Daniel Balaji Died With Heart attack : ప్రముఖ కోలీవుడ్ నటుడు డేనియల్ బాలాజీ హఠాన్మరణం చెందారు. గుండెపోటుతో డేనియల్ బాలాజీ కన్నుమూసినట్లు తెలుస్తోంది. దీంతో తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. కోలీవుడ్ మీడియా నుంచి అందిన సమాచారం ప్రకారం డేనియల్ బాలాజీ ఛాతి నొప్పితో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో వెంటనే కుటుంబ సభ్యులు ఆయన్ను చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆయన మృతి చెందారు. ఈ విషయం తెలుసుకుంటున్న అందరూ షాక్ అవుతున్నారు. పలువురు సినీ ప్రముఖులు, సామాన్యులు ఆయనకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు. కాగా, నేడు(మార్చి 30) చెన్నైలోని పురసామివాకంలో డేనియల్ బాలాజీ అంత్యక్రియలను నిర్వహించబోతున్నారని తెలిసింది.
డేనియల్ బాలాజీ తెలుగు మూలాలు ఉన్న నటుడు. ఆయన తండ్రి తెలుగువాడు. తల్లి తమిళం. దీంతో డేనియల్ తమిళ.దర్శకుడిగా మారాలని సినిమాల్లోకి వచ్చారు. కానీ నటుడిగా స్థిరపడ్డారు. దర్శకుడు గౌతమ్ మేనన్‌తో డేనియల్ బాలాజీకి మంచి అనుబంధం ఉంది. ఆయన తమిళంతో పాటు తెలుగు, మలయాళం, కన్నడలోనూ సినిమాలు చేశారు. ఎక్కువగా ప్రతినాయకుని పాత్రల్లో కనిపించి మెప్పించారు. చిట్టి అనే తమిళ సీరియల్‌తో కెరీర్ ప్రారంభించిన ఆయన ఆ తర్వాత ఏప్రిల్ మదాతిల్, కాదల్ కొండెన్ వంటి చిత్రాల్లో నటించి పాపులర్ అయ్యారు.
కమల్‌హాసన్, గౌతమ్ మీనన్ కాంబోలో విడుదలై సూపర్ హిట్ అందుకున్న వెట్టైయాడు విలయాడులో (తెలుగులో రాఘవన్) సైకో పాత్రలో తన విలనిజంతో భయపెట్టేశారు. దీంతో మరింత క్రేజ్ సంపాదించుకున్నారు. ఆ తర్వాత పొల్లవదన్, అచ్చం యెన్‌బదు మదమైయదా, జ్ఞానకిరుక్కన్, వడాచెన్నై, బిగిల్‌తో పాటు పలు చిత్రాలు ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. చివరగా గతేడాది అరియవాన్ అనే సినిమాలో కనిపించారు.
తెలుగులోనూ పలు చిత్రాల్లో నటించారు డేనియల్ బాలాజీ. ఎన్టీఆర్ సాంబ చిత్రంతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చారు. అనంతరం వెంకటేశ్ ఘర్షణ చిత్రంలో హీరో ఫ్రెండ్స్ గ్యాంగ్‌లో ఒకరిగా కనిపించి మెప్పించారు. రామ్‌చరణ్ చిరుత, నాగచైతన్య సాహసం శ్వాసగా సాగిపో సినిమాల్లోనూ నటించారు. నాని టక్ జగదీష్‌లోనూ మెయిన్ విలన్‌గా కనిపించి ఆకట్టుకున్నారు. ఇదే ఆయన చివరి తెలుగు చిత్రం.
-
We Have Lost One of The Best Ever Villains In KTown...!!! 💔#RIPDanielBalaji pic.twitter.com/yvd9Ymnre8
— ⚔️🐯Vijay Prabhakaran🐯⚔️ (@Vijay7291Vijay) March 29, 2024
టిల్లు ఈజ్ బ్యాక్ - సిద్ధు, అనుపమ జోడీ సీక్వెల్లో మేజిక్ చేసిందా? - Tillu Square Telugu Review
ఫ్రెండ్స్ చేసిన పనితో ఒక్కసారిగా దిశ పటానీ లైఫ్ టర్న్! - Disha Patani Dhoni Movie