ETV Bharat / entertainment

'దీపావళికి మోత మోగిపోద్ది మనదే ఇదంతా' - రవితేజ RT75 టైటిల్ పోస్టర్ రిలీజ్​ - RAVITEJA RT75 TITLE POSTER

మాస్​ మాహారాజా రవితేజ RT75 టైటిల్, రిలీజ్​ డేట్​ పోస్టర్ రిలీజ్!​

Raviteja RT75 Title Release Date Poster Released
Raviteja RT75 Title Release Date Poster Released (source ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 30, 2024, 4:34 PM IST

Raviteja RT75 Title Release Date Poster Released : మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం తన 75వ సినిమా చేస్తున్నారు. ఈ మూవీ షూటింగ్​తోనే​ బిజీగా ఉంటున్నారు. డెబ్యూ డైరెక్టర్ భాను భోగవరపు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్ట్యూన్ ఫోన్ సినిమాస్​ సంస్థ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. నాగవంశీ, సాయి సౌజన్య నిర్మాతలుగా వ్యవహరిస్తున్నరు.

#RT75 అనే వర్కింగ్ టైటిల్​తో చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా నుంచి తాజాగా మేకర్స్ అదిరిపోయే దీపావళి అప్డేట్ ఇచ్చారు. టైటిల్, ఫస్ట్ లుక్​ పోస్టర్​ను విడుదల చేశారు.

'RT75' చిత్రానికి మాస్ జాతర అనే టైటిల్​ను ఖరారు చేశారు. మనదే ఇదంతా క్యాప్షన్ జోడించారు. సినిమాను వచ్చే ఏడాది 2025 మే 9న థియేటర్లలో గ్రాండ్​గా రిలీజ్​ చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు. ఈ విషయాన్ని టైటిల్​ పోస్టర్‌ ద్వారా వెల్లడించారు. దీపావళికి మోత మోగిపోద్ది, మనదే ఇదంతా అంటూ రాసుకొచ్చారు. పోస్టర్​లో రవితేజ చేతిలో గంట పట్టుకుని రివాల్వర్​ ప్యాంటులో పెట్టుకుని స్మైలింగ్​ లుక్​లో మాస్​ నడుస్తూ కనిపించారు. బ్యాక్​గ్రౌండ్​లో అంతా యాక్షన్ మోడ్ కనిపిస్తోంది. దీంతో ఈ స్టిల్​ యాక్షన్ సీక్వెల్​ చిత్రీకరణలోనిది అని అర్థమవుతోంది. ​ఈ తాజా టైటిల్, రిలీజ్ డేట్​ పోస్టర్​ అప్డేట్​తో మాస్ మహారాజా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.

ఇకపోతే మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్​గా రూపొందుతున్న ఈ సినిమాలో రవితేజ సరసన శ్రీలీల మరోసారి సందడి చేయనుంది. ఇప్పటికే ఈ ఇద్దరూ కలిసి నటించిన 'ధమాకా' బాక్సాఫీస్ వద్ద భారీ సక్సెస్​ను అందుకున్న సంగతి తెలిసిందే. సినిమాలో వీళ్లిద్దరి కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. ఇద్దరూ మాస్ డ్యాన్స్​తో అదరగొట్టేశారు. దీంతో ఇప్పుడు మరోసారి ఈ జోడి కలిసి నటిస్తుండటంతో ఈ సినిమాపై సినీ ప్రియుల్లో ఆసక్తి నెలకొంది.

కాగా, ఈ మాస్​ జాతర డెబ్యూ డైరెక్టర్​ భాను భోగవరపు గతంలో చిరంజీవి హీరోగా వచ్చిన వాల్తేరు వీరయ్యకు మాటల రచయితగా పని చేశారు. ఈ మూవీకి భీమ్స్‌ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు.

ఆ నటితో 'కలర్ ఫొటో' డైరెక్టర్​ సందీప్ రాజ్ పెళ్లి!

'నన్ను క్షమించండి - NBK 109 టైటిల్ అప్డేట్ అందుకే ఇవ్వలేకపోయాం' : నాగవంశీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.