషయం ఇప్పుడు తెలుసుకుందాం.

దీపికా మొదటి తెలుగు సినిమా ఏది?
ఎక్కువ మంది భావిస్తున్నట్లు 'కల్కి' దీపిక, మొదటి తెలుగు మూవీ కాదు. ఆమె 2009లో జయంత్ సి.పరాన్జీ దర్శకత్వం వహించిన 'లవ్ 4 ఎవర్‌'తో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఇందులో రణదీప్, మృదుల ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాలో దీపిక ఓ స్పెషల్‌ సాంగ్‌లో కనిపించింది. ఆమె షూటింగ్ కూడా పూర్తి చేసింది. అయితే వివిధ కారణాల వల్ల సినిమా విడుదల కాలేదు. అలా ఆమె తెలుగు అరంగేట్రం ప్రేక్షకులకు కనిపించకుండా పోయింది. ఇప్పుడు చాలా సంవత్సరాల తర్వాత, 'కల్కి 2898 AD'లో ముఖ్యమైన పాత్రతో తెలుగు ఇండస్ట్రీలోకి తిరిగి అడుగుపెట్టింది.

సైన్స్‌ ఫిక్షన్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌లో అగ్ర నటులు
వైజయంతి మూవీస్‌ రూపొందించిన సైన్స్‌ ఫిక్షన్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌లో ప్రభాస్‌, దీపికా పదుకొణెతో పాటు చాలా మంది ప్రముఖ స్టార్లు నటించారు. అందులో అమితాబ్‌ బచ్చన్‌, కమల్ హాసన్, దిశా పటాని, రాజేంద్ర ప్రసాద్, పశుపతి, శోభన, మృణాల్ ఠాకూర్, మాళవిక నాయర్, శాశ్వత ఛటర్జీ తదితరులు ఉన్నారు. ఈ మూవీకి సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు.

అద్భుతమైన సినిమాటిక్‌ ఎక్స్‌పీరియన్స్‌
'కల్కి 2898 AD' మూవీ 2D, 3D, IMAX, 4DX ఫార్మాట్స్‌లో అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌ అందించనుంది. వరల్డ్‌ వైడ్‌ వివధ భాషల్లో రిలీజ్‌ కానుంది. జూన్‌ 26న ఒకరోజు ముందు ఓవర్సీస్‌లో రిలీజ్‌ అవుతుంది. తాజాగా ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ ప్రీ సేల్స్‌ ఓపెన్‌ చేయగా కొత్త రికార్డులు క్రియట్‌ అవుతున్నాయి. సలార్‌ ప్రీ సేల్‌ బుకింగ్స్‌ను 'కల్కి' రిలీజ్‌కు ఒక్కరోజు ముందుగానే క్రాస్‌ చేసింది. ప్రీ సేల్స్‌ ప్రారంభించిన గంటల్లోనే 'ఆర్‌ఆర్‌ఆర్‌' రికార్డులను బ్రేక్‌ చేసింది. ఇప్పటి వరకు కేవలం నార్త్‌ అమెరికాలోనే 1,25,000 టికెట్స్‌ అమ్ముడైనట్లు నిర్మాణ సంస్థ తెలిపింది.

అందుకే 'కల్కి' చిత్రాన్ని ఒప్పుకున్నాను : కమల్​ హాసన్​ - Kalki 2898 AD Movie

దుమ్మురేపుతున్న 'కల్కి' బుకింగ్స్​ - 5 లక్షలకు పైగా టికెట్లు సోల్డ్ ఔట్​! - kalki 2898AD Bookings

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.